డాక్టర్లు, ఇంజినీర్లు ఎక్కువగా ఈ కారునే కొంటారు.. చాలా తక్కువ ధరలో లగ్జరీ ఫీచర్లు, మైలేజీ దీని సొంతం!
మార్కెట్‌లో హ్యాచ్‌బ్యాక్‌లను ఉన్న క్రేజ్ వేరు. భారత్‌లో హ్యాచ్‌బ్యాక్‌ల అమ్మకాల్లో మారుతి సుజుకి వ్యాగన్‌ఆర్ (Maruti Suzuki Wagon R) ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. గత కొన్నేళ్లుగా భారతీయ మార్కెట్‌లో ఈ కారు అమ్మకానికి అందుబాటులో ఉంది. భారత్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ రికార్డు నెలకొల్పింది. ఈ కారు రెండు దశాబ్దాలకు పైగా అమ్మకాల్లో అదరొడుతోంది. ఈ కారు తొలిసారిగా 1999లో మార్కెట్‌లో అడుగుపెట్టింది. దీనిని ఎక్కువగా ఇంజినీర్లు, డాక్టర్లు కొనుగోలు చేయాడానికి ఆసక్తి చూపిస్తారు. ప్రస్తుతం అమ్మకాల్లో మారుతి వ్యాగన్ ఆర్ ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. మారుతి సుజుకి నుంచి బెస్ట్ సెల్లింగ్ ్ కారుగా మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ కొనసాగుతోంది. అందువల్ల ఇది మార్కెట్‌లో ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ని సంపాదించింది.
అయితే దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటిగా ఉన్న ఈ కారు సేల్స్ తగ్గాయి. అక్టోబర్ 2024లో మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ అమ్మకాలు తగ్గాయి. పండుగ సీజన్‌లో అమ్మకాలు పెరగాల్సి ఉంది. అయితే అందుకు విరుద్ధంగా సేల్స్ ఏమాత్రం పెరగలేదు. గత ఏడాదితో పోలిస్తే మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. ఇది మారుతి ఓవరాల్ అమ్మకాలపై కూడా ప్రభావం చూపింది.

తాజాగా మారుతి సుజుకి విడుదల చేసిన అక్టోబర్ 2024 కు సంబంధించిన సేల్స్ రిపోర్ట్ విడుదలైంది. ఈ కారుని 2024 అక్టోబర్‌లో కేవలం 13,922 యూనిట్లను మాత్రమే కొనుగోలు చేశారు. ఇదే కారు అక్టోబర్ 2023లో 22,080 యూనిట్లు సేల్ అయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే 37 శాతం అమ్మకాలు క్షీణించాయి. అయితే అమ్మకాల్లో తగ్గుదలపై కంపెనీ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ప్రస్తుతం భారత మార్కెట్‌లో లభించే చౌకైన కార్లలో ఇది ఒకటిగా ఉంది. దీంతో అమ్మకాలు పెరిగే అవకాశం ఉందని కంపెనీ భావిస్తోంది. ప్రస్తుతం ఈ కారుని రూ. .5.54 లక్షల ప్రారంభ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఇక దీని టాప్ వేరియంట్ ధర రూ.7.20 లక్షలుగా ఉంది. ఇవి ఎక్స్-షోరూమ్ ధరలు మాత్రమే.

ఈ మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ 1.0-లీటర్ పెట్రోల్, 1.2-లీటర్ పెట్రోల్, 1.0-లీటర్ CNG ఇంజిన్ ఆప్షన్స్‌తో కొనుగోలు చేయవచ్చు. మారుతి సుజుకి సీఎన్‌జీ ఇంజిన్ కిలోకు 33.48 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఈ మైలేజీ వల్ల మారుతి వ్యాగన్ ఆర్ మంచి డిమాండ్‌ని పొందింది. మంచి మైలేజీని అందించడంతో పాటు అనేక అధునాతన ఫీచర్లతో ఈ కారు కొనుగోలుకి అందుబాటులో ఉంది.
ఈ కారులో ఫ్రెండ్లీ ఫీచర్లు ఉన్నాయి. 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఎయిర్‌బ్యాగ్స్, ఎబిఎస్ విత్ ఇబిడి, రియర్ పార్కింగ్ సెన్సార్లు, హిల్ హోల్డ్ అసిస్ట్, నాలుగు స్పీకర్ల మ్యూజిక్ సిస్టమ్ వంటివి ఉన్నాయి. అందువల్ల మారుతి వ్యాగన్ ఆర్ ప్రఖ్యాతి పొందింది. ఈ కారు టాటా టియాగో, సిట్రోయిన్ సీ3 వంటి వాటికి గట్టి పోటీని ఇస్తుంది. కొత్తగా కారు కొనాలనుకునే వారు దీనిని ట్రై చేయవచ్చు.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








