లాంచ్‌కు సిద్దమవుతున్న 'మెర్సిడెస్ బెంజ్' కార్లు ఇవే.. వివరాలు
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ మే 22న కొత్త 'మేబ్యాక్ జీఎల్ఎస్ 600' మరియు 'ఏఎంజీ ఎస్ 63 4మ్యాటిక్ ఈ పర్ఫామెన్స్' లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ఆధునిక కాలంలో కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను లేదా ఆధునిక ఉత్పత్తులను దేశీయ విఫణిలో లాంచ్ చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే సంస్థ ఇప్పుడు మెర్సిడెస్ బెంజ్ (Mercedes Benz) యొక్క మేబ్యాక్ జీఎల్ఎస్ 600 మరియు ఏఎంజీ ఎస్ 63 4మ్యాటిక్ ఈ పర్ఫామెన్స్ లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఇవి రెండూ ఆధునిక హంగులతో మార్కెట్లో లాంచ్ అవుతాయని సమాచారం.

మెర్సిడెస్ బెంజ్ మేబ్యాక్ జీఎల్ఎస్ 600
విడుదలకు సిద్దమవుతున్న అప్డేటెడ్ మెర్సిడెస్ బెంజ్ మేబ్యాక్ జీఎల్ఎస్ 600 మంచి డిజైన్ పొందుతుంది. ఈ లగ్జరీ కారు గ్రిల్‌లో ఐకానిక్ వర్టికల్ క్రోమ్ స్లాట్ చోడవచు. అయితే ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా కొంత పెద్దదిగా ఉంటుంది. రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ బంపర్.. కొత్త డిజైన్ కలిగిన 22 ఇంచెస్ వీల్స్ ఇందులో కనిపిస్తాయి.
ఇంటీరియర్ కూడా కొంత అప్డేట్ చేయబడి ఉంటుంది. స్టీరింగ్ వీల్ కొత్త డిజైన్ పొందుతుంది. ఇందులో లెదర్ ఇంటీరియర్, డ్యూయెల్ స్క్రీన్ డిస్‌ప్లే, రియర్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌లు, 27 స్పీకర్ బర్మెస్టర్ సౌండ్ సిస్టమ్ మరియు యాంబియంట్ లైటింగ్ వంటి అనేక ఫీచర్స్ ఇందులో లభిస్తాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు తప్పకుండా అద్భుతమైన డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయని భావిస్తున్నాము.

కొత్త మెర్సిడెస్ బెంజ్ మేబ్యాక్ జీఎల్ఎస్ 600 అదే ట్విన్ టర్బోచార్జ్డ్ 4.0 లీటర్ వీ8 పెట్రోల్ ఇంజిన్ 48వీ స్టార్టర్ జనరేటర్‌తో 9 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. ఇంజిన్ 557 హార్స్ పవర్ మరియు 730 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. 48వీ ఎలక్ట్రిక్ సిస్టమ్ ద్వారా 22 హార్స్ పవర్ మరియు 250 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.
మెర్సిడెస్ బెంజ్ ఏఎంజీ ఎస్ 63 ఈ
ఇక కంపెనీ లాంచ్ చేయనున్న రెండో కారు మెర్సిడెస్ బెంజ్ ఏఎంజీ ఎస్ 63 ఈ పర్ఫామెన్స్. ఇది ట్విన్ టర్బోచార్జ్డ్ 4.0 లీటర్ వీ8 పెట్రోల్ ఇంజన్ పొందుతుంది. ఇందులో 13.1 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ కూడా ఉంటుంది. తద్వారా మొత్తం అవుట్‌పుట్ 802 హార్స్ పవర్ మరియు 1430 న్యూటన్ మీటర్ టార్క్‌గా నమోదు చేయబడుతుంది.

అంచనా ధరలు
భారతీయ మార్కెట్లో విడుదలకు సిద్దమవుతున్న కొత్త 'మేబ్యాక్ జీఎల్ఎస్ 600' ధర రూ.3 కోట్లు వరకు ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఈ మోడల్ యొక్క స్టాండర్డ్ వెర్షన్ ధర రూ.2.96 కోట్లు. అదే విధంగా 'ఏఎంజీ ఎస్ 63 4మ్యాటిక్ ఈ' అంచనా ధర రూ.3 కోట్ల నుంచి రూ.3.5 కోట్ల మధ్య ఉంటుంది. ఈ కార్లకు సంబంధించిన మరిన్ని అధికారిక వివరాలు తెలియాల్సి ఉంది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








