భారీ డిజైన్‌తో మార్కెట్‌ని శాసించేందుకు వస్తున్న ఎంజీ క్లౌడ్‌ ఎలక్ట్రిక్‌ కారు

జెఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా క్రాస్‌ఓవర్‌ యుటిలిటీ కారును భారత మార్కెట్‌లో విడుదల చేయనుంది. ఈ కారు ప్రస్తుతం టెస్ట్‌డ్రైవ్‌లో పరీక్షిస్తున్నారు. ఈ కారును భారతదేశంలో స్పాట్ టెస్టింగ్ చేయడం ఇదే మొదటిసారి కాదు అయితే మరోసారి టెస్ట్‌డ్రైవ్‌ చేస్తూ దర్శనమిచ్చింది. ఈ దృశ్యాలను మా డ్రైవ్స్‌పార్క్‌ టీమ్‌ తమ కెమెరాలో బంధించింది. ఇండియన్ రోడ్లపై ఫుల్ కవర్లతో ఉన్న ఓ పెద్ద కారు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజా సమాచారం ప్రకారం ఎంజీ త్వరలో లాంచ్ చేయబోయే కొత్త వాహనం ఇదే కానుంది. దీనిని ఇంటెలిజెంట్ సీయూవీ బ్రాండింగ్‌తో వీధుల్లో టెస్ట్‌డ్రైవ్‌ చేశారు. ఈ కారుకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో..

ఈ కారు ఇంకా కొన్ని టెస్టింగ్‌లను పూర్తి చేసుకుని త్వరలోనే అమ్మకానికి రానుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించడానికి ముందుగానే దీని విజువల్స్ వైరల్ అవుతున్నాయి. ఈ సరికొత్త కారుని టెస్ట్‌లను కంపెనీ వేగవంతం చేసింది. ఈ కారు ఎస్‌యూవీ కంటే చూడటానికి చాలా పెద్దదిగా కనిపిస్తుంది.

MG-Cloud-EV-Spy-Images

ఈ కారు టెస్ట్ మోడల్ పూర్తిగా స్టిక్కర్‌తో కప్పబడి ఉంది. దీనివల్ల దీని బయటి డిజైన్‌లపై స్పష్టమైన సమాచారం లభించలేదు. అయితే దీనికి ఒక చిన్న బానెట్ మరియు పెద్ద అద్దం ఉండటాన్ని మనం చూడవచ్చు. సిస్టమ్ MPV-కంప్లైంట్‌గా ఉంటుంది. ఈ కారు కూడా చాలా టెక్నాలజీతో వస్తుందని భావిస్తున్నారు. 8.8 అంగుళాల డిజిటల్ డ్రైవర్ స్క్రీన్ మరియు పెద్ద ఫ్రీ-స్టాండింగ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌ని ఇందులో ఆశించవచ్చు.

ఈ ఎస్‌యూవీలో పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, లెదర్ చుట్టిన సీట్లు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పవర్డ్ టెయిల్ గేట్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. ఈ కారు పేరును ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. తాజా సమాచారం ప్రకారం ఈ కారును క్లౌడ్ ఈవీగా విక్రయించనున్నారు. ఎంజీ మోటార్ ఇండియా ఈ కారును భారత మార్కెట్‌లో అతి త్వరలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది.

MG-Cloud-EV-Spied

ఈ కారు 177 PS మరియు 280 NM టార్క్ ఉత్పత్తి చేసే సింగిల్ ఎలక్ట్రిక్ మోటారుతో విక్రయించబడుతుందని భావిస్తున్నారు. బ్యాటరీ ప్యాక్ విషయానికొస్తే 50.3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది ఫుల్ ఛార్జ్ చేస్తే 450 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని భావిస్తున్నారు.

ఈ సీయూవీ సదూర ప్రయాణాల్లో సులభంగా వెల్లవచ్చు. ఇది ప్రయాణానికి మాత్రమే కాకుండా పెద్ద మొత్తంలో వస్తువులను తీసుకెళ్లడానికి కూడా అనుకూలంగా ఉండనుంది. సాధారణంగా ఎస్‌యూవీ కారు కంటే ఎక్కువ లగేజీని తీసుకెళ్లగలదు. అందువల్ల ఈ సీయూవీ కారు రాబోయే రోజుల్లో ఎస్‌యూవీలకు అతిపెద్ద పోటీదారుగా ఉంటుందని భావిస్తున్నారు.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, July 11, 2024, 17:54 [IST]
English summary
Mg cloud ev spotted in test drive expected features and range details in telugu
Read more on: #mg motors #spy pics #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+