మెర్సిడెస్ బెంజ్ మేబాక్ EQS 680 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విడుదల.. ధరకు తగినట్లుగా భారీ ఫీచర్లు!
దేశీయ మార్కెట్‌లో సరికొత్త బెంజ్ కారు విడుదల అయ్యింది. ఈ కారు దేశంలో అత్యత ఖరీదైన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా మార్కెట్‌లో అడుగుపెట్టింది. దాని పేరే మెర్సిడెస్ బెంజ్ మేబాక్ ఈక్యూఎస్ 680 (Mercedes Maybach EQS 680 Electric SUV). గత ఏడాది ఏప్రిల్‌లో ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అయ్యింది. తాజాగా భారత్‌లోనూ అరంగ్రేటం చేసింది. ఈ లగ్జరీ కారు సింగిల్ ఛార్జ్‌పై 600 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది. ఇది దాని ఇతర ICE వెర్షన్‌ల మాదిరిగానే ఫీచర్లు, డిజైన్‌ని కలిగి ఉంది. లగ్జరీ ఫీచర్లు, ఇంటీరియర్‌ని కోరుకునే సంపన్నులకు ఈ కారు సరిపోతుంది.
ఈ సరికొత్త మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 680 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో మెయిన్ గ్రిల్, కనెక్టెడ్ LED హెడ్‌లైట్స్, టెయిల్ ల్యాంప్స్ ఈ మేబాక్ డిజైన్‌కి అదనపు ఎలిమెంట్స్‌గా ఉంటాయి. ఈ ఖరీదైన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో 15 స్పీకర్ల 4D సరౌండ్ సౌండ్ సిస్టమ్, యాక్టివ్ యాంబియంట్ లైటింగ్, నాప్పా లెదర్ సీట్లు, రియర్ ఇన్ఫోటైన్‌మెంట్ కంట్రోల్స్ వంటి లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి.

ఇక రియర్‌లో కూర్చునే వారికి సైతం ఎంటర్‌టైన్మెంట్ డిస్ప్లేను కలిగి ఉంది. రిఫ్రిజిరేటర్ విభాగాన్ని రెండు వెనుక సీట్ల మధ్య ఆర్మ్‌రెస్ట్ వెనుక పొందుపరిచారు. దీని 10-లీటర్ల కెపాసిటీతో టెంపరేచర్ కంట్రోల్ ఆప్షన్ కలిగి ఉంటుంది. సరౌండ్ లైటింగ్ నుంచి ట్రే టేబుల్స్ వరకు వెనుక ఫుట్ వెల్‌పై మేబాక్ లోగో ఉంటుంది.
దీనిలో పనోరమిక్ సన్‌రూఫ్, ఎయిర్ ప్యూరిఫైయర్‌తో పాటు మంచి స్మెల్‌ని అందించే డిఫ్యూజర్ సిస్టమ్, వెనుక రెండు వైపులా ఉన్న డోర్లలో ఎలక్ట్రిక్ సన్ బ్లిండ్స్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ తదితర ఫీచర్లు ఉన్నాయి. మెర్సిడెస్ మేబాక్ ఈక్యూఎస్ 680 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 1,721 mm ఎత్తు, 5,12 5mm పొడవు ఉంటుంది. అంతే కాకుండా ఇది 3,210 mm వీల్‌బేస్‌ని కలిగి ఉంది.
కొత్త మెర్సిడెస్-మేబాక్ ఈక్యూఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో సేఫ్టీ పరంగా చూస్తే 360 డిగ్రీల కెమెరా, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్స్, ఏడీఏఎస్, ఏబీఎస్, ఈబీడీ, ట్రాక్షన్ కంట్రోల్ ఉన్నాయి. ఎకో, స్పోర్ట్, ఆఫ్-రోడ్, ఇండివిడ్యువల్, మేబ్యాక్ వంటి వివిధ డ్రైవ్ మోడ్స్‌ని కూడా కలిగి ఉంది. ఇందులోని భారీ సస్పెన్షన్ సెటప్ భూతలంలో ఏరోప్లేన్ వెళ్తున్న అనుభూతిని కల్పిస్తుంది.
మెర్సిడెస్-మేబాక్ ఈక్యూఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఆల్-వీల్ డ్రైవ్ సెటప్ కోసం డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్లతో జతచేయబడిన 107.8 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌ని కలిగి ఉంది. ఈ కాంబినేషన్ 649bhp పవర్, 950nm గరిష్ట టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కేవలం 4 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.
ఈ కారు పవర్ట్రెయిన్‌ని తొలిసారి షాంఘై ఆటో షోలో ప్రదర్శించారు. ఈ లగ్జరీ ఎస్‌యూవీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 600 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది. మేబాక్ ఈక్యూఎస్ లగ్జరీ హై-ఫర్పామెన్స్ కలిగి ఉంది. ఈ కొత్త మెర్సిడెస్-మేబాచ్ ఈక్యూఎస్ 680 ధర రూ .2.25 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








