స్పీడ్‌లో తిరుగులేని రారాజు.. రాకెట్ వేగంతో దూసుకుపోతుంది.. మార్కెట్లోకి కొత్త లగ్జరీ కారు.. ధర ఎంతంటే!

భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచ దేశాల కంటే కూడా వేగంగా అభివృద్ధి చెందుతుంది. దీంతో ఇక్కడ వ్యాపారాలు ఎక్కువగా వృద్ధి చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో ధనవంతుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుంది. వారి లగ్జరీ లైఫ్ కోసం వెచ్చించే ఖర్చులు కూడా అధికంగానే ఉంటున్నాయి. ఈ క్రమంలో వారిని దృష్టిలో పెట్టుకుని పలు టాప్ ఆటోమొబైల్ తయారీ కంపెనీలు లగ్జీర ఫీచర్లతో టాప్ క్లాస్ కార్లను ఇండియా మార్కెట్లోకి వరుసగా విడుదల చేస్తున్నాయి. జర్మనీకి చెందిన దిగ్గజ కంపెనీ మెర్సిడెస్-బెంజ్ తన పోర్ట్‌ఫోలియోను భారత్‌లో విస్తరించడానికి ఈ ఏడాది డజనుకు పైగా బెంజ్ కార్లను భారత్‌లోకి లాంచ్ చేయగా, కంపెనీ తాజాగా ఏఎమ్‌జీ సీ 63 ఎస్‌ఈ( AMG C 63 SE) పనితీరును ఆవిష్కరించింది. ఈ కారు ధర ఇండియాలో రూ.1.95 కోట్లుగా ఉంది.

ఇది ఒక హైబ్రిడ్ కారు. మెర్సిడెస్-బెంజ్S 63 E, GT 63 E పనితీరు తర్వాత కంపెనీ నుంచి విడుదల అయిన మూడో మోడల్. దీని డిజైన్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. సాధారణ C-క్లాస్ కంటే 63 ఎస్‌ఈ ఫెర్ఫామెన్స్ చాలా బాగా ఉంటుందని తెలుస్తుంది. పాత మోడల్‌తో పోలిస్తే ఈ కారులో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా కారు ముందు గ్రిల్‌ చాలా ఆకట్టుకునే విధంగా ఉంది.

Mercedes Amg C63 Se Performance

ముందు ఉన్నటువంటి ఫెండర్లు 2 అంగుళాల వెడల్పుతో వచ్చాయి. ఇది V8 ఇంజిన్‌ను కాకుండా వెనుక ఎలక్ట్రిక్ మోటారుతో 2.0-లీటర్, ఇన్‌లైన్, 4-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో రన్ అవుతుంది. ఈ ఇంజిన్ 671 bhp పవర్, 1019 nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ప్రధానంగా 4MATIC+ ఆల్-వీల్ డ్రైవ్ టెక్నాలజీని కూడా కలిగి ఉంది.

ఈ కారులో అమర్చిన ఇంజిన్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన 4 సిలిండర్ ఇంజిన్‌. దీనిలో 89 కిలోల బరువున్న 6.1 kWh బ్యాటరీ ప్యాక్‌ను కూడా అందించారు. ప్రధానంగా ఈవీ మోడ్‌లో కారు 13 కి.మీ ప్రయాణిస్తుంది. ఇది కేవలం 3.4 సెకన్లలో 0 నుండి 100 కి మీ వేగాన్ని అందుకోగలదని కంపెనీ ప్రత్యేకంగా పేర్కొంది. గరిష్ట వేగం 280 kmph గా ఉంది.

ఇంటీరియర్ చాలా అందంగా అలంకరించినట్లుగా ఉంటుంది. లోపల నప్పా లెదర్‌తో కూడిన వెంటిలేటెడ్ స్పోర్ట్స్ సీట్లు, ఏఏంజీ ఏరోడైనమిక్స్ ఆధారంగా పనిచేసే ఏఐ వాయిస్ కంట్రోల్ సిస్టం, 15-స్పీకర్ బర్మన్ ఆడియో సిస్టమ్, అడాప్టివ్ డంపింగ్ సిస్టమ్‌ ఆధారిత ఏఏంజీ రైడ్ కంట్రోల్ సస్పెన్షన్, 2.5-డిగ్రీ రియర్ యాక్సిల్ స్టీరింగ్, భద్రత కోసం 7 ఎయిర్‌బ్యాగ్‌లు, ADAS, 360 డిగ్రీ కెమెరా వంటివి ఉన్నాయి.

ఏఎమ్‌జీ సీ 63 ఎస్‌ఈ ఎలక్ట్రిక్, కంఫర్ట్, స్పోర్ట్, స్పోర్ట్+, బ్యాటరీ హోల్డ్, రేస్, స్లిప్పరీ, ఇండివిజువల్‌ వంటి డ్రైవింగ్ మోడ్‌లతో అందుబాటులో ఉంటుంది. ఈ కారు లగ్జరీ విభాగంలో సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల నుంచి అధికంగా డిమాండ్ పొందే అవకాశం ఉందని కంపెనీ భావిస్తోంది. ఈ కారు బుకింగ్‌లు మొదలయ్యాయి. డెలివరీలు వచ్చే ఏడాది ఉంటాయి.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, November 13, 2024, 10:30 [IST]
English summary
Mercedes amg c63 se performance launched engine price features all details
Read more on: #mercedes benz #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+