మీ దగ్గర ఈ కారు ఉంటే భద్రం గురూ.. దొంగల కంటపడితే దర్జాగా తీసుకెళ్లిపోతారు.!!

భారత మార్కెట్లో ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీకి చెందిన వ్యాగన్ఆర్ దేశంలో అత్యధికంగా దొంగిలించబడిన కారుగా ఇటీవల ఓ నివేదిక వెల్లడించింది. ఇందుకు కారణం.. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ఒకటిగా ఉంది. దీంతో ఈ కారుకు ఉన్న క్రేజ్‌ కారణంగా.. ఎక్కువగా దొంగతనానికి(WagonR Stolen Car In India) గురవుతున్నట్లు తేలింది.

గత నివేదికలతో పోలిస్తే భారత్‌లో(Most Stolen Cars In India) 2023లో కార్ల దొంగతనం రెండింతలు పెరిగిందనే షాకింగ్‌ సమాచారం బయటకు వచ్చింది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో కార్లు ఎక్కువగా చోరీకి గురవుతున్నాయట. ఈ మేరకు ప్రైవేట్‌ ఆటో ఇన్సూరెన్స్‌ కంపెనీల్లో ఒకటైన ACO ఈ నివేదికను వెల్లడించింది.

Maruti-WagonR-Stolen

ACO నివేదిక ప్రకారం, భారత్‌లో కార్ల కంటే ద్విచక్ర వాహనాలు వాటిలో బైక్‌లు(Most Stolen Bikes In India) ఎక్కువగా దొంగతనానికి గురవుతున్నాయని తేలింది. కార్లతో పోలిస్తే బైక్‌లను దొంగిలించే అవకాశం 9 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. దేశ రాజధాని ఢిల్లీలోనే ఈ తరహా చోరీ ఘటనలు భారీగా నమోదవతున్నాయని నివేదిక చెబుతోంది.

ఇక కార్ల పరంగా, మారుతి సుజుకి నుంచి సరసమైన ధరలో లభించే హ్యాచ్‌బ్యాక్ వ్యాగన్ఆర్(WagonR) భారతదేశంలో అత్యధికంగా దొంగిలించబడిన ఫోర్‌-వీలర్‌గా ACO నివేదిక వెల్లడించింది. 2023లో భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన కార్లలో వ్యాగన్ఆర్ ఒకటి కావడమే కాదు.. అత్యధికంగా దొంగిలించబడిన కారు కూడా ఇదే కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

Maruti-Suzuki-Swift-Stolen

ACO విడుదల చేసిన సమాచారం ప్రకారం, WagonR సహా మారుతి సుజుకి కార్లను లక్ష్యంగా చేసుకుని దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. ఎందుకంటే 2023లో భారతదేశంలో దొంగిలించబడిన కార్లలో మారుతి సుజుకి 47% వాటాను కలిగి ఉంది. అంటే ప్రతి దొంగిలించబడిన రెండు కార్లలో మారుతి కారు ఒకటి పక్కాగా ఉంటోంది. దొంగలు ఎక్కువగా వ్యాగన్ఆర్ మరియు స్విఫ్ట్ కార్లపై కన్నేస్తున్నారట.

వీటి తరువాత హ్యుందాయ్ మోటార్స్‌కు చెందిన క్రెటా మరియు గ్రాండ్ ఐ10 కార్లు కూడా గత సంవత్సరంలో అధిక సంఖ్యలో చోరీకి గురయ్యాయి. అదే విధంగా మారుతి సుజుకికి చెందిన డిజైర్ సెడాన్ కారు కూడా ఈ లిస్ట్‌లో ఉంది. ఈ దొంగతనాలు ఎక్కువగా ఢిల్లీలోనే జరుగుతుండటం గమనార్హం.

Hyundai-Grand-i10-Nios

ఢిల్లీలో ప్రతి 14 నిమిషాలకు ఒక కారు చోరీకి గురవుతున్నట్లు ACO పరిశోధనలో వెల్లడైంది. 2023లో, భారతదేశంలో దొంగిలించబడిన కార్లలో మొత్తం 37 శాతం కార్లు ఢిల్లీలో నమోదయ్యాయి. ఢిల్లీలోని భజన్‌పురా, ఉత్తరం నగర్‌లలో కార్ల దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని వెల్లడైంది. అదేవిధంగా, ఢిల్లీలోని షహదారా, బద్బర్‌గంజ్ మరియు బదర్‌పూర్ నగరాల్లో కూడా అధిక స్థాయిలో కార్లను దొంగిలిస్తున్నారు.

ఇక బైక్‌ల విషయానికి వస్తే, భారత మార్కెట్లో అగ్రగామిగా ఉన్న హీరో స్ప్లెండర్‌ను అత్యధికంగా చోరీకి గురవుతోంది. దీంతో పాటు హోండా యాక్టివా స్కూటర్ మరియు రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్‌లు దొంగలకు మోస్ట్‌ వాంటెడ్‌ బైక్‌లుగా ఉంటున్నాయి. దొంగిలించబడిన 10 బైక్‌లలో ఆరు హీరో స్ప్లెండర్, స్ప్లెండర్ ప్లస్, హీరో CD డీలక్స్ మరియు హీరో HF డీలక్స్ ఉంటున్నాయని గురుగ్రామ్‌ పోలీసులు చెబుతున్నారు.

Hyundai-Creta-Stolen

దొంగలు వీటినే ఎక్కువగా చోరీ చేయడానికి కారణం.. ఈ టూ-వీలర్ల రీసేల్ వాల్యూ ఎక్కువగా ఉండటం, వాటికి విడిభాగాలు అందుబాటులో ఉండటమే ఇందుకు కారణంగా వెల్లడైంది. స్థలాభావం కారణంగా, నగరాల్లో ఎక్కువగా వాహనాలను రోడ్డు పక్కనే పార్క్‌ చేస్తుంటారు. తద్వారా దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వీటిని అరికట్టాలంటే ఎల్లప్పుడూ తాళం వేసి ఉండటంతో పాటు.. యాంటీ-థెఫ్ట్ అలారం సిస్టమ్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవడం చాలా అవసరం.

More from DriveSpark

Article Published On: Thursday, March 14, 2024, 11:16 [IST]
English summary
Maruti suzuki wagonr listed in top place the most stolen car in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+