సింగిల్‌ ఛార్జ్‌లో 809 కి.మీ రేంజ్‌తో లగ్జరీ కారు లాంచ్‌.. ధర ఎంతో తెలుసా?

మెర్సిడెస్ బెంజ్ (Mercedes Benz) భారతదేశంలో సరికొత్త ఈక్యూఎస్ ఎస్‌యూవీని విడుదల చేసింది. ఈ సరికొత్త లగ్జరీ కారుని రూ .1.41 కోట్లు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో భారతీయ మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. కంపెనీ ఇటీవలే విడుదల చేసిన మేబాక్‌ ఈక్యూఎస్ ఎస్‌యూవీ తర్వాత దీనిని తీసుకువచ్చింది. మెర్సిడెస్ నుంచి భారత్‌లో లాంచ్‌ అయిన 6th ఎలక్ట్రిక్ కారు కావడం విశేషం. భారత్‌లో తన మార్కెట్‌ని మరింత వేగవంతం చేసేందుకు కార్లను మెర్సిడెస్‌ విడుదల చేస్తుంది. ఈ సరికొత్త ఈక్యూఎస్‌ ఎస్‌యూవీ EQE ఎస్‌యూవీ, మేబాక్‌ ఈక్యూఎస్‌ ఎస్‌యూవీల మధ్య రకంగా ఉంటుంది. ఈ సరికొత్త ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ రేంజ్, ఫీచర్లు, ఇతర డిజైన్‌ వివరాలపై ఓ లుక్కేయండి.

ఈ ఈక్యూఎస్ ఎస్‌యూవీ ఎక్స్‌టీరియర్‌లో బ్లాక్ ప్యానెల్ గ్రిల్‌ చూడగానే ఆకట్టుకుంటుంది. దీని దిగువన ఫ్రంట్ బంపర్ వరకు విస్తరించి ఉంటుంది. ఎల్ఈడి లైట్ బార్ ద్వారా కనెక్ట్ చేయబడిన ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్ అదనపు ఆకర్షణగా ఉంటాయి. క్రోమ్-హెవీ మేబాక్‌ వెర్షన్ మాదిరిగా కాకుండా, స్టాండర్డ్ ఈక్యూఎస్ ఎస్‌యూవీ వలె తక్కువ క్రోమ్ ఫినిషింగ్‌ని కలిగి ఉంది. వెనుక భాగంలో, ఫుల్‌ లెంత్‌ LED టెయిల్ ల్యాంప్స్‌ వస్తాయి.

Mercedes Benz EQS SUV Launch

ఇది తక్కువ క్రోమ్ ఎలిమెంట్స్‌తో రీడిజైన్ చేయబడిన బంపర్‌తో వస్తుంది. ఇక దీని ఇంటీరియర్‌ ఈక్యూఎస్ ఎస్‌యూవీలో సింగిల్ 580 4మేటిక్‌ స్పెక్‌లో లభిస్తుంది. ఇందులో హైపర్‌స్క్రీన్‌ సెటప్ ఉంది. ఇందులో 12.3 అంగుళాల ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్, 17.7 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 12.3 అంగుళాల ఫ్రంట్ ప్యాసింజర్ స్క్రీన్ ఉన్నాయి.

ఇక ఇందులో 21 అంగుళాల AMG అల్లాయ్ వీల్స్, సాఫ్ట్ క్లోజ్ డోర్లు, పడిల్‌ ల్యాంప్స్, ఇల్యూమినేటెడ్ రన్నింగ్ బోర్డులు, 15 స్పీకర్ల సౌండ్ సిస్టమ్ వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. ఇంకా మరెన్నో మెర్సిడెస్‌ ప్రత్యేక అలంకరణ, థీమ్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది. ఇంటీరియర్‌ మొత్తం లగ్జరీ ఫీచర్లతో అధునాతనంగా ఉంటుంది.

Mercedes Benz EQS Electric SUV

ఈ కారులో ఫైవ్ జోన్ క్లైమేట్ కంట్రోల్, డ్యూయల్ 11.6 అంగుళాల రియర్ ఎంటర్టైన్మెంట్ స్క్రీన్లు ఉన్నాయి. సేఫ్టీ కోసం లెవల్ 2 ఏడీఏఎస్, 9 ఎయిర్‌బ్యాగ్స్‌ ఇందులో ఉన్నాయి. మెర్సిడెస్ ఈ మోడల్‌ని భారతదేశంలో స్టాండర్డ్ ఏడు సీట్ల కాన్ఫిగరేషన్‌తో అందిస్తుంది. ఇందులో సీటింగ్‌ లగ్జరీయస్‌ అనుభూతిని అందిస్తుంది.

ఇక ఈ ఈక్యూఎస్ ఎస్‌యూవీ పవర్ ట్రెయిన్‌ విషయానికి వస్తే ఇందులోని డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్లకు శక్తినిచ్చే 122 కిలోవాట్ల భారీ బ్యాటరీ ప్యాక్‌ ఉంది. ఇది 544bhp పవర్‌ని, 858 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు కేవలం 4.7 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. కావున ఫర్ఫామెన్స్‌లో ఎటువంటి రాజీ ఉండదని అర్థం అవుతుంది.

Mercedes Benz EQS SUV

ఈ ఈక్యూఎస్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 809 కి.మీ (ఏఆర్ఏఐ-సర్టిఫైడ్) రేంజ్‌ని అందిస్తుంది. 200 కిలోవాట్ల డీసీ ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగించి కేవలం 31 నిమిషాల్లో బ్యాటరీని 10 నుంచి 80 శాతం ఛార్జ్ చేయవచ్చు. అయితే సాధారణ 7.4 కిలోవాట్ల ఏసీ ఛార్జర్‌ని పూర్తిగా ఛార్జ్ చేయడానికి సుమారు 18.5 గంటల సమయం పడుతుంది.

ఈ ఎస్‌యూవీ నేరుగా బీఎమ్‌డబ్య్లూ ఐఎక్స్ (BMW iX), ఆడి క్యూ8 ఇ-ట్రాన్ (Audi Q8 e-tron) వంటి ఫ్లాగ్ షిప్ ఎలక్ట్రిక్ కార్లతో పోటీపడుతుంది. అయితే మెర్సిడెస్ EQE ఎస్‌యూవీకి ప్రస్తుతం భారతదేశంలో ప్రత్యక్ష ప్రత్యర్థి కార్లు లేవు. భారతీయ మార్కెట్‌లో తమ గ్రిప్‌ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే దీనిని ప్రవేశపెట్టింది.

More from DriveSpark

Article Published On: Monday, September 16, 2024, 16:15 [IST]
English summary
Mercedes benz eqs suv launched in india at rs 1 41 crores check specifications here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+