MG మోటార్స్‌కు కలిసొచ్చిన 2023 సంవత్సరం.. ఏకంగా 56,902 యూనిట్ల విక్రయం!
ప్రముఖ కార్ల తయారీ సంస్థ MG మోటార్ 2023 (MG motors india) సంవత్సరంలో గణనీయ వృద్ధి చోటుచేసుకుంది. 2019 సంవత్సరంలో ఎంజీ మోటార్స్ సంస్థ భారత్ మార్కెట్‌లోకి ప్రవేశించింది. ప్రస్తుతం ఈ సంస్థ ఎంజీ హెక్టర్, ఎంజీ హెక్టర్ ప్లస్, ఎంజీ గ్లోస్టర్, ఎంజీ ఆస్టర్, MG ZS EV మరియు ఎంజీ కామెట్ ఈవీలను తయారీచేసి భారత్ మార్కెట్‌లో విక్రయిస్తోంది.
ఆ జాబితాలో MG ZS, MG కామెట్ ఎలక్ట్రిక్ కార్లుగా ఉన్నాయి. అయితే తాజాగా ఎంజీ మోటార్స్ సంస్థ 2023 సంవత్సరానికి సంబంధించిన నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం ఎంజీ మోటార్స్ సంస్థ 2023 సంవత్సరంలో భారత్ మార్కెట్‌లో 56,902 కార్లను విక్రయించింది. గత సంవత్సరంతో పోలిస్తే 18 శాతం వృద్ధిని నమోదుచేసినట్లు ఎంజీ మోటార్స్ పేర్కొంది.

2023 డిసెంబర్ నెలలో 4400 కార్లను విక్రయించినట్లు సంస్థ తెలిపింది. డిసెంబర్ 2022తో పోలిస్తే 13 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు తెలిపింది. రానున్న సంవత్సరంలో మరింత వృద్ధిని సాధిస్తామని సంస్థ అంచనా వేస్తోంది. గత సంవత్సరం అమ్మకాల్లో 25 శాతం ఎలక్ట్రిక్ కార్ల నుంచి వచ్చాయని తెలిపింది.
ఎంజీ మోటార్స్ సంస్థ ప్రస్తుతం భారత్‌లో ZS EV మరియు కామెట్ ఈవీలను విక్రయిస్తోంది. ఈ రెండు ఈవీల విక్రయాలు 20 వేల యూనిట్లుగా ఉన్నట్లు సంస్థ పేర్కొంది. ఎంజీ కామెట్ వాహనం 2023లో విక్రయాలను ప్రారంభించింది. ఈ ఈవీ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. పేస్, ప్లే, ప్లష్ వేరియంట్లలో అందుబాటులో ఉంది.

ఎంజీ కామెట్ ఎలక్ట్రిక్ కారు ఎంట్రీ లెవల్ పేస్ వేరియంట్ 7- అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు కీలెస్ ఎంట్రీ ఎంట్రీ ఫీచర్‌ను కలిగి ఉంది. దీంతోపాటు బ్లూటూత్ కనెక్టివిటీ సిస్టమ్, మాన్యువల్ AC, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, 2 స్పీకర్లు, 3 USB ఛార్జింగ్ పోర్టులు, స్ల్పిట్ ఫోల్డింగ్ రియర్ సీట్లు, పవర్ అడ్జస్టమెంట్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.
ఈ కామెట్ ఈవీ ORVM, బ్లాక్ ఇంటీరియర్ థీమ్, ఫాబ్రిక్ అప్హోల్స్టిరీ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ వింగ్ మిర్రల్‌లను కలిగి ఉంది. రిమోట్ సెంట్రల్ లాకింగ్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, EBDతో కూడిన ABS, 3 పాయింట్ సీట్‌బెల్ట్‌లు, రివర్స్ పార్కింగ్ సీట్లు, హోలోజన్ హెడ్‌ల్యాంప్‌లు, మిర్రర్ మౌంటెడ్ LED టర్న్ ఇండికేటర్లు, టెయిల్ ల్యాంప్‌లు ఉన్నాయి.

ఎంజీ కామెట్ ఈవీ ధరలు రూ.7.98 లక్షల నుంచి 9.98 లక్షల వరకు ఉన్నాయి. ఈ కారు 17.3kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. బ్యాటరీ పూర్తి ఛార్జింగ్‌కు 7 గంటల సమయం పట్టగా.. సింగిల్ ఛార్జింగ్‌తో 230km రేంజ్‌ను ఇస్తుంది. గరిష్ఠంగా గంటకు 100 కి.మీ వేగంతో ప్రయాణం చేయగలదు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








