మారుతి స్విఫ్ట్ ధరలు పెరిగాయండోయ్!.. ఇప్పుడే తెలుసుకోండి

మారుతి సుజుకి అంటే అందరికి మొదట గుర్తొచ్చేది 'స్విఫ్ట్'. అయితే కంపెనీ ఇప్పుడు ఈ స్విఫ్ట్ ధరలను రూ.15000 నుంచి రూ.39000 వరకు పెంచింది. ధరల పెరుగుదల తరువాత ప్రారంభ ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

మారుతి సుజుకి ఇప్పుడు వీఎక్స్ఐ, వీఎక్స్ఐ ఏంటీ మరియు వీఎక్స్ఐ CNG ధరలు రూ. 15000 పెంచింది. ఎల్ఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ ఏఎంటీ మరియు జెడ్ఎక్స్ఐ CNG ధరలను రూ. 25000 వరకు పెంచింది. అయితే జెడ్ఎక్స్ఐ ప్లస్ ధరలను మాత్రం ఏకంగా రూ. 39000 పెంచింది. దీంతో మారుతి సుజుకి స్విఫ్ట్ ఇప్పుడు కొత్త ధరలలో అందుబాటులో ఉంది.

Maruti-Swift-Price-Increase

ధరల పెరుగుదల తరువాత మారుతి స్విఫ్ట్ బేస్ వేరియంట్ ఎల్ఎక్స్ఐ ధర రూ. 6.24 లక్షలకు చేరింది. ధరల పెరుగుదలకు ముందు దీని ధర రూ. 5.99 లక్షలు. టాప్ ఎండ్ వేరియంట్ జెడ్ఎక్స్ఐ ప్లస్ ఏఎంటీ ధర రూ.9.14 లక్షలకు చేరింది. కొత్త ధరలకు ముందు ఈ కారు ధర రూ. 8.89 లక్షలు మాత్రమే. అంటే ఈ కారు ధర మునుపటి కంటే రూ.25000 ఎక్కువని తెలుస్తోంది.

మారుతి సుజుకి తన స్విఫ్ట్ ధరలను పెంచింది. కానీ డిజైన్, ఫీచర్స్ మరియు ఇంజిన్ వంటి వాటిలో ఎలాంటి మార్పులు చేయలేదు. దీనిని తప్పకుండా కొనుగోలుదారులు తెలుసుకోవాలి. స్విఫ్ట్ అదే 1.2 లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 90 హార్స్ పవర్ మరియు 113 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ ఆటోమాటిక్ మరియు 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది.

Maruti-Swift-Price-Increase

ప్రారంభం నుంచి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న మారుతి స్విఫ్ట్.. ఇప్పుడు ధరల పెరుగుదలను అందుకోవడంతో కస్టమర్లు ఆందోళన చెందుతారా? ధరల పెరుగుదల అమ్మకాల మీద ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉందా అనే వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ముడి సరుకుల పెరుగుదల వల్ల లేకుంటే.. ఇతరత్రా కారణాల వల్ల కంపెనీ తమ స్విఫ్ట్ ధరలను పెంచి ఉండొచ్చని భావిస్తున్నాము.

విడుదలకు సిద్దమవుతున్న కొత్త మారుతి స్విఫ్ట్: ఇదిలా ఉండగా మారుతి సుజుకీ త్వరలో 2024 స్విఫ్ట్ మోడల్ లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. కంపెనీ ఈ కొత్త కారును లాంచ్ చేసిన తరువాత పాత మోడల్ ధరలను బహుశా తగ్గించే అవకాశం ఉందని భావిస్తున్నాము. కంపెనీ కొత్త మారుతి స్విఫ్ట్ (Maruti Swift)ను మే మొదటి వారంలో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇది మంచి డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుందని భావిస్తున్నాము.

Maruti-Swift-New-Generation

త్వరలో లాంచ్ కానున్న కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ 1.2 లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుందని తెలుస్తోంది. ఈ ఇంజిన్ జపాన్ మార్కెట్లో అందుబాటులో ఉన్న స్విఫ్ట్ కారులో ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ఇంజిన్ పర్ఫామెన్స్ మాత్రం భారతీయ వినియోగదారులకు అనుకూలంగా ఉండేలా ఉంటుందని తెలుస్తోంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌తో లభించే అవకాశం ఉంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Friday, April 19, 2024, 1:07 [IST]
English summary
Maruti swift prices hiked ahead of new gen launch next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+