మారుతి సుజుకి నుంచి కంపాక్ట్ MPV.. ఆకర్షణీయమైన డిజైన్ సహా ఎన్నో ప్రత్యేకతలు..!
మారుతి సుజుకి.. భారత్ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఉన్న ప్రముఖ సంస్థల్లో ఒకటిగా ఉంది. భారత్‌లో ఇప్పటికే మారుతి సుజుకి (Maruti suzuki) అనేక మోడల్ కార్లను విక్రయిస్తోంది. అయితే మారుతి సుజుకి కొత్త కార్లపై ఆసక్తికర వార్ల వెలుగులోకి వచ్చింది. తమ ఎంపీవీ ఫోర్ట్‌ఫోలియోను విస్తరిస్తున్నట్లు తెలుస్తోంది. మారుతి కొత్త కంపాక్ట్ ఎంపీవీ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ అమ్ముడైన SUVల సంస్థగా మారుతి సుజుకి నిలిచింది. రానున్న రెండేళ్లలో తన UV లను మరింత విస్తరించేందుకు ప్రణాళికలను రచిస్తోంది. దీంతోపాటు ఈ సంవత్సరం మారుతి నుంచి కొత్త జనరేషన్ స్విఫ్ట్, డిజైర్ మార్కెట్‌లోకి విడుదల కానున్నాయి. దీంతోపాటు మారుతి సుజుకి తొలి ఎలక్ట్రిక్ కారు eVX.. 2024 సంవత్సరం చివరలో విడుదల కానుంది.

మారుతి సుజుకి నుంచి కొత్త ఎంపీవీ : దీంతో 7 సీటర్ వెర్షన్ మారుతి సుజుకి గ్రాండ్ విటారా 2025లో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ వాహనం అభివృద్ధి దశలో ఉందని తెలుస్తోంది. అయితే మారుతి సుజుకి నుంచి సరికొత్త కంపాక్ట్ MPV త్వరలో రానుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఎంపీవీ అభివృద్ధి దశలో ఉందని తెలుస్తోంది.
YDB కోడ్‌తో ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది : మారుతి సుజుకి కంపాక్ట్ ఎంపీవీ YDB కోడ్‌తో అభివృద్ధి చేస్తోంది. ఈ కొత్త ఎంపీవీ ప్రస్తుతం జపాన్‌లో అమ్ముడవుతున్న స్పేసియా ఆధారంగా రూపొందుతోంది. అయితే కొన్ని డిజైన్ మార్పులు ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్పేసియా వాహనం 3,395mm పొడవును కలిగి ఉంది. అయితే మారుతి కొత్త కంపాక్ట్ ఎంపీవీ కంటే పొడవును కలిగి ఉంటుందని తెలుస్తోంది.

బాక్సీ డిజైన్ సహా స్లైడింగ్ డోర్ : కొన్ని పన్నుల నుంచి సడలింపుల కోసం 4 మీటర్ల కంటే తక్కువగా ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం భారత్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉన్న ఎర్టిగా కంటే చిన్నగా ఉండే అవకాశం ఉంది. బాక్సీ డిజైన్‌ను కలిగి ఉంటుంది. అయితే ఉత్పత్తి ఖర్చులకు తగ్గించేందుకు వెనుకవైపు స్లైడింగ్ డోర్లను ఎంచుకోవచ్చు. ఈ కొత్త కారు నెక్సా ప్రీమియం అవుట్‌లెట్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
జపాన్‌లో అందుబాటులో ఉండే స్పేసియోతో పోలిస్తే విశాలమైన ఇంటీరియర్‌ను కలిగి ఉంటుంది. రెనాల్ట్ ట్రైబర్‌తో పోటీపడనుంది. మరియు ఇంజిన్, పనితీరు విషయానికి వస్తే రాబోయే స్విఫ్ట్ 1.2 LZ సిరీస్ 3 సిలిండర్ మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ ఇంజిన్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో జతచేయబడుతుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








