లాంచ్‌కు సిద్దమవుతున్న కొత్త బెంజ్ కారు.. డిజైన్‌కే ఫిదా అవుతున్న జనం!

ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'మెర్సిడెస్ బెంజ్' కొత్త 'సీఎల్ఈ 53 4మ్యాటిక్ ప్లస్ క్యాబ్రియోలెట్‌' ఆవిష్కరించింది. కంపెనీ ఆవిష్కరించిన ఈ కొత్త కారు డిజైన్, ఫీచర్స్ మరియు ఇంజిన్ వంటి వివరాలను వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.

మెర్సిడెస్ బెంజ్ ఆవిష్కరించిన సీఎల్ఈ 53 4మ్యాటిక్ ప్లస్ క్యాబ్రియోలెట్‌ (CLE 53 4Matic+ Cabriolet) కారు ఎస్ఎల్ రోడ్‌స్టర్‌ ఆధారంగా రూపొందించబడి మెర్సిడెస్ ఏఎంజీ లైనప్‌ యొక్క రెండవ ఓపెన్ టాప్ వేరియంట్. ఇది మంచి డిజైన్, ఆధునిక ఫీచర్స్ కలిగి చూడగానే ఆకర్శించే విధంగా ఉంటుంది. ఇది దాని మునుపటి అన్ని మోడల్స్ కంటే కూడా కొంత భిన్నంగా ఉండటం చూడవచ్చు.

Mercedes-AMG CLE 56 4Matic Cabriolet

కొత్త బెంజ్ సీఎల్ఈ 53 4మ్యాటిక్ ప్లస్ క్యాబ్రియోలెట్‌ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌, ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్‌లు, స్పోర్టియర్ బంపర్‌, స్పోర్టియర్ యాక్సెంట్‌లు, స్పాయిలర్ లిప్, ఏరోడైనమిక్ ఫ్లిక్స్ మరియు టెయిల్‌పైప్‌ల మధ్య గ్లోసీ బ్లాక్ డిఫ్యూజర్‌ వంటి వాటిని పొందుతుంది. ఇది 19 ఇంచెస్ స్టాండర్డ్ వీల్స్ పొందుతుంది. అంతే కాకుండా.. 20 ఇంచెస్ అనేది ఆప్షనల్‌గా పొందవచ్చు.

ఫీచర్స్ విషయానికి వస్తే.. మెర్సిడెస్ బెంజ్ సీఎల్ఈ 53 4మ్యాటిక్ ప్లస్ క్యాబ్రియోలెట్‌ లోపల 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లే మరియు 11.9 ఇంచెస్ సెంట్రల్ డిస్‌ప్లే వంటివి ఉన్నాయి. అంతే కాకుండా 64 కలర్ డైనమిక్ యంబియంట్ లైటింగ్, స్పోర్ట్స్ సీట్లు, ఎయిర్‌క్యాప్ ఎలక్ట్రిక్ విండ్ డిఫ్లెక్టర్ సిస్టమ్ మరియు ఎయిర్‌స్కార్ఫ్ హెడ్‌రూమ్ హీటింగ్ సిస్టమ్‌ వంటివి ఇందులో ఉన్నాయి.

Mercedes-AMG CLE 56 4Matic Cabriolet Rear

మెర్సిడెస్ బెంజ్ సీఎల్ఈ 53 4మ్యాటిక్ ప్లస్ క్యాబ్రియోలెట్‌ 3.0 లీటర్ 6 సిలిండర్ టర్బోఛార్జ్డ్ ఇంజిన్ పొందుతుంది. దీనితో పాటు 48వీ స్టార్టర్ జనరేటర్ కూడా ఉంటుంది. ఇంజిన్ 443 Bhp పవర్ మరియు 560 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. కాగా 48వీ ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జెనరేటర్ అదనంగా పవర్ మరియు టార్క్ అందిస్తుంది. పనితీరు పరంగా ఇది చాలా ఉత్తమంగా ఉంటుందని భావిస్తున్నాము.

బెంజ్ సీఎల్ఈ 53 4మ్యాటిక్ ప్లస్ క్యాబ్రియోలెట్‌ కారు కేవలం 4.4 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 250 కిమీ వరకు ఉంటుంది. ఇంజిన్ 9 స్పీడ్ గేర్‌బాక్స్ ద్వారా పవర్ డెలివరీ చేస్తుంది. ఇందులో టార్క్ వెక్టరింగ్ ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టం కూడా ఉంటుంది. కాబట్టి వాహన వినియోగదారులు మంచి డ్రైవింగ్ అనుభూతిని పొందవచ్చు.

Mercedes-AMG CLE 56 4Matic Cabriolet Interior

విడుదలకు సిద్దమవుతున్న కొత్త బెంజ్ సీఎల్ఈ 53 4మ్యాటిక్ ప్లస్ క్యాబ్రియోలెట్‌ కారును డ్రైవర్ మెర్సిడెస్ ఎయిర్‌క్యాప్ సిస్టమ్‌తో కాన్ఫిగర్ చేయవచ్చు. ఇది డ్రైవింగ్ సమయంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కారులోని రూఫ్‌ను 20 సెకన్లు పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. ఈ కారు అమెరికన్ మార్కెట్లో ఈ ఏడాది ద్వితీయార్థంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ధరలు కూడా అధికారికంగా తెలియాల్సి ఉంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Wednesday, May 8, 2024, 14:04 [IST]
English summary
Mercedes benz new car amg cle 53 cabriolet revealed
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+