MG Cyberster ఎంజీ నుంచి మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు.. లుక్, ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్.!!
ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్స్ ఇండియా.. భారత మార్కెట్లో తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారును పరిచయం చేసింది. గత 30 ఏళ్లలో MG మోటార్స్ నుంచి తొలిసారిగా వస్తున్న స్పోర్ట్స్ కారును సైబర్‌స్టర్(MG Cyberster) పేరుతో ప్రదర్శించింది. అంతేకాకుండా గ్లోబల్ మార్కెట్లో ఏకైక సాఫ్ట్ టాప్ స్పోర్ట్స్ కారు కూడా ఇదే. ఈ కారు ప్రత్యేకతలు పూర్తిగా ఈ కథనంలో..
గ్లోబల్ మార్కెట్లో రోడ్‌స్టర్‌లకు ప్రసిద్ధి చెందిన MG Motors.. తాజాగా భారత మార్కెట్ కోసం స్పోర్ట్స్ వెర్షన్‌లో MG Cyberster ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారును ప్రదర్శించింది. పాతకాలపు ఎంజీ రోడ్‌స్టర్‌లకు ఫుల్‌స్టాప్ పెడుతూ అత్యంత చురుకైన, వినోదభరితమైన డ్రైవింగ్ అనుభూతిని అందించేలా Cyberster స్పోర్ట్స్ కారును తీసుకువచ్చింది.

MG Cyberster స్పోర్ట్స్ ఎలక్ట్రిక్ కారులో ఆధునిక టెక్నాలజీని అందించడంతో పాటు, ఎలక్ట్రిక్ పవర్ డ్రైవ్‌ట్రెయిన్‌తో వస్తుంది. డిజైన్ పరంగా ఎంజీ తన వారసత్వాన్ని కొనసాగిస్తుంది. లాంగ్ హుడ్, బ్యూటిఫుల్ స్టైలింగ్‌తో పాటు 2 సీట్ రియర్ వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్‌తో వస్తుంది.
ఎక్స్‌టీరియర్ పరంగా MG Cyberster ను చాలా ఆకర్షణీయంగా రూపొందించారు. మునుపటి ఎంజీ రోడ్‌స్టర్‌ల మాదిరిగా కాకుండా అత్యుత్తమ బ్రిటిష్ స్పోర్ట్స్ కారు డిజైన్‌తో వస్తుంది. ఫ్రెష్‌గా, స్టైలిష్‌గా, అందంగా కనిపిస్తుంది. కాగా ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్న ఎలక్ట్రిక్ కార్లన్నీ డిజైన్ పరంగా కొత్త కొత్త మార్పులతో వస్తున్నప్పటికీ.. MG మాత్రం సైబర్‌స్టర్‌ను వాటికి విరుద్ధంగా చాలా సింపుల్ లైన్స్‌తో తీర్చిదిద్దింది.

డిజైన్ పరంగా MG Cyberster స్పోర్ట్స్ కారులో రెండువైపులా LED హెడ్‌లైట్లు ఉన్నాయి. దీని ద్వారా దాని పొడవాటి బానెట్‌కు స్పోర్ట్స్ కారు లుక్‌ను జోడిస్తుంది. సైడ్స్ డిజైన్ కోసం గ్లోస్ బ్లాక్ ప్లాస్టిక్‌ను ఉపయోగించడం ద్వారా.. ఈ కారు దాని రియల్ సైజ్ కంటే చిన్నగా కనిపిస్తుంది. అయితే ముందుభాగం సింపుల్‌గా ఉన్నప్పటికీ వెనుక భాగాన్ని చాలా బోల్డ్‌గా డిజైన్ చేశారు.
MG Cyberster వెనుకవైపు బాణం ఆకారంలో టెయిల్‌లైట్‌ను కలిగి ఉంటుంది. కారు డిజైన్‌ను
ఓవరాల్‌గా చూసినట్లయితే ఇవి చాలా ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఇక MG Cyberster లో డోర్ల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. డోర్లు పైకి తెరుచుకునేలా రూపొందించారు. వీటిని కత్తెర డోర్లు అంటారు. ఖరీదైన సూపర్ కార్లు, హైపర్ కార్లలో మాత్రమే వీటిని ఎక్కువగా కేటాయిస్తారు.
ఇక ఇంటీరియర్ పరంగా MG Cyberster లో ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. ఫిజికల్ బటన్‌లతో టూ స్పోక్ మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్ ఉంది. సెంటర్ కన్సోల్‌పై గేర్ సెలెక్టర్ కంట్రోల్‌లు, రెండు కప్ హోల్డర్లు, సెంట్రల్ ఆర్మ్‌రెస్ట్, గ్రాబ్ హ్యాండిల్ ఉన్నాయి. ఇక బూట్ స్పేస్ ఓపెనింగ్ చిన్నగా ఉన్నప్పటికీ.. లోపల ఇద్దరి లగేజీకి సరిపడేంత స్థలం ఉంది.క్యాబిన్ అంతటా సాఫ్ట్ టచ్ మెటీరియల్ కాక్‌పిట్‌ను ఉపయోగించారు.
ఫీచర్ల పరంగా MG Cyberster డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేతో పాటు నాలుగు స్క్రీన్‌లు ఉన్నాయి. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మ్యూజిక్, నావిగేషన్‌ను హ్యాండిల్ చేసేలా ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, HVAC కంట్రోల్, డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్, TPMS వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి.
ఇక పనితీరు పరంగా MG Cyberster లో రెండు పవర్‌ట్రెయిన్ ఎంపికలు ఉన్నాయి. సింగిల్ మోటార్ వేరియంట్, డ్యూయల్ మోటార్ వేరియంట్ ఉన్నాయి. డ్యూయల్ మోటార్ 77kwh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది 535 bhp మరియు 725 nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కేవలం 3.2 నుంచి 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. ఫుల్ ఛార్జింగ్‌పై 580 కి.మీ రేంజ్‌ను ఇస్తుందని అంచనా.
ఇక MG Cyberster సింగిల్ మోటార్ వేరియంట్ 64 kwh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇందులో రియర్ వీల్ డ్రైవ్ టెక్నాలజీ ఉండగా.. 308 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. పూర్తి ఛార్జింగ్‌పై 520 కి.మీ రేంజ్‌ను ఇస్తుంది. ఈ ఏడాదిలోనే MG Cyberster అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులోకి రానుంది. ఈ కారు ధర 50,000 డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు 53 లక్షలుగా ఉంది.


Click it and Unblock the Notifications








