ఫార్చ్యూనర్ కార్లకు చెక్.. గట్టి పోటీ ఇవ్వనున్న ఎంజీ మోటార్స్ కొత్త ఎడిషన్ కార్లు
లగ్జరీ కారు టెక్నాలజీతో నిండిన పెద్ద ఎస్‌యూవీని కొనుగోలు చేయాలనుకునేవారికి ఎంజీ గ్లోస్టర్ మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. అయితే మార్కెట్‌లో ఎంజీ గ్లోస్టర్ అమ్మకాల్లో పెద్దగా బజ్ క్రియేట్ చేయలేకపోయింది. ప్రస్తుతం ఈ విభాగంలో ఫార్చ్యూనర్ కారుని ఢీకొట్టే కార్లు లేవు. ఫార్చ్యూనర్‌కి పోటీగా విడుదల చేసిన ఎంజీ గ్లోస్టర్ ఇప్పుడు అత్యంత ఆకర్షణీయంగా వచ్చింది. తాజా మార్పులతో వచ్చిన ఆ కారు మార్కెట్లో సంచలనం సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫార్చ్యూనర్ ఇతర హై ఎండ్ కార్లను కొనుగోలు చేయాలనుకునే వారు ఈ కారుని నిస్సందేహంగా కొనుగోలు చేయవచ్చు. మరింత మంది కస్టమర్లకు చేరువ అవ్వడానికి రెండు స్పెషల్ ఎడిషన్ మోడళ్లను విడుదల చేసింది.
ప్రముఖ టయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీకి గట్టి పోటీదారుగా ఉన్న ఎంజీ గ్లోస్టర్ ఎస్‌యూవీలో కొన్ని నెలలుగా కొత్త అప్‌డేట్స్ లేవు. ఇదే సెగ్మెంట్‌లో ఉన్న ఫోర్డ్ ఎండీవర్ కూడా భారత్‌ని విడిచిపెట్టింది. దీంతో ఈ విభాగంలో ఫార్చ్యూనర్ కింగ్ మేకర్‌గా కొనసాగుతుంది. తాజాగా ఈ సంస్థ ఎంజీ మోటార్స్ డెసర్ట్ స్టార్మ్ మరియు స్నో స్టార్మ్ స్పెషల్ ఎడిషన్ మోడళ్లను ప్రవేశపెట్టింది.

ఈ స్పెషల్ ఎడిషన్లు కొత్త కలర్ ఆప్షన్లు, ఎక్స్‌టీరీయర్‌లో కొన్ని మార్పులతో పాటు గ్లోస్టర్ మోడల్ అప్డేటెడ్ క్యాబిన్ థీమ్‌తో రానుంది. ఎంజీ గ్లోస్టర్ ఎస్‌యూవీ స్టాండర్డ్ వేరియంట్లు ప్రారంభ ధర రూ .38.80 లక్షలు, తాజా స్పెషల్ ఎడిషన్ల ధర రూ .41 లక్షలు, ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి. రెండు కొత్త వేరియంట్లు లాంచ్ అయిన గ్లోస్టర్ బ్లాక్ స్టార్మ్ మాదిరిగానే నిర్మించబడ్డాయి.
ఈ కార్లు ఎక్స్‌టీరీయర్‌తో పాటు ఇంటీరియర్‌లో స్వల్ప అప్‌డేట్స్ మాత్రమే లభిస్తాయి. ఎంజీ గ్లోస్టర్ డెసర్ట్ స్టార్మ్ ఎడిషన్ బయటి డిజైన్ మరింత ఆకర్షణీయంగా చూపెట్టడానికి డార్క్ థీమ్‌లతో కూడిన ORVMలను అందించారు. కారు లోపల డార్క్ థీమ్‌తో తీసుకువచ్చింది. బ్లాక్ థీమ్‌తో కూడిన స్టీరింగ్ వీల్ ఇంటీరియర్‌ని మరింత ఆకర్షణీయంగా అప్డేట్ చేసింది.

ఫ్రంట్ గ్రిల్, అల్లాయ్ వీల్స్ మరియు రియర్ స్పాయిలర్ నలుపు బ్లాక్ రంగులో అందిచింది. ఎంజీ గ్లోస్టర్ యొక్క స్పెషల్ ఎడిషన్ మోడల్‌లో సీట్ మసాజర్, థీమ్ కార్పెట్ మ్యాట్స్, డ్యాష్‌బోర్డ్ మ్యాట్, జేబీఎల్ స్పీకర్లు మరియు డెజర్ట్ స్టార్మ్ మరియు స్నోస్టార్ట్ బ్యాడ్జీలతో సహా డీలర్-సర్దుబాటు చేసిన యాక్సెసరీలు కూడా లభిస్తాయి.
ఎంజి గ్లోస్టర్ 2.0-లీటర్ టర్బో డీజిల్ మరియు 2.0-లీటర్ ట్విన్-టర్బో డీజిల్ ఇంజిన్‌లతో పనిచేస్తుంది. ఈ ఎస్‌యూవీ టర్బో డీజిల్ వెర్షన్ 161 బిహెచ్ పి పవర్ మరియు 375 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. గ్లోస్టర్ యొక్క ట్విన్-టర్బో వెర్షన్ 215 బిహెచ్ పి పవర్ మరియు 480 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








