5.5 ఏళ్ళు 10లక్షల మంది.. అమ్మకాల్లో వ్యాగన్ ఆర్ అరుదైన రికార్డ్
దేశీయ విఫణిలో ఎన్నెన్ని బ్రాండ్స్ ఉన్నప్పటికీ.. 'మారుతి సుజుకి'కి ఉన్న డిమాండ్ మరియు ఆదరణ వేరు. ఈ కారణంగానే కంపెనీ వాహనాలు అద్భుతమైన అమ్మకాలను పొందగలుగుతున్నాయి. అమ్మకాల్లో సరికొత్త మైలురాళ్లను చేరుకున్న కార్లలో ఎర్టిగా, ఫ్రాంక్స్, స్విఫ్ట్ మరియు బ్రెజ్జా వంటివి ఉన్నాయి. ఈ జాబితాలోకి తాజాగా మరో కారు ఎంట్రీ ఇచ్చింది. దీని పేరే మారుతి వ్యాగన్ ఆర్ (Maruti Wagon R). 2019 జనవరి 13 నుంచి ఇప్పటి వరకు టాల్ బాయ్ హ్యాచ్‌బ్యాక్‌గా ప్రజాదరణ పొందిన ఈ వ్యాగన్ ఆర్ అమ్మకాల్లో 10 లక్షల యూనిట్లకు చేరువయ్యింది.
సరసమైన ధర వద్ద మంచి డిజైన్, సరికొత్త ఫీచర్స్ కలిగిన ఈ మారుతి వ్యాగన్ ఆర్ 2023 ఆర్ధిక సంవత్సరంలో 12నెలల వ్యవధిలో లేదా సంవత్సరంలో ఏకంగా 212340 యూనిట్ల అమ్మకాలను చవి చూసింది. మారుతి వ్యాగన్ ఆర్ అనేది వరుసగా మూడవ ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా చరిత్ర సృష్టించింది. ఈ కారు ధర మార్కెట్లో రూ.6.37 లక్షల నుంచి రూ.8.51 లక్షల మధ్య ఉంది.

వ్యాగన్ ఆర్ మారుతి సుజుకి యొక్క మొత్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాలలో 11 శాతం లేదా 17.5 లక్షల యూనిట్లతో ఉంది. 2019లో కేవలం 41873 యూనిట్ల అమ్మకాలను మాత్రమే నమోదు చేసిన వ్యాగన్ ఆర్ గత ఆర్థిక సంవత్సరంలో 200177 యూనిట్ల అమ్మకాలను పొందింది. దీన్ని బట్టి చూస్తే వ్యాగన్ ఆర్ సేల్స్ ఏ విధంగా పెరిగాయో స్పష్టంగా అర్థమవుతుంది.
2020లో వ్యాగన్ ఆర్ మొత్తం సేల్స్ 156724 యూనిట్లు, 2021లో దీని సేల్స్ 160330 యూనిట్లు, 2023 మరియు 2024 ఆర్థిక సంవత్సరాల్లో ఈ కార్ల అమ్మకాలు వరుసగా 212340 మరియు 200177 యూనిట్లుగా నమోదయ్యాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో 46132 యూనిట్ల అమ్మకాలు మాత్రమే జరిగాయి. ఈ సంఖ్య ఆర్ధిక సంవత్సరం ముగిసేలోపు పెరిగే అవకాశం ఉంది.

ఇలా మొత్తం మీద కంపెనీ యొక్క వ్యాగన్ ఆర్ సేల్స్ 1006413 యూనిట్లుగా నమోదైంది. మొత్తం మీద 5.5 సంవత్సరాల కాలంలో కంపెనీ సేల్స్ 10 లక్షల కంటే ఎక్కువయ్యాయి. అయితే వ్యాగన్ ఆర్ అమ్మకాలు 2023 కంటే 2024లోనే కొంత తగ్గినట్లు స్పష్టమవుతోంది. దీనికి కారణం మార్కెట్లో కొత్త కార్ల లాంచ్ మరియు వాహన వినియోగదారులు కూడా కొత్త కార్లను కొనాలనే ఆసక్తి.
సుజుకి యొక్క హార్ట్‌టెక్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడిన వ్యాగన్ ఆర్ మొత్తం తొమ్మిది వేరియంట్లలో లభిస్తోంది. వీటి ధరలు రూ.6.37 లక్షల నుంచి రూ.8.51 లక్షల (ధరలు ఆన్-రోడ్ ఢిల్లీ) మధ్య ఉన్నాయి. ఈ కారు 1.0 లీటర్ త్రీ-సిలిండర్ పెట్రోల్ (68 హార్స్ పవర్, 90 ఎన్ఎమ్ టార్క్) మరియు 1.2 లీటర్ ఫోర్-సిలిండర్ పెట్రోల్ (83 హార్స్ పవర్, 113 ఎన్ఎమ్ టార్క్) ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది.

మారుతి వ్యాగన్ ఆర్ అనేది CNG రూపంలో కూడా అందుబాటులో ఉంది. 2010లో CNG కారుగా మారిన మొదటి మారుతి సుజుకి మోడల్ ఇదే కావడం గమనార్హం. ఆ తరువాత మారుతి సుజుకి CNG విభాగంలో ఆల్టో కే10, బాలెనొ, బ్రెజ్జా, సెలెరియో, డిజైర్, ఈకో, ఎర్టిగా, గ్రాండ్ విటారా, ఎస్ ప్రెస్సో, స్విఫ్ట్, ఎక్స్ఎల్6, ఫ్రాంక్స్ వంటి కార్లు చేరాయి. ప్రస్తుతం CNG మార్కెట్ గణనీయమైన వృద్ధి చెందింది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








