మెర్సెడెస్ బెంజ్ నుంచి వివిధ సరికొత్త కార్లు లాంచ్.. ఈ సారి అందుబాటు ధరల్లో
మెర్సిడెస్ బెంజ్ సీ-క్లాస్ మరియు GLC మోడళ్లను భారతదేశంలో విడుదల చేసింది. ఈ కార్లను కొనుగోలు చేయడానికి భారతీయులు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం ఈ కార్లను కొనేందుకు కారు ప్రియులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇంతకు ముందు అందుబాటులో ఉన్న మోడళ్లతో పోలిస్తే ఈ కార్లలో సరికొత్త సంస్థ తీసుకువచ్చింది. మెర్సిడెస్ బెంజ్ కేవలం సంపన్నులకు మాత్రమే ఫేవరెట్ కంపెనీగా ఉండేది. ఇప్పుడు ఇతరులు సైతం ఈ కంపెనీ కార్లను కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా ఈ కంపెనీ ఉత్పత్తులకు మంచి ఆదరణ లభిస్తోంది. అంతే మొత్తంలో అమ్మకాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. తాజాగా ఈ కార్లలో ఎటువంటి అప్‌డేట్స్ ఉన్నాయి? ఈ కార్లలో కొత్తగా ఎలాంటి ఫీచర్లు జోడించారనే అంశాలు ఈ కథనంలో..
మెర్సిడెస్ బెంజ్ సీ-300 AMG లైన్ భారతదేశంలో లాంచ్ అయింది. ఇది ఇప్పటికే విక్రయానికి అందుబాటులో ఉన్న సీ 300డీ డీజిల్ ఇంజిన్ స్థానాన్ని భర్తీ చేస్తుంది. మెర్సిడెస్ బెంజ్ సీ 300 AMG లైన్ భారతదేశంలో రూ .69 లక్షల ధరతో లాంచ్ అయింది. మరో సీ-200 పెట్రోల్ ఇంజిన్ ధర రూ.61.85 లక్షలు, డీజిల్ ఇంజిన్ సీ-220డీ ధర రూ.62.85 లక్షలుగా ఉంది.

అప్‌డేటెడ్ జీఎల్‌సీ రెండు వేరియంట్లలో లభిస్తుంది. జీఎల్‌సీ 220 డి 4మాటిక్ 4మాటిక్ డీజిల్ ఇంజిన్ ధర రూ .76.9 లక్షలు, జీఎల్‌సీ 300 4 మాటిక్ పెట్రోల్ ఇంజిన్ ధర రూ. 75.9 లక్షలుగా ఉన్నాయి. ఆసక్తిగల కొనుగోలుదారులు ఈ కారును ఆన్‌లైన్ లేదా సమీపంలోని బెంజ్ డీలర్షిప్ వద్ద బుక్ చేసుకోవచ్చు.
మెర్సిడెస్ బెంజ్ సీ300 AMG లైన్ ముందు మరియు వెనుక భాగంలో అగ్రెసివ్ బంపర్లతో వస్తుంది. వీటితో పాటు ఏఎంజీ మల్టీస్పోక్ అల్లాయ్ వీల్స్ కూడా అందించారు. ఇది మాన్యుఫాక్చరింగ్ కలర్ ఆప్షన్ తో బ్లాక్ ఇంటీరియర్‌తో వస్తుంది. ఈ కారులో అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఈ కారులో బర్మాస్టర్ 3డీ సౌండ్ సిస్టమ్ మరియు ఆర్గ్యుమెంటేటెడ్ రియాలిటీ నావిగేషన్‌ని కలిగి ఉంది.

సీ300 AMG లైన్ 2.0-లీటర్, నాలుగు సిలిండర్ల, టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 258bhp పవర్ మరియు 400nm టార్క్ విడుదల చేస్తుంది. ఇంజిన్‌కి ఇంటర్ కేటెడ్ స్టార్టర్ జనరేటర్‌ని అమర్చారు. ఇది గరిష్టంగా 22bhp పవర్ మరియు 25nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది కాకుండా, ఈ కారులో ఓవర్ బూస్ట్ ఆప్షన్ కూడా ఉంది.
ఈ ఇంజన్ 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ కారును ఫ్రంట్ వీల్ డ్రైవ్‌తో వస్తుంది. ఈ కారు కేవలం 6 సెకన్లలో 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ కారు గరిష్టంగా గంటకు 250 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. సీ-క్లాస్ మరియు జీఎల్‌సీలో హీట్ మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి.

360 డిగ్రీల కెమెరా, 6-ఫాస్ట్ ఛార్జింగ్ యూఎస్‌బీ పోర్టులు, అడాప్టివ్ హై బీమ్ అసిస్ట్, డిజిటల్ కీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. జీల్‌సీలో తొమ్మిది అదనపు ఎయిర్ బ్యాగులు కూడా ఉన్నాయి. ఇక సీ క్లాస్‌లోని సీ200లో 1.5-లీటర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ కలదు. ఇది గరిష్టంగా 204bhp పవర్ మరియు 300nm గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.
సీ220డిలో 2.0-లీటర్ టర్బోఛార్జ్డ్ డీజల్ ఇంజిన్ కలదు. ఇది గరిష్టంగా 200bhp మరియు 440nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రెండు ఇంజన్లు 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ కలిగి ఉన్నాయి. జీఎల్‌సీ 2.0-లీటర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా 258bhp పవర్ మరియు 400nm టార్క్‌ను, జీఎల్‌సీ 220డిలో 2.0-లీటర్ డీజల్ ఇంజిన్ 197bhp పవర్ మరియు 440nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.
పైన తెలిపిన రెండు ఇంజిన్లు 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి. వీటిలో 4 వీల్ డ్రైవ్ 4 మాటిక్ సిస్టమ్ జతచేయబడి ఉంటుంది. రెండు ఇంజన్లు 48 వోల్ట్ మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్‌తో జతచేయబడి ఉంటాయి. వీటిలోనూ ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్‌ను అమర్చారు. ఇది గరిష్టంగా 23bhp పవర్ మరియు 200nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.


Click it and Unblock the Notifications








