టయోటా ఫార్చ్యూనర్ ఆధిపత్యానికి చెక్ పెట్టనున్న ఎంజీ గ్లోస్టర్ ఫేస్‌లిఫ్ట్.. టెస్ట్‌డ్రైవ్ వీడియో మీకోసం
ఎంజీ మోటార్ త్వరలో గ్లోస్టర్ ఫేస్‌లిఫ్ట్‌ని అతి త్వరలో ఇండియాలో ప్రవేశ పెట్టనుంది. ఈ కొత్త కొత్త గ్లోస్టర్ ఫేస్‌లిఫ్ట్‌కి సంబంధించి గత కొన్ని నెలలుగా భారతదేశంలో స్పాట్ టెస్టింగ్ జరుగుతోంది. తాజాగా ఈ గ్లోస్టర్ అప్‌డేటెడ్ కారుని ఢిల్లీ హైవేపై పరీక్షిస్తుండగా మా డ్రైవ్స్‌పార్క్ టీమ్ కెమెరాలో బంధించింది. ఈ కారు డైజైన్ ఆకర్షణగా ఉంది. తాజాగా మా కెమెరాకు చిక్కిన ఈ సరికొత్త గ్లోస్టర్ ఫేస్‌లిఫ్ట్‌కి సంబంధించి కీలకమైన వివరాలు మీకోసం..
ఎంజీ గ్లోస్టర్ ఎంజీ మోటార్ నుంచి అత్యంత ఖరీదైన కారుగా ఉంది. ఈ కంపెనీ కారు ఎంజీ హెక్టార్ 2019లో భారతీయ మార్కెట్లోకి ప్రవేశించింది. ఆ తర్వాత వచ్చిన ఈ గ్లోస్టర్ చాలా గ్రాండ్‌గా, విలాసవంతంగా రూపొందించబడింది. వాస్తవానికి ఖరీదైన ఫీచర్లు ఎక్కువ ధరలో వచ్చే కొత్త కార్లు ఇండియాలో ఎక్కువగా అమ్ముడుపోవు. ఫలితంగా ఎంజీ గ్లోస్టర్ అమ్మకాలు కూడా పెద్దగా నమోదు కాలేదు.

ఎంజీ మోటార్ ఇప్పుడు గ్లోస్టర్‌ని అప్‌గ్రేడ్ చేసి తీసుకువచ్చింది. ఈ ప్రయత్నంలో భాగంగా అప్‌గ్రేడ్ చేసిన 2025 గ్లోస్టర్ గత కొన్ని నెలలుగా వరుస టెస్ట్ రన్‌లను నిర్వహిస్తున్నారు. 2025 ఎంజీ గ్లోస్టర్ కారును ఢిల్లీ-జైపూర్ హైవేపై మరోసారి పరీక్షించారు. దీనిని పరీక్షిస్తున్న సమయంలో మా టీమ్ ఈ విజువల్స్‌ని కెమెరాలో బంధించారు.
ఆ వీడియో ప్రకారం 2025 గ్లోస్టర్ ఇటీవలె ఆస్ట్రేలియాలో లాంచ్ చేసిన మాక్సస్ డి 90 (Maxus D90) మాదిరిగానే ఉంది. మాక్సస్ డీ90 ఎంజీ గ్లోస్టర్ ఆధారంగా పనిచేస్తుంది. 2025 గ్లోస్టర్ ఎంజీ హెక్టార్ మాదిరిగా స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ ఉంటుందని భావిస్తున్నారు. హెడ్‌ల్యాంప్ సిస్టమ్ వర్టికల్ డిజైన్‌లో LED DRLలు మరియు కారు ముందు భాగంలో పెద్ద గ్రిల్‌ని కలిగి ఉంది.

ఎంజీ 2025 గ్లోస్టర్ ముందు భాగంలో మాత్రమే పూర్తి మార్పులతో తీసుకురావాలని సంస్థ భావిస్తున్నట్లు టెస్ట్‌రన్ వీడియో ద్వారా అర్థం అవుతుంది. కారు సైడ్, రియర్ లుక్‌లో ఎటువంటి మార్పులు పెద్దగా కనిపించలేదు. కొత్త గ్లోస్టర్ వెనుక భాగంలో ఉన్న టెయిల్ ల్యాంప్స్ డిజైన్‌ని కొంచెం కొత్తగా ఇవ్వవచ్చు. అదేవిధంగా కారు అల్లాయ్ వీల్స్ డిజైన్ కూడా పూర్తి మార్పులతో వచ్చే అవకాశం ఉంది.
2025 గ్లోస్టర్ కారు వినూత్నంగా ఉండనుంది. ఎక్ట్సీరియర్ మాదిరిగానే, 2025 గ్లోస్టర్ యొక్క ఇంటీరియర్ ఆస్ట్రేలియాలో లాంచ్ చేసిన మాక్సస్ డి 90 ఫేస్‌లిఫ్ట్ మాదిరిగానే ఉంటుంది. దీని ప్రకారం సంప్రదాయ గేర్ లివర్‌కి బదులుగా, రొటేటబుల్ గేర్ సెలెక్టర్‌ని 2025 గ్లోస్టర్‌లో తీసుకువచ్చే అవకాశం ఉంది. ఇందులో అడ్వాన్స్‌డ్ డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ ప్యానెల్, రీడిజైన్ చేసిన డ్యాష్ బోర్డ్, పెద్ద ఏసీ వంటి ఇతర సాంకేతిక ఫీచర్లు ఉన్నాయి.
ఈ కారు 2.0-లీటర్ టర్బో-డీజిల్ ఇంజిన్‌తో కొనస అవకాశం ఉంటుంది. ఈ కారు టయోటా ఫార్చ్యూనర్ వంటి పాపులర్ ఎస్‌యూవీలకు గట్టి పోటీని ఇవ్వనుంది. ఎంజీ గ్లోస్టర్ భారతదేశంలో ఇప్పటి వరకు పెద్దగా రాణించలేదు. రెండో ఇన్నింగ్స్‌లో గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్ ప్రజల దృష్టిని ఆకర్షిస్తుందో లేదో వేచి చూడాలి. 2025 ఎంజీ గ్లోస్టర్ ఫేస్‌లిఫ్ట్ భారత లాంచ్ తేదీ ఇంకా ధృవీకరించబడలేదు.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








