చాలా తక్కువ ధరలో మారుతి లిమిటెడ్ ఎడిషన్ కారు లాంచ్.. కొత్తగా కారు కొనేవారికి బెస్ట్ ఛాయిస్!
సరికొత్త వ్యాగన్‌ఆర్ వాల్ట్జ్ (Maruti Wagon R Waltz) ఎడిషన్‌ని మారుతి సుజుకి నేడు విడుదల చేసింది. ప్రస్తుతం మారుతి వ్యాగన్ఆర్ దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో రెండో స్థానంలో ఉంది. ఈ మారుతి సుజుకి కారుని విరివిగా కొనుగోలు చేస్తున్నారు. ఈ వ్యాగన్‌ఆర్ గత రెండు దశాబ్దాలుగా దేశంలో అమ్మకానికి ఉంది. విడుదలైనప్పటిీ నుంచి తిరుగులేని శక్తిగా ఇది అమ్ముడవుతోంది. తాజాగా విడదుల చేసిన కొత్త వ్యాగన్‌ఆర్ వాల్ట్జ్ వెర్షన్‌తో సేల్స్ పెరుగుతాయని కంపెనీ భావిస్తోంది. ముఖ్యంగా ఈ పండుగ సీజన్ కలిసి వస్తుందని కంపెనీ భావిస్తోంది.
తాజాగా మారుతి లాంచ్ చేసిన ఈ సరికొత్త మారుతి వ్యాగన్ఆర్ వాల్ట్జ్ లిమిటెడ్ ఎడిషన్ ధర రూ .5.65 లక్షలు, ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది. ఇది బడ్జెట్‌లో ఉన్న లైనప్స్‌తో పోల్చితే ధర తక్కువే అనే చెప్పాలి. ఈ కొత్త మారుతి వ్యాగన్ఆర్ లిమిటెడ్ ఎడిషన్ ఎక్ట్సీరియర్, ఇంటీరియర్లతో పాటు కొన్ని ఫీచర్లను అప్‌గ్రేడ్‌తో తీసుకువచ్చింది. ఈ కొత్త ఎడిషన్‌ని LXi వేరియంట్లో కొనుగోలు చేయవచ్చు.

ఈ కొత్త మారుతి సుజుకి వాగన్‌ఆర్ వాల్ట్జ్ ఎడిషన్‌లో ఫ్రంట్ క్రోమ్ గ్రిల్, ఫాగ్ ల్యాంప్స్, వీల్ ఆర్చ్ క్లాడింగ్, బంపర్ ప్రొటెక్టర్లు, సైడ్ స్కర్ట్స్, బాడీ సైడ్ మోల్డింగ్ వంటి ఎక్ట్సీరియర్ అప్‌డేట్స్‌తో సరికొత్తగా దర్శనం ఇవ్వనుంది. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న మోడళ్లతో పోల్చితే ఇవి కొత్త జోడింపుగా ఉన్నాయి.
ఈ కొత్త మారుతి వ్యాగన్ ఆర్ వాల్ట్జ్ క్యాబిన్‌లోనూ కొత్త ఇంటీరియర్ స్టైలింగ్ కిట్‌ని కలిగి ఉంది. ముఖ్యంగా కొత్త డిజైనర్ ఫ్లోర్ మ్యాట్స్, సీట్ కవర్లను అందించారు, టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్, స్పీకర్లు, సెక్యూరిటీ సిస్టమ్, రివర్స్ పార్కింగ్ కెమెరా ఉన్నాయి. సేఫ్టీ పరంగా డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్‌తో పాటు ఈబీడీ, ఈఎస్‌సీ, హిల్ హోల్డ్ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
కొత్త మారుతి వ్యాగన్ఆర్ లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌లో ఎటువంటి మెకానికల్ అప్‌డేట్స్ లేవు. ఇది ఇదివరకే అందుబాటులో ఉన్న హ్యాచ్‌బ్యాక్ 1.0-లీటర్, 1.2-లీటర్ కె-సిరీస్ పెట్రోల్ ఇంజన్‌తో లభిస్తుంది. ఇందులోని 1.0-లీటర్, ఇన్లైన్ త్రీ-సిలిండర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 66 bhp, 89 nm టార్క్‌ని, 1.2-లీటర్ ఇన్లైన్ ఫోర్-సిలిండర్ ఇంజిన్ 88 bhp 113 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.
ఈ ఇంజిన్లు 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ AMT ట్రాన్స్‌మిషన్స్‌తో వస్తుంది. ఈ ప్రత్యేక ఎడిషన్ సీఎన్‌జీ వేరియంట్‌లో కూడా లభిస్తుంది. తాజాగా విడుదలైన ఈ మారుతి వ్యాగన్ఆర్ కొంచెం తక్కువ ఖరీదైనది. మారుతి సుజుకి వ్యాగన్ఆర్ కూడా ఉత్తమ మైలేజీని అందిస్తుంది. మారుతి సుజుకి వ్యాగన్‌ఆర్ పెట్రోల్-మాన్యువల్ వేరియంట్లు లీటరుకు 24.35 కిలోమీటర్ల మైలేజీ, పెట్రోల్-ఏఎంటీ వేరియంట్లు లీటరుకు 25.19 కిలోమీటర్ల మైలేజీని ఇస్తాయి.
ఇక మారుతి సుజుకి వాగన్‌ఆర్ సీఎన్‌జీ వేరియంట్స్ లీటరుకు 33.47 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. మారుతి సుజుకి వ్యాగన్‌ఆర్ భారతీయ వినియోగదారులలో అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్‌గా ఎదగడానికి ప్రధాన కారణం ఇందులోని ఇంటీరియర్ స్పేస్, హెడ్‌రూమ్ స్పేస్ అని చెప్పవచ్చు. ఈ మారుతి సుజుకి వ్యాగన్‌ఆర్ ప్రతీ నెలా అమ్మకాల్లో టాప్-5లో నిలుస్తుంది.
ఈ కారు 1999 నుంచి అమ్మకానికి ఉంది. ప్రస్తుతం మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ ను థర్డ్ జనరేషన్ విక్రయానికి అందుబాటులో ఉంది. ఈ కారు వచ్చి 25 ఏళ్లు గడుస్తున్నా ఏమాత్రం సేల్స్ తగ్గట్లేదు. ఈ కారు 2024 ప్రథమార్ధంలో 99,668 యూనిట్లను విక్రయించగా.. 2023 ప్రథమార్థంలో 1,09,278 యూనిట్లను విక్రయించింది. ఈ ఏడాది సేల్స్ 9 శాతం తగ్గినప్పటికీ రెండో స్థానంలో ఉంది.


Click it and Unblock the Notifications








