మెర్సిడెస్‌ నుంచి రెండు కొత్త కార్లు లాంచ్‌.. ఇవి కొనాలంటే ఏదైనా తాకట్టు పెట్టాల్సిందే!

మెర్సిడెస్ బెంజ్ (Mercedes Benz) భారతీయ మార్కెట్‌లో రెండు కొత్త కార్లను విడుదల చేసింది. ఇందులో AMG GLC 43 మరియు CLE 300 క్యాబ్రియోలెట్ (CLE 300 Cabriolet) లను నేడు అధికారికంగా లాంచ్‌ చేసింది. గత నెలలో EQA, EQB ఎలక్ట్రిక్ కార్ల విడుదల తర్వాత ఈ కంపెనీ నుంచి వస్తున్న రెండు కొత్త కార్లు ఇవే కావడం విశేషం. ఈ మోడళ్లు హై పర్ఫామెన్స్‌ మరియు లైఫ్‌స్టైల్‌ కార్లను కోరుకునే భారతీయ వినియోగదారులకు ఇవి బెస్ట్‌ ఆప్షన్‌గా ఉంటాయి. GLC 43 4మాటిక్ కూపే ప్రత్యేకమైన 'వన్ మ్యాన్, వన్ ఇంజిన్' ఫిలాసఫీని కలిగి ఉంది. ఇక సీఎల్‌ఈ 300 క్యాబ్రియోలెట్ ఓపెన్-టాప్ డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

AMG GLC 43 కూపే మ (ఆల్-ఇండియా ఎక్స్-షోరూమ్ ధర) నిర్ణయించింది. మెర్సిడెస్-AMG GLC 43 48 వి మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీతో 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 421 bhp మరియు 500 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

Mercedes-AMG-GLC-43-4MATIC-Launch

ఇది కేవలం 4.7 సెకన్లలో 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అలాగే గరిష్టంగా గంటకు 250 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ ఇంజిన్ 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్‌తో జతచేయబడి ఆల్-వీల్ డ్రైవ్‌ని కలిగి ఉంది. రియర్ వీల్ స్టీరింగ్, హై పెర్ఫార్మెన్స్ బ్రేకులు, స్పీడ్ సెన్సింగ్ స్టీరింగ్, అడ్జస్టబుల్ సస్పెన్షన్ డంపర్స్ వంటి స్టాండర్డ్ ఫీచర్లుగా ఉన్నాయి.

ఇక మెర్సిడెస్ బెంజ్ CLE 300 క్యాబ్రియోలెట్ ఎనర్జిటిక్ ఎయిర్ కంట్రోల్, హ్యాండ్స్ ఫ్రీ యాక్సెస్ మరియు కీలెస్-గో వంటి ఫీచర్లతో వస్తుంది. అంతే కాకుండా డైనమిక్ యాంబియంట్ లైటింగ్, క్రోమ్ ట్రిమ్ మరియు లెదర్ అప్హోల్స్టరీతో క్యాబిన్ ప్రత్యేకమైన ర్యాప్-ఎరౌండ్ అనుభూతిని అందిస్తుంది. ఈ క్యాబ్రియోలెట్ వెనుక ప్రయాణీకుల కోసం ప్రత్యేక హెడ్ ఎయిర్ బ్యాగులను ప్రామాణికంగా చేర్చిన మొదటి మెర్సిడెస్ బెంజ్‌గా నిలిచింది.

Mercedes-CLE300-Cabriolet-Launch

CLE క్యాబ్రియోలెట్ లో 2.0-లీటర్ నాలుగు సిలిండర్ల టర్బో-పెట్రోల్ ఇంజిన్ కలదు. ఇది 48 వోల్ట్ మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్‌తో 258 bhp పవర్ మరియు 400 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో జతచేయబడింది. ఇది కేవలం 6.6 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది అంతే కాకుండా గరిష్టంగా గంటకు 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

భారత్‌లో మంచి ఫర్ఫామెన్స్‌ మరియు లైఫ్‌స్టైల్‌ వాహనాలను కోరుకునే భారతీయ వినియోగదారుల కోసం GLC 43 4మాటిక్ కూపే మరియు CLE 300 క్యాబ్రియోలెట్ AMG లైనప్స్‌ని తీసుకువచ్చినట్లు మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈవో సంతోష్ అయ్యర్ తెలిపారు. ఈ రెండు టాప్-ఎండ్ వాహనాలను విడుదలతో మార్కెట్‌లో డబుల్‌ ఫిగర్‌ని చేరుకుంటామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Mercedes-CLE300-Cabriolet-Launch

రిటైల్ ఇన్‌ఫాస్ట్రక్చర్‌: మెర్సిడెస్ బెంజ్ మంచి ఉత్పత్తులను అందించడంతో పాటు, ఆధునిక లగ్జరీ డీలర్షిప్ల ద్వారా ప్రపంచ స్థాయి రిటైల్ మౌలిక సదుపాయాలను అందించడంపై దృష్టి పెడుతుంది. 2024లోనే దేశవ్యాప్తంగా 11 డీలర్షిప్లను ప్రారంభించి వాటిని అప్‌గ్రేడ్‌ చేసింది. ఈ లగ్జరీ డీలర్‌షిప్స్‌ కార్ల కొనుగోలు కోసం వచ్చే కస్టమర్ల అనుభవాలను పెంచడానికి ఆధునిక అంశాలు, తాజా డిజిటల్ ప్రక్రియలు మరియు బొటిక్ కన్సల్టెన్సీలను కలిగి ఉన్నాయి.

మెర్సిడెస్ బెంజ్ కూడా తమ బ్రాండ్‌కి తగినట్లుగా మరింత లగ్జరీ అనుభవాన్ని అందించడానికి 'మొబిలిటీ డిలైట్' వంటి వినూత్న కస్టమర్ సేవా కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. దీని ద్వారా కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం భారత్‌లో పూర్తి కార్యకలాపాలు ఇతర వాణిజ్య అవసరాలపైన మెర్సిడెస్‌ దృష్టి సారించింది.

More from DriveSpark

Article Published On: Thursday, August 8, 2024, 18:47 [IST]
English summary
Mercedes amg glc 43 and cle 300 cabriolet launched in india check price and specifications
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+