ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేస్తే 800 కి.మీలు పైనే.. ధర రూ.5.55 లక్షలే.. డాక్టర్లు, ఇంజినీర్లకు ఇష్టమైన కారు

ఇండియాలో ఆటోమొబైల్ పరిశ్రమలో దిగ్గజ కంపెనీగా ఉన్నటువంటి మారుతీ సుజుకీ అమ్మకాల పరంగా ఎప్పుడూ కూడా ముందు స్థానంలో ఉంటుంది. ఇతర కంపెనీల మోడళ్లు ఎక్కువ ధరలో లభించడం, మారుతీ కార్లు భారతదేశ మధ్యతరగతి వినియోగదారులకు అందుబాటు ధరలో కొనుగోలుకు ఉండటం వలన ఈ కంపెనీ కార్లు దేశంలో అత్యంత ఎక్కువగా అమ్ముడుపోతుంటాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి పలు కొత్త మోడళ్లను విడుదల చేసిన మారుతీ నవంబర్ 2024 అమ్మకాల జాబితాలో తాజాగా మరోసారి ఇతర దిగ్గజ కంపెనీలకు అందకుండా ముందు స్థానంలో నిలిచింది. ఇటీవల కంపెనీ విడుదల చేసిన డేటా ప్రకారం, మారుతీ సుజుకీ ఈ ఏడాది (2024) నవంబర్ నెలలో మొత్తం అన్ని వాహనాలు కలిపి 1,41,312 యూనిట్లను విక్రయించింది. అదే గత ఏడాది 2023 నవంబర్ నెలలో మొత్తం వాహన అమ్మకాలు 1,34,158 యూనిట్లుగా ఉన్నాయి.

ఏడాది ప్రాతిపదికన చూసినట్లయితే మారుతీ సుజుకీ ప్రస్తుతం నవంబర్ నెలలో అమ్మకాల వృద్ధి 5 శాతంగా ఉంది. ఇతర వాహన తయారీదారులు పోటా పోటీగా కొత్త మోడళ్లను విడుదల చేస్తూ మారుతీ కంపెనీ కంటే ఎక్కువ విక్రయాలు నమోదు చేయాలని బాగా ప్రయత్నించినప్పటికీ దేశవ్యాప్తంగా చాలా మంది ప్రజలు మారుతీ కార్లకే జై కొట్టారు. అందుకే విక్రయాల జాబితాలో మరోసారి తన నెం.1 స్థానాన్ని దక్కించుకుంది.

Maruti Suzuki Wagon R

మారుతీ సుజుకీ విక్రయాల్లో విజయకేతనం ఎగరవేయడానికి ప్రధానంగా వ్యాగన్ఆర్ కారు కీలక పాత్ర పోషించింది. నవంబర్ నెలలో వినియోగదారులు ఈ కారును ఎక్కువగా కొనుగోలు చేశారు. డేటా ప్రకారం, ఈ ఏడాది నవంబర్‌లో ఈ మోడల్ విక్రయాలు 13,982 యూనిట్లు ఉన్నాయి, దీని ముందు అక్టోబర్‌లో 13,922 కార్లను విక్రయించింది. పండుగ సమయంలో ఎక్కువగా అమ్మకాలను సాధించిన వ్యాగన్ఆర్ పండుగ ఆఫర్లు లేకపోయిన కూడా నవంబర్‌లో మంచి డిమాండ్‌ను పొందింది.

వ్యాగన్ఆర్ (wagon-r) LXi, VXi, ZXi, ZXi+ అనే నాలుగు వేరియంట్లలో పెట్రోల్ ఇంజిన్‌తో కొనుగోలుకు ఉంది. అలాగే CNG ఎంపికలో కూడా లభిస్తుంది. ఇండియా దీని ప్రారంభ ధర రూ. 5.55 లక్షల నుంచి మొదలుకుని టాప్ వేరియంట్ ధర రూ.7.33 లక్షలు (ఎక్స్ షోరూమ్) ధరకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ధర తక్కువగా ఉన్నప్పటికీ ఫీచర్లు ఎక్కువగా, మైలేజ్ అధికంగానే ఇస్తుండటంతో డిమాండ్ బాగా ఉంది.

Maruti Suzuki Wagon R Sales

వ్యాగన్ఆర్ 1-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 67 PS పవర్, 89 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 1.2 లీటర్ పెట్రోల్ 90 PS పవర్, 113 Nm టార్క్‌ను విడుదల చేస్తుంది. సీఎన్‌జీ 57 PS పవర్‌ను, 82 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మిడ్‌నైట్ బ్లాక్, సిల్కీ సిల్వర్,బ్రౌన్, గాలంట్ రెడ్, సుపీరియర్ వైట్, పూల్‌సైడ్ బ్లూ వంటి ఇతర కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంది.

ముఖ్యంగా మారుతీ వ్యాగన్ఆర్ మైలేజీ విషయానికి వస్తే 1-లీటర్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో 24.35 kmpl, 1-లీటర్ ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్‌‌లో 25.19 kmpl, 1.2-లీటర్ ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్‌‌లో 24.43 kmpl,1.2-1 లీటర్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో 23.56 kmpl మైలేజీని అందిస్తుంది. అదే సీఎన్‌జీలో కిలో ఇంధనానికి 33.47 km మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ కారు చిన్న కుటుంబానికి అనువుగా ఉంటుంది.

Wagon R 2024 November Sales

వ్యాగన్ఆర్‌లో అధునాతన ఫీచర్లు ఉన్నాయి. లోపల స్టీరింగ్-మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, 7-అంగుళాల టచ్ స్క్రీన్ డిస్‌ప్లే, స్మార్ట్‌ఫోన్ నావిగేషన్, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం 4-స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్, ప్రయాణికుల భద్రత కోసం డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS సిస్టం, వెనుక పార్కింగ్ సెన్సార్, హిల్-హోల్డ్ అసిస్ట్ వంటివి ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, December 10, 2024, 10:30 [IST]
English summary
Maruti suzuki wagon r 2024 november sales report check here
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+