మోరిస్‌ గ్యారేజ్‌ నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్‌ కారు లాంచ్‌.. ఇందులో ఓ స్పెషల్‌ ఫీచర్‌ ఉంది.. అదేంటో తెలుసా.??

ఎంజీ మోటార్‌ ఇండియా మార్కెట్లోకి మరో కొత్త కారును తీసుకువచ్చింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న MG ZS EV మోడల్‌లో Excite Pro అనే కొత్త మిడ్‌- స్పెక్‌ వేరియంట్‌ను పరిచయం చేసింది. రూ. 20 లక్షల లోపు ధరలో డ్యూయల్- పేన్‌ పనోరమిక్‌ సన్‌రూఫ్‌తో ఆల్‌-ఎలక్ట్రిక్‌ కారుగా అందుబాటులోకి వచ్చిన మొదటి కారు ఇదే అని సంస్థ వెల్లడించింది.

2019లో హెక్టర్ SUVతో ఎంజీ మోటార్‌ ఇండియా భారత్‌లోకి ప్రవేశించిన తర్వాత, తన మొదటి ఎలక్ట్రిక్ కారు ZS మోడల్‌ను 2020 ప్రారంభంలో విడుదల చేసింది. ఆ సమయంలో భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న అతి కొద్ది ఎలక్ట్రిక్ కార్లలో ZS EV ఒకటి.

MG-ZS-EV-Excite-Pro-Variant

కాగా MG గత నాలుగేళ్లలో ZS ఎలక్ట్రిక్ కారును కొన్ని సార్లు కీలక అప్‌డేట్లతో ప్రవేశపెట్టింది. ఈ పరిస్థితిలో తాజాగా MG ZS ఎలక్ట్రిక్ కారులో కొత్త వెర్షన్‌గా Excite ప్రో వేరియంట్‌ను పరిచయం చేసింది. ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకోండి..

ZS EV ఎక్సైట్ ప్రో కొత్త మిడ్-స్పెక్ వేరియంట్‌ ధర రూ. 19.98 లక్షలు(ఎక్స్‌-షోరూమ్‌) గా MG మోటార్ ఇండియా ప్రకటించింది. కాగా ఎంట్రీ లెవల్ ఎగ్జిక్యూటివ్ ట్రిమ్ కంటే రూ. 1 లక్ష ఎక్కువగా ఉంది. కానీ కొత్త ఎక్స్‌క్లూజివ్ ప్లస్ ట్రిమ్ కంటే రూ. 4 లక్షలు తక్కువగా ఉన్నట్లు సంస్థ తెలిపింది.

అయితే ZS EV Excite Pro లోని ఫీచర్ల గురించి సంస్థ వెల్లడించనప్పటికీ.. ఇందులో డ్యూయల్ పేన్ పనోరమిక్ సన్‌రూఫ్ ఆఫర్‌ ప్రత్యేకమైన ఫీచర్‌గా ఉంటుంది. కానీ యువ కస్టమర్ల అభిరుచికి తగ్గినట్లుగా ఇందులో అత్యాధునిక ఫీచర్లు, మరిన్ని భద్రతా ఫీచర్లను ఆశించవచ్చని తెలుస్తోంది.

కాగా కొత్త Excite ప్రో వేరియంట్ లాంచ్‌.. ZS EV Xcite వేరియంట్‌ విక్రయాలను సంస్థ నిలిపివేసింది. ఎక్సైట్‌ వేరియంట్‌లో అందించబడిన అన్ని ఫీచర్లను కొత్త ఎక్సైట్‌ ప్రో వేరియంట్‌లో చూడవచ్చు. అయితే కొత్త ZS EV ఎక్సైట్‌ ప్రో వేరియంట్ లాంచ్‌తో పాటు, MG మోటార్ ZS ఎలక్ట్రిక్ కారు యొక్క ఇతర వేరియంట్‌లను కూడా మోడిఫై చేసింది.

దీని ప్రకారం, ఎక్స్‌క్లూజివ్ వేరియంట్‌ను ఎక్స్‌క్లూజివ్ ప్లస్‌గా తీసుకువచ్చింది. ఇక ఖరీదైన ఎక్స్‌క్లూజివ్ ప్రో వేరియంట్‌ను ఎసెన్స్‌గా పేరు మార్చింది. కాగా ZS ఎలక్ట్రిక్ కారు టాప్ స్పెక్‌.. ఎసెన్స్ వేరియంట్‌లో 360-డిగ్రీ కెమెరా, 10.1-అంగుళాల టచ్ స్క్రీన్, వైర్‌లెస్ ఛార్జర్, 7-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీ ఉన్నాయి.

సేఫ్టీ ఫీచర్ల పరంగా ఇందులో ప్రయాణికుల భద్రత కోసం ADAS, 6-ఎయిర్‌బ్యాగ్‌లు, EBD, ABS ఉన్నాయి. ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌ మరియు హిల్ డిసెంట్ కంట్రోల్ ఫీచర్లను కూడా అందిస్తోంది. కాగా MG ZS EV లోని అన్ని ట్రిమ్‌లు ఒకే 50.3kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తాయి. ఫ్రంట్ యాక్సిల్-మౌంటెడ్ 177hp ఎలక్ట్రిక్ మోటారును అమర్చారు.

రేంజ్‌ పరంగా 461 km కి.మీ ఇస్తుందని సంస్థ వెల్లడించింది. ఇక మార్కెట్లో MG ZS EV కి.. టాటా నెక్సాన్ EV మరియు ఇటీవల అప్‌డేట్‌తో విడుదలైన మహీంద్రా XUV400 నుంచి తీవ్రమైన పోటీ ఉంది. ఈ క్రమంలో MG మోటార్ ఇండియా కస్టమర్లను పెంచుకునేందుకు తన ఈవీలను అప్‌డేట్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

More from DriveSpark

Article Published On: Wednesday, March 6, 2024, 12:00 [IST]
English summary
Mg motor india launches mg zs ev excite pro variant price features battery range details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+