విడుదలకు ముందే రచ్చ రచ్చ.. బుకింగ్స్‌లో భీభత్సం.. ఆ లగ్జరీ కారు ఏంటో తెలుసా?
లగ్జరీ కార్లలో వెళ్తుంటే ఆ మజాయే వేరుగా ఉంటుంది. దానిలో ప్రయాణిస్తున్నప్పుడు కలిగే అనుభూతిని మాటల్లో చెప్పలేం. ఇలాంటి ఫీలింగ్‌ను అందించడానికే జర్మన్ బ్రాండ్ మెర్సిడెస్ బెంజ్, ఇండియా మార్కెట్లోకి లగ్జరీ ఫీచర్లతో కొత్త మోడల్‌ను విడుదల చేసింది. దీని పేరు 'AMG G 63 ఫేస్‌లిఫ్ట్ (Mercedes AMG G 63)'. ఎస్‌యూవీ(SUV)గా వచ్చిన ఇది బయటి నుంచి గాంభీరంగా, స్టైలీష్ డిజైన్‌ను కలిగి ఉంది. దీనిలో వెళ్తుంటే ఆ రాజసం వేరే లెవల్‌లో ఉంటుంది. మార్కెట్లో ఈ మోడల్‌కు భారీ డిమాండ్ ఉంది. అందుకనే ఈ లగ్జరీ ఎస్‌యూవీ లాంచ్‌కు ముందే 120 యూనిట్ల బుకింగ్‌లను అందుకుంది. కస్టమర్లకు 2025 ప్రారంభంలో డెలివరీ ప్రారంభిస్తారు. మొదటి రౌండ్ బుకింగ్ పూర్తయిన నేపథ్యంలో రెండో రౌండ్ బుకింగ్‌లు ఓపెన్ చేశారు. ఈ కస్టమర్లకు వచ్చే ఏడాది మూడో త్రైమాసికంలో డెలివరీ చేస్తారు.
మెర్సిడెస్ బెంజ్ AMG G 63 ఫేస్‌లిఫ్ట్‌లో అధునాత ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ.3.6 కోట్లు(ఎక్స్-షోరూమ్). ఇది కేవలం 4.3 సెకన్లలో 0 నుంచి 100 kmph వేగాన్ని అందుకుంటుంది. స్టార్టింగ్‌లో మరింత స్పీడ్‌ను అందుకోడానికి ప్రత్యేకంగా రేస్ స్టార్ట్ ఫంక్షన్‌తో వస్తుంది. గరిష్ట వేగం గంటకు 240 కి.మీగా ఉంది.

ఇంజిన్-సామర్థ్యం: ఈ SUV 4.0-లీటర్ V8 బై-టర్బో ఇంజిన్‌తో వచ్చింది. 585 bhp పవర్ వద్ద 850 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్‌కు అదనంగా 48V మైల్డ్-హైబ్రిడ్ సాంకేతికతను జత చేశారు. దీంతో మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్ నుండి 22 bhp వరకు అదనపు పవర్‌ను పొందుతుంది. ఇంకా, 9-స్పీడ్ DCT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ దీనిలో ఉంది.
ఇంటీరియర్-ఎక్స్‌టీరియర్: చూడటానికి గాంభీరమైన లుక్‌తో కనిపించే ఈ G క్లాస్ ఫేస్‌లిఫ్ట్‌లో నిటారుగా ఉన్న ఫ్రంట్ బంపర్, వర్టికల్ స్లాట్‌లు, రేడియేటర్ గ్రిల్‌పై డార్క్ క్రోమ్ ఫినిషింగ్, ముందు కంపెనీ సింబల్ ఉన్నాయి. 229 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంది.

విలాసవంతమైన అనుభూతిని అందించడానికి క్యాబిన్ లోపల చాలా అందంగా ఉంటుంది. దీనిలో నప్పా లెదర్ అప్హోల్స్టరీ, కార్బన్ ఫైబర్ ట్రిమ్, కార్బన్ ఫైబర్ ట్రిమ్, యాంబియంట్ లైటింగ్ ఆప్షన్‌లు ఉన్నాయి. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లో 12.3 ఇంచెస్ డ్రైవర్ డిస్‌ప్లే, మల్టీమీడియా స్క్రీన్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఇంటిగ్రేషన్, ఆగ్మెంటెడ్ రియాలిటీ నావిగేషన్ ఉన్నాయి.
ఇది మొదటిసారిగా కీలెస్ ఫీచర్‌తో వచ్చింది. 18 స్పీకర్లతో బర్మెస్టర్ 3D సరౌండ్ సౌండ్ సిస్టమ్, యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, కీలకమైన ఫంక్షన్‌లను సులభంగా యాక్సెస్ చేయడానికి డ్యాష్‌బోర్డ్ మధ్యలో ఉన్న ఆఫ్-రోడ్ 'కంట్రోల్ సెంటర్' , క్యాబిన్‌లో వేడి పెరిగినప్పుడు కంట్రోల్ చేయడానికి ప్రత్యేక కప్ హోల్డర్‌లు ఈ G-క్లాస్ ఫేస్‌లిఫ్ట్‌లో ఉన్నాయి.

ఇంకా, యాక్టివ్ బ్రేక్ అసిస్ట్, లేన్ కీపింగ్ అసిస్ట్, 360-డిగ్రీ కెమెరా సిస్టమ్ వంటి సరికొత్త డ్రైవర్ సహాయ ఫీచర్లు దీనిలో ఉన్నాయి. ఇవి ఆన్-రోడ్, ఆఫ్-రోడ్ రెండింటిలోనూ డ్రైవింగ్‌ను ఈజీగా, సురక్షితంగా చేయడానికి సహాయపడతాయి. ఎత్తుపల్లాలు ఉన్న రోడ్లపై కూడా చాలా ఈజీగా వెళ్తుంది. ముఖ్యంగా 700mm నీటి-వేడింగ్ డెప్త్ కెపాసిటీని కలిగి ఉంది. దీంతో లోతైన నీటి గుంతలు, వరదలో సైతం రయ్ మంటూ దూసుకెళ్తుంది.
ఈ దీపావళి పండుగకు ముందు ఘనంగా లాంచ్ అయిన AMG G 63 ఫేస్‌లిఫ్ట్ మరిన్ని అదనపు హంగులతో వచ్చింది. ముందు, సైడ్, వెనుక నుంచి రాజసం లాంటి లుక్‌తో బుకింగ్‌లకు అందుబాటులో ఉంది. కొనుగోలు చేయాలని అనుకుంటున్న వారు త్వరగా బుకింగ్ చేసుకోవడం బెస్ట్.


Click it and Unblock the Notifications








