230 కి.మీ రేంజ్ అందించే రెండు డోర్ల కారు.. పొట్టి కారులో గట్టి ఫీచర్లు.. కానీ ధరలు పెరుగుతున్నాయ్!!
ఎంజీ మోటార్ ఇండియా నుంచి విడుదలైన కామెట్ ఎలక్ట్రిక్ కారు దేశంలో పలు సంచలనాలను సృష్టించింది. కేవలం రెండు డోర్లతో పొట్టి ఎలక్ట్రిక్ కారుగా మార్కెట్‌లో అడుగుపెట్టింది. అయితే తాజాగా ఈ కారు ధరలు పెరిగాయి. ఎంజీ కామెట్ ఎలక్ట్రిక్ కారు బేస్ ఎగ్జిక్యూటివ్ మరియు ఎక్సైట్ ట్రిమ్స్ ధరల్లో ఎటువంటి మార్పులు చేయలేదు. అయితే ఎక్సైట్ FC, ఎక్స్‌క్లూజివ్ మరియు ఎక్స్‌క్లూజివ్ FC ట్రిమ్స్ ధరలను పెంచింది. వీటి ధరలు ఇప్పుడు రూ .11,000 నుంచి రూ .13,000 వరకు పెరిగాయి. పెరిగిన ధరలు మరియు ఈ కారు ఫీచర్లకు సంబంధించిన తాజా వివరాలు మీ కోసం..
ఎంజీ కామెట్ ఎలక్ట్రిక్ కారు ఎక్సైట్ ఎఫ్‌సీ వేరియంట్ ధర గతంలో రూ.8.34 లక్షలుగా ఉంది. అయితే ఇప్పుడు దీని ధర రూ. 8.45 లక్షలకు పెరిగింది. దీని ఖరీదు రూ.11 వేలకు పెరిగింది. ఇక ఎక్స్‌క్లూజివ్ వేరియంట్ ధర రూ.12,000 నుంచి రూ.9 లక్షల మధ్య ఉంది.

ఇక ఎక్స్‌క్లూజివ్ ఎఫ్‌సీ 9.24 నుంచి రూ. 9.34 లక్షలకు పెరిగింది. ఇక 100 ఇయర్ లిమిటెడ్ ఎడిషన్ ధర రూ. 9.40 లక్షలుగానే ఉంది. దీని ధర పెంచలేదు. ఈ కారు ఎంట్రీ లెవల్ వేరియంట్స్‌లో 7 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, కీలెస్ ఎంట్రీ ఉన్నాయి. బ్లూటూత్ కనెక్టివిటీ సిస్టమ్, మాన్యువల్ ఏసీ, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, 2 స్పీకర్లు, 3 USB ఛార్జింగ్ పోర్ట్స్ ఉన్నాయి.
వీటితో పాటు స్ప్లిట్ ఫోల్డింగ్ రియర్ సీట్లు, పవర్ అడ్జస్ట్మెంట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఓఆర్వీఎంలు, బ్లాక్ ఇంటీరియర్ థీమ్, ఫ్యాబ్రిక్ అప్హోల్స్టరీ, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ వింగ్ మిర్రర్లు ఇతర ఫీచర్లుగా ఉన్నాయి. వీటితో పాటు రిమోట్ సెంట్రల్ లాకింగ్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, ABS విత్ EBD, ప్రయాణికులందరికీ 3 పాయింట్ల సీట్ బెల్ట్స్ ఉన్నాయి.

రివర్స్ పార్కింగ్ సీట్లు, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్లు, వింగ్ మిర్రర్ మౌంటెడ్ ఎల్‌ఈడీ టర్న్ ఇండికేటర్స్, హాలోజెన్ హెడ్ ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇక మిడ్-స్పెక్ వేరియంట్స్‌లో కొన్ని అదనపు ఫీచర్లు ఉన్నాయి. హెడ్ ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్స్, కనెక్టివిటీ ఫ్రంట్, రియర్ ల్యాంప్స్, 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి.
దీంతో పాటు 10.25 అంగుళాల ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్, లెదర్ కవర్డ్ స్టీరింగ్ వీల్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫీచర్లు ఉన్నాయి. ఫాస్ట్ ఛార్జింగ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీతో కూడిన 3 USB ఛార్జింగ్ పోర్ట్స్ ఇందులో కూడా ఉన్నాయి. విండో కోసం ఆటో అప్ ఫంక్షన్, టిల్ట్ అడ్జస్టబుల్ (అప్-డౌన్) స్టీరింగ్ వీల్, స్మార్ట్ స్టార్ట్ సిస్టమ్ ఉన్నాయి.

బ్లూటూత్ డిజిటల్ కీ, అప్రోచ్ అన్లాక్ ఫంక్షన్, రివర్స్ పార్కింగ్ కెమెరా వంటి 6 ప్రత్యేక ఫీచర్లతో వస్తుంది. వులింగ్ ఎయిర్ ఈవీ మోడల్ ఆధారంగా రూపొందించబడింది. కారు పొట్టిగా చూడటానికి ఆకర్షణీయమైన లుక్‌లో కనిపిస్తుంది. దీని బాడీ చుట్టూ ఫుల్-లెంత్ ఎల్ఈడీ బార్‌తో బాక్స్ డిజైన్‌తో వస్తుంది. ఈ కారులో 17.3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఫుల్ ఛార్జ్‌పై 230 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది.
ఇక ఎంజీ ZS EV ధరలు కూడా పెరిగాయి. ఎగ్జిక్యూటివ్, ఎక్సైట్ ప్రో ట్రిమ్స్ ధరల్లో మార్పు లేదు. ఎక్స్‌క్లూజివ్ ప్లస్, ఎసెన్స్ ట్రిమ్స్ రూ. 25,000 పెరిగి రూ.24.23, రూ.25.23 లక్షలు, హై-ఎండ్‌లోని ఎగ్జిక్యూటివ్+డీటీ, ఎసెన్స్ టీడీ ధరలు రూ .24,000 పెరిగి రూ .24.44 లక్షలు, ఎసెన్స్ డిటి రూ .25.44 లక్షలుగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications








