భారతదేశంలోనే అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ కారు వాకరౌండ్ వీడియో
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ (Mercedes Benz) జర్మన్ బ్రాండ్ ఇటీవల దేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ మేబాక్ మోడల్ ఈక్యూఎస్ 680 ఎస్‌యూవీని (Maybach EQS SUV) విడుదల చేయనుంది. ఈ కారు లగ్జరీ ఫీచర్లతో వస్తుంది. ఈ కారు డ్యూయల్ మోటార్ సెటప్‌తో వస్తుంది. ఇది స్టాండర్డ్ 4మాటిక్ ఆల్-వీల్ డ్రైవ్‌తో ప్రయాణిస్తుంది. ఇక సింగిల్ ఛార్జ్‌పై సుమారు 611 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది. 122 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఈ ఎస్‌యూవీకి శక్తిని అందిస్తుంది.
ఈ మెర్సిడెస్ ఈక్యూఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 0- 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 4.4 సెకన్లలో అందుకోగలదు. అదే సమయంలో దేశంలో దీని గరిష్ట వేగం గంటకు 210 కిలోమీటర్లుగా కంపెనీ నిర్దేశించింది. ఇది 200 కిలోవాట్ల డీసీ ఫాస్ట్ ఛార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది. కావున ఈ కారు ఛార్జింగ్‌పై ఎటువంటి ఆందోళనలు అవసరం లేదు. వాహనం మొత్తంగా ఎలా ఉందో చూడటానికి మా డ్రైవ్స్‌పార్క్ టీమ్ చేసిన వాక్ ఎరౌండ్ వీడియో చూశారా?
కొత్త మేబాక్ ఈక్యూఎస్ ఈవీని సెప్టెంబర్ 5, 2024 న భారతదేశంలో విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోంది. ధర కూడా మరో రెండు రోజుల్లో తెలియనుంది. MBUX హైపర్‌స్క్రీన్, వెనుక ప్రయాణీకుల కోసం డ్యూయల్ 11.6 ఇంచెస్ స్క్రీన్లు, 15 స్పీకర్ల సోర్స్ సౌండ్ సిస్టమ్, 64-కలర్ యాంబియంట్ లైటింగ్, ఎయిర్ సస్పెన్షన్స్, మల్టీ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఎడిఎఎస్, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, ప్రీమియం సీట్ అప్హోల్స్టరీ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఇది భారతదేశంలో అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా రానుంది. మేబాక్ ఈక్యూఎస్ ఎస్‌యూవీ డిజైన్ పరంగా స్టాండర్డ్ ఈక్యూఎస్ ఎస్‌యూవీని పోలి ఉంటుంది. ఇది ఐదు డ్యూయల్-టోన్ కలర్ కాంబినేషన్లతో అందుబాటులో ఉండనుంది. బానెట్ పై త్రీ పాయింట్స్ స్టార్ బ్యాడ్జ్, క్రోమ్ కోటెడ్ స్ట్రిప్స్, డి-పిల్లర్‌పై మేబాక్ లోగో, 22 అంగుళాల పొడవైన అల్లాయ్ వీల్స్ ఈ ఎస్‌యూవీ ఇతర ప్రత్యేకతలుగా ఉన్నాయి.



Click it and Unblock the Notifications








