33 కి.మీ మైలేజీ ఇచ్చే ఈ కారుని డాక్టర్లు, ఇంజినీర్లు ఎక్కువగా కొంటారు.. ధర రూ. 5.54 లక్షలు మాత్రమే!

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారత్‌లో కార్ల కొనుగోళ్లు పెరుగుతున్నాయి. దీంతో భారీ సంఖ్యలో కార్ల సంస్థలు తమ ఉత్పత్తులను మార్కెట్‌లో ప్రవేశపెడుతున్నాయి. అయితే కానీ ఇప్పటికే కొన్ని కార్లు జనాల్లో నమ్మదగినవిగా పేరుగాంచాయి. అలాంటి మోడళ్లపై కంపెనీలు అప్‌డేట్స్‌ లేదా ఇతర అప్‌గ్రేడ్స్‌ చేస్తూ విడుదల చేస్తున్నాయి. ఇటీవల ప్రముఖ కార్ల తయారీదారులు ఆగస్టు (2024) నెల సేల్స్‌ రిపోర్ట్‌ని విడుదల చేశాయి. అందులో మారుతి సుజుకి వాగన్‌ఆర్(WagnorR) హ్యాచ్‌బ్యాక్ దేశీయ మార్కెట్‌లో అమ్ముడైన టాప్ 10 కార్లలో 4వ స్థానంలో ఉంది. ఇక మారుతి సుజుకి బ్రెజా మొదటి స్థానంలో ఉండగా మారుతి సుజుకికే చెందిన ఎర్టిగా రెండవ స్థానంలో, హ్యుందాయ్ క్రెటా మూడవ స్థానంలో ఉన్నాయి.

మారుతి సుజుకి వ్యాగన్‌ఆర్‌ గత కొన్ని నెలలుగా దేశంలో అత్యధికంగా అమ్ముడువుతున్న కారుగా నిలిచింది. జూలైలో దీని జోరుకి టాటా పంచ్‌ బ్రేక్‌ వేసింది. ఇప్పుడు టాటా పంచ్ అత్యధికంగా అమ్ముడువుతున్న కారుగా అవతరించింది. అయితే వ్యాగన్‌ఆర్‌ ఇంకా తన ఆధిపత్యాన్ని కొసాగిస్తూనే ఉంది. ఈ కారుని ఎక్కువగా డాక్టర్లు, ఇంజినీర్లు, ఇతర ఆఫీసర్లు విరివిగా కొనుగోలు చేస్తున్నారు. మిడిల్‌ క్లాస్‌ వాళ్లు సైతం ఈ కారుని ఎక్కుగా కొంటున్నారు.

Maruti WagnoR

గత నెలలో మారుతి సుజుకి వ్యాగన్ఆర్ హ్యాచ్‌బ్యాక్‌ 16,450 యూనిట్లను విక్రయించింది. 2023 ఆగస్టులో విక్రయించిన 15,578 యూనిట్లతో పోలిస్తే ఇది 6 శాతం అధికం. ఈ కారు ఎక్కువగా అమ్ముడవ్వడానికి కారణం దీని సరసమైన ధరే అని చెప్పవచ్చు. ఈ కారు రూ.5.54 లక్షల నుంచి రూ.7.32 లక్షల ( ఎక్స్-షోరూమ్) మధ్య అందుబాటులో ఉంటుంది.

ఇందులో LXi, VXi, ZXi అనే వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఇది 7 మోనోటోన్‌ (గ్యాలెంట్ రెడ్, పూల్సైడ్ బ్లూ, సుపీరియర్ వైట్, సిల్కీ సిల్వర్, మాగ్మా గ్రే, మిడ్‌నైట్‌ బ్లాక్‌, మిడ్‌నైట్‌ గ్రే) 2-డ్యూయల్-టోన్ కలర్‌ ఆప్షన్లలో లభిస్తుంది. పెట్రోల్, సీఎన్‌జీ పవర్ట్రెయిన్ ఆప్షన్లలో వస్తుంది. దీని 1-లీటర్ పెట్రోల్ ఇంజిన్ గరిష్టంగా 67 ps శక్తిని 89 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

Maruti WagnoR

1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 90 ps శక్తిని, 113 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇక సీఎన్‌జీ వేరియంట్ 1-లీటర్ ఇంజన్‌ 57 ps గరిష్ట శక్తిని 89 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 5-స్పీడ్ మాన్యువల్ / 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది లీటరుకు 23.56 నుంచి 33.47 కి.మీ మైలేజీని ఇస్తుంది.

కొత్త మారుతి సుజుకి వాగన్‌ఆర్ హ్యాచ్‌బ్యాక్ 5-సీటర్ ఆప్షన్‌తో వస్తుంది. ఈ కారులో వీక్లీ ట్రిప్స్‌, సెలవు దినాల్లో వెళ్లినప్పుడు ఎక్కువ లగేజీని తీసుకెళ్లడానికి వీలుగా 341 లీటర్ల బూట్ స్పేస్‌ని కలిగి ఉంది. ఇందులో స్పేస్‌ చాలా లగ్జరీయస్‌గా ఉంటుంది. ముఖ్యంగా హెడ్‌ స్పేస్‌ కోసం తగినంత చోటు ఉంటుంది. ఎత్తుగా ఉండేవారు ఎక్కువగా ఈ కారుని ఇష్టపడతారు. బయటి నుంచి కూడా ఇది భారీ ఆకారంలో కనిపిస్తుంది.

Maruti WagnoR 2024 August sales Report

ఇందులో 7 అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్ ప్లే, 4 స్పీకర్ మ్యూజిక్ సిస్టం, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో, ఫోన్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇందులో సేఫ్టీ కూడా భేష్‌ అని చెప్పవచ్చు. ఎందుకంటే డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్‌, ఈబీడీ (ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), ఏబీఎస్ (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), రియర్ పార్కింగ్ సెనర్స్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Monday, September 9, 2024, 11:20 [IST]
English summary
Maruti wagnor august 2024 sales report check all data here in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+