MG గ్లోస్టర్‌ మెయింటెనెన్స్‌ అండ్‌ రిపేర్‌ ఖర్చులన్నీ ఉచితంగా.. సంస్థ బంపర్‌ ఆఫర్‌.!!

ఎంజీ గ్లోస్టర్‌ కారు ఓనర్లకు MG మోటార్ ఇండియా గుడ్‌ న్యూస్‌ తీసుకువచ్చింది. కస్టమర్ల కోసం ప్రత్యేకమైన యాజమాన్య అనుభవ కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ స్కీమ్‌ ద్వారా కస్టమర్లు మొదటి మూడు సంవత్సరాల్లో జీరో మెయింటెనెన్స్‌ మరియు రిపేర్‌ ఖర్చులను అందిస్తుంది. ఈ సరికొత్త కార్యక్రమం ద్వారా కస్టమర్లకు మరింత చేరువ అయ్యేందుకు ఎంజీ ఇండియా ప్రయత్నిస్తోంది.

భారత్‌లో మార్కెట్‌ను పెంచుకునేందుకు ఆటో మొబైల్‌ కంపెనీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ముఖ్యంగా విదేశీ బ్రాండ్లు.. వివిధ రకాల ఆఫర్లు, స్పెషల్‌ డిస్కౌంట్లతో కస్టమర్లను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ విదేశీ బ్రాండ్‌ ఎంజీ మోటార్స్‌.. భారత్‌లో కస్టమర్ల కోసం ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకువచ్చింది.

MG-Gloster-Zero-Maintenance-Repiar-Cost

ఎంజీ మోటార్ ఇండియా యాజమాన్య అనుభవ(Ownership Experience Program for Gloster) కార్యక్రమం కింద.. ప్రారంభ మూడు సంవత్సరాల యాజమాన్యం లేదా 45,000 కి.మీ పరిమితి వరకు జీరో సర్వీస్ మరియు రిపేర్ ఖర్చులను అందిస్తోంది. ఈ అవకాశాన్ని MG గ్లోస్టర్ యజమానులు సద్వినియోగం చేసుకోవచ్చు.

MG Gloster ఓనర్‌షిప్‌ ఎక్స్‌పీరియన్స్‌ ప్రోగ్రామ్ కింద.. ఈ కవరేజ్‌లో వైపర్ బ్లేడ్‌లు, ఇంజిన్ ఆయిల్, ఆయిల్ ఫిల్టర్లు, ఎలక్ట్రికల్ వైరింగ్, హోస్‌లు, మోటార్లు మరియు బ్రేక్ ప్యాడ్‌లు వంటి వేర్-అండ్-టియర్ పార్ట్స్‌ను ఫ్రీగా సర్వీస్‌ చేసుకోవచ్చు. వీటిపై గ్లోస్టర్‌ యజమానులకు ఎటువంటి నిర్వహణ ఖర్చులు ఉండవని సంస్థ తెలిపింది. కాగా టైర్ వేర్ మరియు బ్యాటరీ సంబంధిత ఖర్చులను ఈ కార్యక్రమం సంస్థ భరించదు.

MG-Gloster-Zero-Maintenance-Repiar-Cost

అంతేకాకుండా కంపెనీ యాజమాన్యం యొక్క మూడు సంవత్సరాల తర్వాత గ్లోస్టర్ కస్టమర్‌లకు హామీ ఇవ్వబడిన బైబ్యాక్(BuyBack) ఆప్షన్‌ను కూడా అందిస్తుందని తెలిపింది. ఇంకా కస్టమర్‌లు ఆప్షనల్‌ ప్లాన్‌లతో కవరేజీని 5 సంవత్సరాలు లేదా 75,000 కిమీ వరకు పొడిగించే సౌలభ్యాన్ని కూడా పొందవచ్చు.

కాగా ఎంజీ గ్లోస్టర్‌.. భారత మార్కెట్లో మూడు విభిన్న ట్రిమ్‌లలో అందుబాటులో ఉంటుంది. సూపర్‌(Super), షార్ప్‌(Sharo), సావీ(Savvy) అనే మూడు వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు. ఈ కారు 6 మరియు 7 సీట్ల ఆప్షన్లలో సంస్థ విక్రయిస్తోంది. ఫీచర్ల విషయానికొస్తే ఎంజీ గ్లోస్టర్‌లో అధునాతన ఫీచర్లు ఉన్నాయి.

12.3 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌, 12 స్పీకర్‌ ఆడియో సిస్టమ్‌, 75 కంటే ఎక్కువగా కనెక్ట్‌ చేయబడిన కార్‌ ఫీచర్లు, యాపిల్‌ కార్‌ప్లేతో పాటు ఆండ్రాయిట్ ఆటో సిస్టమ్‌కు మద్దతునిస్తుంది. MapmyIndia సోర్స్‌డ్‌ నావిగేషన్‌ సిస్టమ్‌, 7 మోడ్‌ ఆల్‌ టెర్రైన్‌ సిస్టమ్‌ ఫీచర్లు ఉన్నాయి.

ఇంకా డ్యూయల్‌ పనోరమిక్‌ సన్‌రూఫ్‌, 12 వే అడ్జస్టబుల్‌ ఎలక్ట్రికల్‌ సీట్లు, డ్రైవర్‌ మసాజ్‌తో పాటు వెంటిలేషన్‌ ఫంక్షన్‌, వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ ఇంకా మరెన్నో అధునాతన ఫీచర్లను ఎంజీ గ్లోస్టర్‌లో చూడవచ్చు. సేఫ్టీ పరంగా కూడా ఎంజీ గ్లోస్టర్‌ ప్రయాణికులకు గట్టి భద్రతనిస్తుంది.

గ్లోస్టర్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ESP, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్ మరియు ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్-డిపార్చర్ వార్నింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, హ్యాండ్స్-ఫ్రీ పార్కింగ్, డోర్ ఓపెన్ వార్నింగ్, రియర్ వంటి ADAS వంటి ఫీచర్లను చూడవచ్చు. ఇంకా క్రాస్ ట్రాఫిక్ అలర్ట్ మరియు లేన్ చేంజ్ అసిస్ట్ వంటి వాటివి గ్లోస్టర్‌లో ఉన్నాయి.

ఇక ఇంజిన్‌ పనితీరు విషయానికొస్తే ఎంజీ గ్లోస్టర్‌.. 2.0 లీటర్‌ టర్బో ఛార్జ్‌డ్‌ డీజిల్‌ ఇంజిన్‌తో పనిచేస్తుంది. రెండు ఇంజిన్లు వరుసగా 160 bhp వద్ద 375 nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 215 bhp వద్ద 480 nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండూ 8 స్పీడ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, April 17, 2024, 16:40 [IST]
English summary
Mg motor india launches ownership experience program for gloster suv with zero maintenance
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+