సరికొత్త మెర్సిడెస్ బెంజ్ ఎలక్ట్రిక్ కారు.. బుకింగ్స్ షురూ!
భారతదేశంలో జర్మన్ బ్రాండ్ మెర్సిడెస్ బెంజ్ కార్లకు ఎంత డిమాండ్ ఉందో అందరికి తెలుసు. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త కార్లను లాంచ్ చేస్తూ ఉంది. ఇటీవల ఈక్యూబీ మరియు ఈక్యూఏ వంటి ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేసిన బెంజ్.. ఇప్పుడు ఐకానిక్ జీ-వ్యాగన్ కార్లను ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ చేయడానికి సిద్ధమైంది. అంతకంటే ముందు సంస్థ దీని కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. అయితే కంపెనీ ఈ కారును ఎప్పుడు లాంచ్ చేస్తుంది? ధరలు ఎలా ఉంటాయి? ఇతర వివరాలు ఏంటి అనేది ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
మెర్సిడెస్ బెంజ్ లాంచ్ చేయనున్న కొత్త జీ వ్యాగన్ ఎలక్ట్రిక్ కారుకు జీ 580 అని నామకరణం చేశారు. ఇది ఈక్యూ టెక్నాలజీ పొందుతుంది. ఈ కారు సాధారణ మోడల్ కంటే కూడా భిన్నంగా కనిపించటానికి ఇందులో అనేక కాస్మొటిక్ అప్డేటెడ్స్ చేయడం జరిగింది. కాబట్టి దీనిని చూసిన వెంటనే ఇదొక ఎలక్ట్రిక్ కారు అని తప్పకుండా చెప్పవచ్చు.

రాబోయే జీ 580 కారు యొక్క పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే.. ఇది క్వాడ్ మోటార్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ పొందుతుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ 579 Bhp పవర్ మరియు 1164 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. సుమారు మూడు టన్నుల బరువున్న ఈ ఎలక్ట్రిక్ కారు 0 నుంచి 100 కిమీ/గం వేగవంతం కావడానికి పట్టే సమయం ఐదు సెకన్ల కంటే తక్కువే అని తెలుస్తోంది.
మెర్సిడెస్ జీ 580 ఎలక్ట్రిక్ కారు అయినప్పటికీ ఆఫ్-రోడింగ్ కెపాసిటీ కూడా పొందుతుంది. డిజైన్ పరంగా ఇది స్టాండర్డ్ మోడల్ కంటే కొంత భిన్నంగా ఉంటుంది. ఇందులో ఫ్రంట్ గ్రిల్ క్లోజ్డ్ ఆఫ్ ప్యానెల్ ద్వారా భర్తీ చేయబడి ఉంటుంది. అయితే కొనుగోలుదారు ఇల్యూమినేటెడ్ సరౌండ్ మరియు బ్లాక్ హెడ్‌ల్యాంప్ హౌసింగ్‌లతో కూడిన ఈక్యూ స్టైల్ గ్రిల్‌ను ఎంచుకోవచ్చు. కొత్త అల్లాయ్ వీల్ డిజైన్ మినహా ప్రొఫైల్ పెద్దగా మారలేదు.

రియర్ ఫ్రొపైల్ విషయానికి వస్తే.. మెర్సిడెస్ బెంజ్ ఎలక్ట్రిక్ జీ 580 స్టాండర్డ్ మోడల్స్ మాదిరిగానే టెయిల్‌గేట్ మౌంటెడ్ స్పేర్ వీల్‌ను కలిగి ఉంది. ఇంటీరియర్ దాదాపు స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. ఇది డ్యాష్‌బోర్డ్‌లో 12.3 ఇంచెస్ డిజిటల్ డిస్‌ప్లేలను పొందుతుంది. అంతే కాకుండా ఇందులో వాయిస్ అసిస్టెంట్ కూడా ఉంటుందని సమాచారం. మొత్తం మీద డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా ఇది చాలా ఉత్తమంగా ఉంటుందని తెలుస్తోంది.
బెంజ్ జీ 580 ఎలక్ట్రిక్ కారులో ఉండే క్వాడ్ మోటార్ ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్ ప్రతి చక్రానికి పవర్ డెలివరీ చేస్తుంది. కాబట్టి ఇది ఉత్తమ పనితీరును అందిస్తుంది. ఈ కారులో 116 కిలోవాట్ అండర్ ప్లోర్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది ఒక ఫుల్ ఛార్జితో ఏకంగా 473 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ కారు యొక్క టాప్ స్పీడ్ గంటకు 180 కిమీ కావడం గమనించదగ్గ విషయం.

కొత్త మెర్సిడెస్ బెంజ్ జీ 580 ఎలక్ట్రిక్ 200 కిలోవాట్ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇది కేవలం 32 నిమిషాల్లో 10-80 శాతం వరకు ఛార్జ్ చేయగలదు. ఇది 11కిలోవాట్ ఏసీ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. దీని ద్వారా ఛార్జ్ కావడానికి కొంత సమయం పడుతుంది. ఈ కారు మార్కెట్లో లాంచ్ అయిన తరువాత రూ.3 కోట్ల కంటే ఎక్కువ ధర వద్ద లభించే అవకాశం ఉంటుంది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








