లలల.. లక్కీ ఛాన్స్ లే!.. ఆ కారుపై అదిరిపోయే ఆఫర్.. ఏకంగా రూ.6 లక్షల డిస్కౌంట్!

ఎలక్ట్రిక్ కార్లతో భారత మార్కెట్‌లో 'తగ్గేదేలే' అన్నట్లు దూసుకుపోతున్న దిగ్గజ సంస్థ ఎంజీ మోటార్స్. ఈ సంస్థ నుంచి హెక్టర్ వంటి ICE వెర్షన్స్‌తో పాటు, ఈవీ రంగంలో తనదైన ముద్ర వేసింది. ఇది అమ్మకాల్లో జోరు కొనసాగిస్తూ.. ప్రత్యర్థి కంపెనీలకు గట్టి పోటీనిస్తోంది.

ఎంజీ మోటార్స్ ZS EV, Comet EV, Windsor EV, హెక్టర్, హెక్టర్ ప్లస్ వంటి మోడళ్లతో కస్టమర్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇప్పుడు ఇదే కోవలో తన ఎస్‌యూవీ Golster అమ్మకాలను మరింత పెంచుకోవడంపై ఆ సంస్థ దృష్టి సారించింది. అందులో భాగంగానే అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

MG Gloster 7 Seater

ఫోర్డ్ ఎండీవర్(Ford endeavour) లగ్జరీ కారును మరిపించేలా Gloster SUV లగ్జరీ కారును ప్రవేశపెట్టింది ఎంజీ సంస్థ. ఇది ఒక ఫుల్ సైజ్ SUV. అనేక హంగులతో దీన్ని ప్రవేశపెట్టినప్పటికీ అయితే భారతీయ మార్కెట్‌లో దీనికి ఆదరణ మాత్రం చాలా తక్కువ. దీని ఇతర ఎస్‌యూవీలతో పోల్చితే అద్భతమైన డిజైన్ ఉన్నప్పటికీ ఇది ఆకట్టుకోలేకపోయింది. Golster ఫేస్ లిఫ్ట్ మోడల్‌ను త్వరలో భారత మార్కెట్లోకి తీసుకురానుంది.

అయితే అంతకంటే ముందు ప్రస్తుతం ఉన్న ఎస్‌యూవీలను అన్నింటినీ తొందరగా విక్రయించాలని భావిస్తోంది. అందుకే ఈ గ్లోస్టర్ మోడల్‌పై ఇయర్- ఎండ్- ఆఫర్లతో ముందుకు వచ్చింది. ఎంజీ మోటార్ కు సంబంధించిన ఫ్లాగ్‌షిప్ త్రీ-రో- SUVల్లో ఒకటైన ఈ గ్లోస్టర్ పై డీలర్-లెవెల్ బెనిఫిట్స్ తో పాటు రూ. 6 లక్షల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. దీని ద్వారా ఈ ప్రి-ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ అమ్మకాలు పెరుగుతాయని ఆ సంస్థ భావిస్తోంది.

ప్రస్తుతం రూ. 38.80 లక్షల నుంచి రూ. 43.87 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఈ గ్లోస్టర్ ధర ఉంది. ప్రస్తుత ఆఫర్ తో దీని ధర మరింత తగ్గే అవకాశం ఉంది. ఇది ఈ సెగ్మెంట్‌లో టయోటా ఫార్చునర్, Skoda Kodiaq, Jeep Meridian, Isuzu MU-X, Nissan X-Trail వంటి మోడళ్లకు గట్టి పోటీని ఇస్తుంది.

గ్లోస్టర్ ఫీచర్లు ఇవే: రాబోయే ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో డిజైన్‌తో పాటు పలు ఫీచర్ అప్‌గ్రేడ్‌లను ఎంజీ మోటార్స్ సంస్థ తీసుకురానున్నట్లు తెలుస్తోంది. అయితే.. ప్రీమియం ఫీచర్లతో మంచి పర్ఫార్మెన్స్ కలిగిన SUV కోసం చూస్తున్న వినియోగదారులు ప్రస్తుతం గ్లోస్టర్‌పై ఉన్న ఆఫర్‌ను సద్వినియోగం చేసుకుని కొనుగోలు చేయవచ్చు. దీనిలో ఫ్యామిలీ ట్రిప్స్ లేదా ఆఫ్- రోడ్ ప్రయాణాలకు గ్లోస్టర్ అనుకూలంగా ఉంటుంది.

స్పేషియస్ ఇంటీరియర్, ఆకర్షణీయమైన డిజైన్‌ దీని ప్రత్యేక ఆకర్షణగా ఉంది. దీంట్లో ఏడుగురు హాయిగా ప్రయాణించవచ్చు. ఇది రెండు ఇంజిన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. 2.0 లీటర్ టర్బో డీజిల్, 2.0 లీటర్ ట్విన్- టర్బో డీజిల్‌తో పనిచేస్తుంది. రెండు ఇంజిన్లు కూడా... 8- స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్‌తో అనుసంధానించి ఉంటాయి. వీటితో పాటు కొత్త డ్యాష్ బోర్డ్ డిజైన్‌తో పాటు కొత్త ఫీచర్లను జోడించనున్నారు.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, December 24, 2024, 16:53 [IST]
English summary
Mg gloster 7 seater gets up to rs 6 lakh discount check offer price here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+