ఆకర్షణీయమైన ధర.. 560 కి.మీ రేంజ్‌తో మెర్సిడెస్‌ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్‌ కారు లాంచ్‌

జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ తన ఈక్యూ లైనప్‌లో సరికొత్త ఈక్యూఏ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. కొత్త మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ. 66 లక్షలు, ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది. ఈ మెర్సిడెస్ ఈక్యూఏ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఆ కంపెనీ లైనప్‌లో అతిచిన్న, అత్యంత సరసమైన ఆల్-ఎలక్ట్రిక్ ఆఫర్‌గా ఉంది. కొత్త మెర్సిడెస్ బెంజ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఈక్యూఏ 250+ అనే సింగిల్ వేరియంట్‌లో లభిస్తుంది. ఈ కారుకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో..

ఈ కారు మొత్తం ఏడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. కొత్త మెర్సిడెస్ ఈక్యూఏ 250+ మునుపటి మోడళ్ల మాదిరిగానే ఉండనుంది. ఈ ఎలక్ట్రిక్ కారు ముందు భాగంలో పియానో బ్లాక్ గ్రిల్‌ని కలిగి ఉంది. దీని మధ్యలో పెద్ద మెర్సిడెస్ లోగో ఉంటుంది. ఫ్రంట్ ఆప్రాన్‌లో క్రోమ్ ఎలిమెంట్స్ కూడా గమనించవచ్చు. ముందు భాగంలోని ఫీచర్లు కారుని అధునాతన లుక్స్‌ని అందిస్తుంది.

Mercedes-EQA-Electric-Car-Launched

ఈ మెర్సిడెస్ ఇక్యూఏ కారురు గ్రిల్‌కి ఇరువైపులా ఇంటిగ్రేటెడ్ DRLలతో సర్దుబాటు చేయగల LED హెడ్ లైట్లు EQ మోడళ్లలో కనిపించే బ్లూ కలర్‌ ఎలిమెంట్ ఉన్నాయి. హెడ్ లైట్లను కనెక్ట్ చేస్తూ గ్రిల్ పైభాగం వరకు విస్తరించిన చిన్న లైట్ బార్ ఉంటుంది. ఈఇక్యూఏ 250 ప్లస్ బైకులో 19 అంగుళాల AMG లైట్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఇందులో ట్విన్ డిస్ప్లేలను కలిగి ఉంటాయి.

ఎడమ భాగం స్టార్ ప్యాటర్న్ ట్రిమ్‌ని కలిగి ఉంటుంది. ఇక ఇందులో హెడ్-అప్ డిస్ప్లే, వైర్‌లెస్‌ ఫోన్ ఛార్జర్, ఐదు యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్స్‌ ఉన్నాయి. ఈ కారులోని ట్విన్ డిస్ ప్లేలు లేటెస్ట్ MBUX జెన్ 2 సాఫ్ట్ వేర్‌తో పనిచేస్తాయి. ఇది వైర్ లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే కనెక్టివిటీని ఇన్ఫోటైన్‌మెంట్‌ట్ డిస్‌ప్లేకు అనుమతిస్తుంది.

Mercedes-EQA-Electric-Car-Launched-In-India

ఇన్‌ఫోటైన్‌మెంట్‌ డిస్ప్లే రియాలిటీ టర్న్-బై-టర్న్ నావిగేషన్‌ని కలిగి ఉంది. ఇది లాంగ్ డ్రైవ్ లలో చాలా సహాయపడుతుంది. డాల్బీ అట్మోస్ ను సపోర్ట్ చేసే 710 వాట్ల బర్మెస్టర్ సౌండ్ సిస్టమ్ తో ఇన్ఫోటైన్ మెంట్ సెటప్‌ని మరియు 12 స్పీకర్లను కలిగి ఉంటుంది. ఈ మెర్సిడెస్ ఈక్యూఏ కారు ఈక్యూ లైనప్‌లో అతి చిన్నదిగా ఉంది.

ఇక మెర్సిడెస్ ఈక్యూఏ పొడవు 4,463 మిమీ, వెడల్పు 1,834 మిమీ మరియు ఎత్తు 1,624 మిమీ మరియు వీల్ బేస్ 2,729 మిమీగా ఉంది. మెర్సిడెస్ ఈక్యూఏ 250+ బైక్ ముందు యాక్సిల్‌కి అమర్చిన సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 190bhp పవర్‌ మరియు 385nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేయును.

ఈ మెర్సిడెస్ ఈక్యూఏ 250+ ఎలక్ట్రిక్ కారు 0-100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 8.6 సెకన్లలో అందుకుంటుంది. ఈ మెర్సిడెస్ ఎలక్ట్రిక్ కారు గరిష్ట వేగం గంటకు 160 కిలోమీటర్లు. ఈ మోటారు 70.5 కిలోవాట్ల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 560 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఈ బ్యాటరీ ప్యాక్ 100 కిలోవాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కిసపోర్ట్‌ చేస్తుంది.

ఇది కేవలం 35 నిమిషాల్లో ఛార్జ్ స్థాయిని 10 నుండి 80 శాతానికి పెంచుతుంది. 11 కిలోవాట్ల ఏసీ హోమ్ ఛార్జర్ పూర్తిగా ఛార్జ్ కావడానికి ఏడు గంటల 15 నిమిషాలు పడుతుంది. ఈ కారు ప్రస్తుతం ఈ ఎలక్ట్రిక్ కారుతో సేల్స్‌ పెంచుకోవాలని మెర్సిడెస్‌ భావిస్తోంది. అందులో భాగంగానే దీనిని మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది.

More from DriveSpark

Article Published On: Monday, July 8, 2024, 17:48 [IST]
English summary
Mercedes eqa electric suv launched in india at rs 66 lakhs features and range details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+