ఈ Swift వేరియంట్‌‌కే భారీ డిమాండ్.. 60 శాతం దీన్నే బుక్ చేసుకున్నారు!

ఇండియన్ మార్కెట్లో 'మారుతి సుజుకి' (Maruti Suzuki) అంటే అందరికి మొదట గుర్తొచ్చేది 'స్విఫ్ట్' (Swift). ఒకప్పటి నుంచి తిరుగులేని అమ్మకాలు పొందుతూ.. దూసుకెట్లున్న మారుతి స్విఫ్ట్ ఈ మధ్య కాలంలోనే ఆధునిక హంగులతో నాలుగవ తరం రూపంలో అధినారికంగా దేశీయ విఫణిలో లాంచ్ అయింది. విడుదలకు ముందు నుంచే కంపెనీ ఈ కారు కోసం బుకింగ్స్ స్వీకరించడం మొదలుపెట్టింది, కొన్ని రోజులకు ముందు డెలివరీలు కూడా ప్రారంభమయ్యాయి. మొదటి నెలలోనే కంపెనీ 19393 యూనిట్ల హ్యాచ్‌బ్యాక్‌లను డీలర్‌లకు పంపించినట్లు సమాచారం. కాగా ఈ కొత్త మోడల్ ఇప్పటికే 40000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందినట్లు తెలుస్తోంది.

భారతదేశంలో అందుబాటులో ఉన్న నాల్గవ తరం మారుతి స్విఫ్ట్ ప్రారంభ ధర రూ.6.49 లక్షలు(ఎక్స్ షోరూమ్). కంపెనీ ఈ హ్యాచ్‌బ్యాక్‌ కోసం పొందిన మొత్తం బుకింగ్లలో 60 శాతం మిడ్ స్పెక్ వీఎక్స్ఐ మరియు వీఎక్స్ఐ (ఓ) వేరియంట్లు మాత్రమే పొందినట్లు సమాచారం. అంటే ఈ రెండు వేరియంట్లకు డిమాండ్ భారీగా ఉందని తెలుస్తోంది. కాగా జెడ్ఎక్స్ఐ మరియు జెడ్ఎక్స్ఐ ప్లస్ వేరియంట్లకు 19 శాతం బుకింగ్స్ వచ్చాయని తెలుస్తోంది.

Maruti Swift

మొత్తం బుకింగ్లలో 17 శాతం మారుతి స్విఫ్ట్ ఆటోమాటిక్ వేరియంట్‌ పొందినట్లు సమాచారం. ఇందులో కూడా వీఎక్స్ఐ AMT వేరియంట్ కోసం 10 శాతం బుకింగ్స్ వచ్చాయి, జెడ్ఎక్స్ఐ మరియు జెడ్ఎక్స్ఐ ప్లస్ AMT కోసం 7 శాతం బుకింగ్స్ అని తెలుస్తోంది. కాగా మొత్తం మీద ఇటీవల మార్కెట్లో విడుదలైన మారుతి స్విఫ్ట్ ఎక్కువమందిని ఆకర్షిస్తూ.. ఎక్కువ సంఖ్యలో బుకింగ్స్ పొందగలుగుతోంది.

మొత్తం ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉన్న ఈ కొత్త మారుతి స్విఫ్ట్ ఆధునిక డిజైన్ పొందుతుంది. ఇది అప్డేటెడ్ హెడ్‌ల్యాంప్‌లు, ఫాగ్ లాంప్, సి షేప్ టెయిల్‌ల్యాంప్‌, రీడిజైన్ చేయబడిన రియర్ బంపర్ మరియు కొత్త అల్లాయ్ వీల్స్ వంటివి పొందుతుంది. ఇవన్నీ దాని స్టాండర్డ్ మోడల్ కంటే కొంత భిన్నంగా ఉండేలా చేస్తాయి. కాబట్టి ఇది కస్టమర్లను ఆకర్శించడంలో తప్పకుండా విజయం పొందుతుంది.

Maruti Swift Rear Profile

ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇది చాలా వరకు ఇప్పటికే మార్కెట్లో ఉత్తమ అమ్మకాలు పొందిన మారుతి బ్రెజ్జా, ఫ్రాంక్స్, బాలెనొ వంటి ఇంటీరియర్ డిజైన్ పొందుతుంది. ఈ హ్యాచ్‌బ్యాక్‌లో వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, అప్‌డేటెడ్ స్విచ్ గేర్, టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ మరియు టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఆధునిక ఫీచర్స్ ఉన్నాయి.

డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న కొత్త నాల్గవ తరం మారుతి సుజుకి స్విఫ్ట్ ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను పొందుతుంది. అంతే కాకుండా ఇందులో స్టాండర్డ్ మారుతి స్విఫ్ట్ కారులోని దాదాపు అన్నిసేఫ్టీ ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి. కాబట్టి ఈ కారు ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్శించడంలో విజయం పొందింది.

Maruti Swift Side Design

ఇంజిన్ విషయానికి వస్తే.. కొత్త మారుతి స్విఫ్ట్ 1.2 లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 82 Bhp పవర్ మరియు 112 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్‌తో జత చేయబడి ఉంటుంది. ఇంజిన్ 24.8 కిమీ/లీటర్ మైలేజ్ అందిస్తుంది. ఆటోమాటిక్ వెర్షన్ 25.75 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. ఈ హ్యాచ్‌బ్యాక్‌ త్వరలో CNG రూపంలో కూడా విడుదలయ్యే అవకాశం ఉంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Wednesday, June 5, 2024, 16:57 [IST]
English summary
Maruti swift vxi variant 60 percent bookings
Read more on: #maruti suzuki
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+