మారుతి సుజుకి నుంచి రాబోతున్న మూడు కొత్త ఎలక్ట్రిక్ కార్లు.. సామాన్యులకు అందుబాటు ధరల్లో లభ్యం!!
మారుతి సుజుకి మూడు సరికొత్త ఎలక్ట్రిక్ కార్లను (EVలను) ఆవిష్కరించి భారతీయ ఆటోమోటివ్ ల్యాండ్‌స్కేప్‌లో విప్లవాత్మక మార్పులకు సిద్ధమవుతోంది. త్వరలో మార్కెట్‌లోకి రాబోతున్న ఈ కార్లు ఈవీ రంగంలో ట్రెండ్‌ని సృష్టించనున్నాయి. ఆ కార్ల విడుదల తేదీల ఫీచర్లు, ఇతర స్పెసిఫికేషన్ వివరాలు మీకోసం..
మారుతి సుజుకి eVX SUV: ఈ సరికొత్త ఎలక్ట్రిక్ కారు 2024 పండుగ సీజన్‌లో భారతీయ మార్కెట్‌లో విడుదల కానుంది. ఇది ఎలక్ట్రిక్ SUV విభాగంలో గేమ్-ఛేంజర్‌గా మారుతుందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. 2023 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించబడిన eVX కాన్సెప్ట్ కారు ఒక మిడ్ రేంజ్ SUV. దీని కోడ్ నేమ్ YY8. ఈ కారు హ్యుందాయ్ క్రెటా EV మరియు టాటా Curvv EV వంటి కార్లతో పోటీపడుతుంది.

సుజుకి, టయోటా సంయుక్తంగా అభివృద్ధి చేసిన బర్న్-ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫారమ్ eVX.. రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌లో అందుబాటులో ఉండనుంది. 48 kWh మరియు 60 kWh బ్యాటరీ ప్యాక్‌లలో రానున్నాయి. ఈ కారుని ఫుల్ ఛార్జ్ చేస్తే 550 కి.మీల వరకు రేంజ్‌ను అందించనుంది. గుజరాత్ ప్లాంట్‌లో తయారు చేయబడిన ఈ ఎలక్ట్రిక్ SUV భారత మార్కెట్‌కు మాత్రమే కాకుండా జపాన్, యూరప్ దేశాలకు సైతం సంస్థ ఎగుమతి చేయనుంది.
eVX తర్వాత మారుతి సుజుకి మరో ఎంపీవీ రానుంది. దీని కోడ్ నేమ్ YMC. సెప్టెంబరు 2026లో ఈ MPV మార్కెట్‌లోకి విడుదల కానుంది. ఈ సరికొత్త ఎలక్ట్రిక్ MPV eVXని పోలి ఉండనుంది. 3-వరుసల ఎలక్ట్రిక్ MPV రైడింగ్‌లో సీమ్‌లెస్ అనుభవాన్ని అందించనుంది. ఈ ఎలక్ట్రిక్ MPV గురించి పూర్తి వివరాలు అందుబాటులో లేవు.

మంచి ప్రైస్ రేంజ్‌లో స్టాండర్డ్ ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయాలనే ఉద్దేశ్యంతో మారుతి వీటిని తీసుకువస్తుంది. మార్కెట్‌లో ఉన్న ఈవీలతో పోల్చితే అందుబాటు ధరలో వాహన ప్రియులకు అందుబాటు ధరలో వీటిని తీసుకువచ్చేందుకు సంస్థ ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగానే పలు రకాల అధునాతన కార్లపై దృష్టి సారిస్తోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ రంగంపై సంస్థ ప్రతీష్ఠాత్మకంగా తీసుకుని పనిచేస్తోంది.
పై రెండు ఎలక్ట్రిక్ ఉత్పత్తుల సరికొత్త ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌ని తీసుకురానుంది. మారుతి సుజుకి బెస్పోక్ K-EV ప్లాట్‌ఫారమ్ ఆధారంగా ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ గా మార్కెట్‌లో ఈ కారు ప్రవేశిస్తోంది. జపాన్ మొబిలిటీ షోలో ప్రదర్శించబడిన eWX కాన్సెప్ట్ హ్యాచ్‌బ్యాక్ 2026-27లో వస్తుందని అంచనా వేస్తున్నారు. టాటా టియాగో EV వంటి ప్రత్యర్థిలకు సవాల్ విసిరేందుకు ఈ కారు సిద్ధంగా ఉంది.

K-EV ప్లాట్‌ఫామ్‌పై ఈ బ్యాటరీ ప్యాక్‌లు మరియు సెల్‌లతో మార్కెట్‌లో బిగ్ ఫైట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఎలక్ట్రిక్ మొబిలిటీకి విస్తృత యాక్సెస్‌ను అందించడం మరియు అభివృద్ధి చెందుతున్న EV మార్కెట్లో టాటా మోటార్స్ వంటి పోటీదారులను సవాలు చేయడం లక్ష్యంగా సంస్థ పెట్టుకుంది.
ఎలక్ట్రిక్ వాహనాలకు మార్కెట్‌లో డిమాండ్ పెరుగుతోంది. భవిష్యత్తు కార్లుగా వీటిని సంస్థలు వీటిని రూపొందిస్తున్నాయి. పెట్రోల్ లేదా డీజిల్ కార్లు కాకుండా కేవలం విద్యుత్తు సంస్థలు కార్లపైనే ఫోకస్ చేస్తున్నాయి. పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు కాలుష్యాన్ని తగ్గించడానికి ఇవి ఉపకరించనున్నాయి. చౌక ధరలో ఈ కార్లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.

భారతదేశంలో EV ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాగా అభివృద్ధి చెందింది. ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి మారుతి సుజుకి బ్రాండ్ నిబద్ధతను చాటడానికి సిద్ధమవుతోంది. వివిధ పవర్‌ట్రెయిన్‌లను కలిగి ఉన్న విభిన్నమైన పోర్ట్‌ఫోలియోతో, మారుతి యొక్క "విజన్ 3.0" రోడ్‌మ్యాప్‌ని సిద్ధం చేస్తోంది. భారతదేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీకి మంచి భవిష్యత్తుని అందించేందుకు మారుతి సుజుకి తమ వంతుగా ప్రయత్నం చేస్తోంది.


Click it and Unblock the Notifications








