ఎంజీ విండ్సర్‌ ఈవీ వర్సెస్‌ టాటా నెక్సాన్‌ ఈవీలో తోపు ఏదీ? ఏదీ కొంటే కలిసి వస్తుంది?

దేశంలో ఎలక్ట్రిక్‌ కార్ల వినియోగం పెరుగుతున్నా కొద్ది ప్రముఖ కంపెనీలు కొత్త ఉత్పత్తులను ప్రవేశపెడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్స్‌ భారత్‌లో ఎలక్ట్రిక్ కార్ల లైనప్‌ని విస్తరిస్తోంది. అందులో భాగంగా తాజాగా ఆ కంపెనీ ఎంజీ విండ్సర్ ఈవీ (MG Windsor EV)ని విడుదల చేసింది. కొన్ని నెలలుగా ఈ కారు విడుదలకు సంబంధించిన టీజర్లు, ఇతర ఫీచర్లను ఒక్కొక్కటిగా వెల్లడించింది. తాజాగా ఈ ఎలక్ట్రిక్ సీయూవీ (క్రాస్‌ ఓవర్‌ యుటిలిటీ వెహికిల్‌)ని అధికారికంగా విడుదల చేసింది. రూ. 10 లక్షల లోపు ది బెస్ట్‌ ఎలక్ట్రిక్ కారుగా ఇది నిలువనుంది.

ఎంజీ మోటార్స్‌ నుంచి ఎంజీ జెడ్‌ఎస్‌, ఎంజీ కామెట్‌ ఈవీల తర్వాత విడుదలైన మూడవ ఎలక్ట్రిక్ కారు మోడల్ ఇదే. వులింగ్ క్లౌడ్ ఈవీ రీబ్యాడ్జ్డ్ మోడల్‌ని భారత్‌లో ఎంజీ మోటార్స్‌ ప్రవేశపెట్టింది. దేశీయ ఉత్పత్తుల్లో టాటా మోటార్స్ దేశంలోనే ఎలక్ట్రిక్ విభాగంలో సింహభాగాన్ని కలిగి ఉంది. ఇక SAIC యాజమాన్యంలోని బ్రిటిష్ కార్ బ్రాండ్ ఎంజీ మోటార్స్ కూడా తమ ఎలక్ట్రిక్ కార్లతో మార్కెట్‌లో గ్రిప్‌ పెంచుకుంటుంది.

MG Windsor EV

టాటా మోటార్స్ ప్రస్తుతం భారత ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహన మార్కెట్‌లో 85 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. టాటా నెక్సాన్ ఈవీ ఈ విభాగంలో బ్రాండ్ నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్‌ కారుగా ఉంది. ఆ తర్వాత పంచ్ ఈవీ మార్కెట్‌లో ఎక్కువగా అమ్ముడవుతుంది. ఈ స్టోరీలో టాటా నెక్సాన్ ఈవీ, ఎంజీ విండ్సర్ ఈవీ మోడళ్ల మధ్య కీలక తేడాలపై ఓ లుక్కేయండి.

ధరలు: కొత్తగా విడుదలైన ఎంజీ విండ్సర్ ఈవీ మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఈ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ.9.99 లక్షలుగా విడుదల చేసింది. అయితే దీని బ్యాటరీ కోసం కిలోమీటర్‌కి రూ. 3.50 చెల్లించాల్సి ఉంటుంది. టాటా నెక్సాన్ ఈవీ మోడల్ ధర రూ.12.49 లక్షల నుంచి రూ.16.29 లక్షల మధ్య ఉన్నాయి.

MG Comet EV Vs Tata Nexon EV

పవర్‌ట్రెయిన్: ఎంజీ విండ్సర్ ఈవీలో 38 కిలోవాట్ల సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ ఉంది. ఇందులోని సింగిల్ ఎలక్ట్రిక్‌ మోటార్‌ 134 bhp గరిష్ట శక్తిని, 200 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఫుల్ ఛార్జ్‌పై 331 కిలోమీటర్ల పరిధిని (రేంజ్‌)ని అందిస్తుంది.

టాటా నెక్సాన్ ఈవీ రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో లభిస్తుంది. 30 కిలోవాట్ల బ్యాటరీతో ఎలక్ట్రిక్ మోటార్ పనిచేస్తుంది. ఇది 129 ps గరిష్ట శక్తిని, 215 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. 40.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌ 144 ps శక్తిని 215 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఫుల్‌ ఛార్జ్‌పై 325 కి.మీ నుంచి 465 కి.మీ రేంజ్‌ని అందిస్తుంది.

MG Comet EV Vs Tata Nexon EV

ఫీచర్లు: ఎంజీ విండ్సర్ ఈవీలో 15.6 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, యాంబియంట్ లైటింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ పోర్ట్, కీలెస్ ఎంట్రీ, పుష్ బటన్ స్టార్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

టాటా నెక్సాన్ ఈవీలో 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25 అంగుళాల ఫుల్ డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే 9-స్పీకర్ జేబీఎల్ సౌండ్ సిస్టమ్, ఆటో ఏసీ, క్రూయిజ్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, సన్‌రూఫ్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.

Article Published On: Friday, September 13, 2024, 18:16 [IST]
English summary
Mg windsor ev vs tata nexon ev comparison details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+