550 కి.మీ రేంజ్‌తో eVX కాన్సెప్ట్.. తక్కువ ధరలో ఫ్లెక్స్ ఫ్యూయెల్ Wagon R.. జోరు మీదున్న మారుతి సుజుకి
ప్రముఖ కార్ల తయారీ కంపెనీల అప్‌కమింగ్ ఇంకా సరికొత్త మోడళ్ల ప్రదర్శనకు ఢిల్లీలో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2024 వేదికగా నిలిచింది. ఈ ఈవెంట్ ప్రముఖ ఆటో కంపెనీలు త్వరలో విడుదల చేయబోతున్న కార్ల ప్రదర్శనతో కనువిందుగా మారింది. కాగా మారుతి సుజుకి(Maruti Suzuki).. తన అప్‌కమింగ్ రెండు కార్లను ప్రదర్శించింది.
మారుతి సుజుకి(Bharat Mobility Global Expo 2024) నుంచి త్వరలో eVX కాన్సెప్ట్‌తో సరికొత్త కారు వచ్చే ఏడాది విడుదల కానుంది. టయోటా భాగస్వామ్యంతో మారుతి సుజుకి టొయోటా యొక్క 27PL స్కేట్‌బోర్డ్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా ఈ కారును నిర్మిస్తున్నారు. విశాలమైన క్యాబిన్‌తో ఈ కారును రూపొందించింది. కాగా ఈ కారు ఇప్పటికే టెస్టింగ్ దశలో ఉంది.

భారత మార్కెట్లో ఈ మోడల్ ప్రారంభ ధర రూ. 22 లక్షల నుంచి ప్రారంభమవుతుందని అంచనా.. eVX కాన్సెప్ట్ ఎక్స్‌టీరియర్ డిజైన్ బోల్డ్ లుక్‌తో మరింత స్టైలిష్‌గా ఉంటుంది. మారుతి సుజుకి బ్రెజ్జాను పోలి ఉండేలా క్లామ్‌షెల్ బానెట్ డిజైన్‌తో వస్తుంది. ఐకానిక్ 'S' లోగోతో అందంగా గ్రిల్, బంపర్‌పై తక్కువగా ఉంటుంది. కానీ సొగసైన V-ఆకారపు కట్‌లు హెడ్‌ల్యాంప్‌లతో వస్తుంది.
పగటిపూట రన్నింగ్ లైట్లతో ఆకర్షణీయంగా ఉంటుంది. మస్క్యులర్ క్యారెక్టర్ లైన్‌లు, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ ఇంకా లో ప్రొఫైల్ టైర్‌లతో దృష్టిని ఆకర్షించే బ్లాక్డ్-అవుట్ ఏరో వీల్స్‌తో వస్తుంది. వెనుక భాగంలో టెయిల్‌గేట్ అంతటా హై-పొజిషన్డ్ LED టెయిల్ ల్యాంప్ స్ట్రిప్‌తో వస్తుంది. గుజరాత్‌లోని మారుతి సుజుకి ప్లాంట్‌లో 2025లో ఈ కారు ఉత్పత్తి కానుంది.

ఇక ఇంటీరియర్‌లు లేత గోధుమరంగు టోన్‌తో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఫీచర్ల పరంగా ఫ్లోటింగ్ స్క్రీన్, పనోరమిక్ సన్‌రూఫ్ మరియు ఎలక్ట్రికల్‌గా అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లను కలిగి ఉండనుంది. సేఫ్టీ ఫీచర్ల విషయానికొస్తే.. స్టాండర్డ్ లెవెల్-2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS)తో పాటు 360-డిగ్రీ కెమెరా యాంగిల్‌తో Headline Grabber eVX కాన్సెప్ట్ రానుంది.
బ్యాటరీ విషయానికొస్తే కొత్త మారుతి సుజుకి eVX కాన్సెప్ట్ సురక్షితమైన బ్యాటరీ ప్యాక్‌తో.. 60kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుందని తెలుస్తోంది. మారుతి సుజుకి eVX పవర్‌ట్రెయిన్ గురించి సంస్థ సమాచారం వెల్లడించనప్పటికీ.. మారుతి సుజుకి 550 కిలోమీటర్ల రేంజ్‌తో రావొచ్చని తెలుస్తోంది. రోజువారీ ప్రయాణానికి అనుకూలంగా పవర్‌ట్రెయిన్‌ను అందించనున్నారు.

భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో eVXతో పాటుగా వ్యాగన్ R(Wagon R Flex Fuel) ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్రోటోటైప్‌ను మారుతి సుజుకి ప్రదర్శించింది. E20-E85 ఇథనాల్‌తో నడిచేలా మోడిఫైడ్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. మారుతి వ్యాగన్ R లైనప్‌లో భాగంగా రూపొందుతున్న ఈ ఫ్లెక్స్-ఫ్యూయల్ వేరియంట్ ధర సుమారుగా రూ. 8.50 లక్షలుగా తెలుస్తోంది.
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో మారుతి సుజుకి ప్రదర్శించిన కాన్సెప్ట్ కార్లు.. స్టైల్, పనితీరు మరియు స్టెబిలీటీని ప్రదర్శించే ఎలక్ట్రిక్ SUVలుగా కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో బ్రాండ్ దృష్టిని హైలైట్ చేస్తుంది. ముఖ్యంగా eVX కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ల్యాండ్‌స్కేప్‌లో బలమైన పోటీదారుగా ఉండనుంది. 2025 లో ఈ కారు లాంచ్ అవుతుండగా.. టాటా నెక్సాన్ EV, మహీంద్రా XUV400, MG ZS EV వంటి ప్రత్యర్థి మోడల్‌లకు గట్టి పోటీనివ్వనుంది.


Click it and Unblock the Notifications








