మారుతి సుజుకి నుంచి ఈ సంవత్సరం ఏయే వాహనాలు లాంచ్ కానున్నాయో తెలుసా.. తొలి ఎలక్ట్రిక్ కారు సహా..!
మారుతి సుజుకి 2024లో 5 కొత్త కార్లను (Maruti Suzuki Upcoming Cars) విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ జాబితాలో మారుతి సుజుకి స్విఫ్ట్ 2024, డిజైర్ 2024, eVX ఎలక్ట్రిక్ SUV, గ్రాండ్ విటారా 7 సీటర్, మారుతి సుజికే స్పేసియా ఆధారిత MPV ఉన్నాయి. సంస్థ అంచనాలు సక్రమంగా అమలు అయితే ఈ కార్లు ఈ ఏడాదిలో విడుదల కానున్నాయి.
మారుతి సుజుకి స్విఫ్ట్ 2024 : మారుతి సుజుకి సంస్థ అత్యధిక విక్రయాలు నమోదు చేసిన కార్లలో స్విఫ్ట్ ఒకటిగా ఉంది. ప్రస్తుతం ఈ కారు అభివృద్ధి దశలో ఉంది. ఈ కారు డిజైన్‌లో కీలక మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు ఇంటీరియర్‌లోనూ మార్పులు జరుగుతున్నట్లు సమాచారం.

మారుతి సుజుకి స్విఫ్ట్ 2024 కారు అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉండవచ్చని తెలుస్తోంది. మార్చి 2024 లో విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ కారు ధర రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షల (ఎక్స్‌షోరూం) మధ్య ఉండే అవకాశం ఉంది.
మారుతి సుజుకి డిజైర్ : మారుతి సుజుకి ఉత్పత్తులో డిజైర్ కూడా ప్రజాదరణ పొందింది. డిజైర్ హ్యాచ్‌బ్యాక్ ధర స్విఫ్ట్ కంటే ఎక్కువ ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ డిజైన్, స్విఫ్ట్ కార్లు సుమారుగా ఒకేరకమైన అప్‌డేట్‌లను కలిగి ఉండే అవకాశం ఉంది. అయితే మారుతి డిజైర్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

మారుతి eVX ఎలక్ట్రిక్ SUV : మారుతి సుజుకి తొలి ఎలక్ట్రిక్ కారు అక్టోబర్‌లో మార్కెట్లోకి విడుదల కానుందని తెలుస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ ఈవీ రెండు బ్యాటరీ ప్యాక్ వేరియంట్లలో లభిస్తుందని తెలుస్తోంది. 48kWh, 60kWh బ్యాటీరీ సామర్థ్యాలను కలిగి ఉంటుందని సమాచారం. ఈ ఈవీకి హ్యుందాయ్ క్రెటా ఈవీ పోటీనిచ్చే అవకాశం ఉంది.
మారుతి గ్రాంట్ విటారా 7-సీటర్ : మారుతి గ్రాండ్ విటారా 7-సీటర్ వెర్షన్ ఈ సంవత్సరం ప్రారంభం అవుతుందని భావిస్తున్నారు. డిజైన్ పరంగా ఈ కారు పొడవుగా రానుందని తెలుస్తోంది. గ్రాండ్ విటారా ప్రస్తుత మోడల్‌లో ఉన్న ఇంజిన్లే కొత్త మోడల్‌లోనూ వచ్చే అవకాశం ఉంది. అయితే కీలక డిజైన్ మార్పులు కలిగి ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

మారుతి సుజుకి MPV ప్రస్తుతం జపాన్‌లో అందుబాటులో ఉన్న కంపాక్ట్ MPV స్పేసియా ఆధారంగా మరో కొత్త MPVని అభివృద్ధి తెలుస్తోంది. మారుతి ఎర్టిగా కంటే తక్కువ ధరలో విడుదల అవుతుందని తెలుస్తోంది. ఈ కొత్త ఎంపీవీ 1.2 లీటర్ z సిరీస్ పెట్రోల్ ఇంజిన్‌తో లాంచ్ అవుతుందని తెలుస్తోంది.
మారుతి సుజుకి కంపాక్ట్ ఎంపీవీ YDB కోడ్‌తో అభివృద్ధి చేస్తోంది. ఈ కొత్త ఎంపీవీ ప్రస్తుతం జపాన్‌లో అమ్ముడవుతున్న స్పేసియా ఆధారంగా రూపొందుతోంది. అయితే కొన్ని డిజైన్ మార్పులు ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్పేసియా వాహనం 3,395mm పొడవును కలిగి ఉంది.

అయితే మారుతి కొత్త కంపాక్ట్ ఎంపీవీ కొంచెం ఎక్కువ పొడవును కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు బాక్సీ డిజైన్‌ను కలిగి ఉంటుంది. అయితే ఉత్పత్తి ఖర్చులకు తగ్గించేందుకు వెనుకవైపు స్లైడింగ్ డోర్లను ఎంచుకోవచ్చు. ఈ కొత్త కారు నెక్సా ప్రీమియం అవుట్‌లెట్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
జపాన్‌లో అందుబాటులో ఉండే స్పేసియోతో పోలిస్తే విశాలమైన ఇంటీరియర్‌ను కలిగి ఉంటుంది. రెనాల్ట్ ట్రైబర్‌తో పోటీపడనుంది. మరియు ఇంజిన్, పనితీరు విషయానికి వస్తే రాబోయే స్విఫ్ట్ 1.2 Z సిరీస్ 3 సిలిండర్ మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ ఇంజిన్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో జతచేయబడుతుంది.


Click it and Unblock the Notifications








