మినీ కొత్త కార్లు లాంచ్.. వీటి ధర చాలా ఎక్కువ అయినా కానీ జనాలు ఎందుకు కొంటారో తెలుసా?
బీఎండబ్ల్యూ యాజమాన్యంలోని మినీకి చెందిన మినీ కూపర్ (Cooper S) కంట్రీమ్యాన్ ఇ (Countryman E) అనే రెండు కొత్త మోడళ్లను ఆ సంస్థ విడుదల చేసింది. ఐకానిక్ మినీ కూపర్ S కొద్దిపాటి డిజైన్ మార్పులతో క్లాసిక్ లుక్‌లో ఆకర్షించేందుకు మార్కెట్‌లోకి విడుదల అయ్యింది. పెద్ద ఫ్రంట్ గ్రిల్, హెడ్ లైట్లు రీడిజైన్ చేయబడ్డాయి. వెనుక టెయిల్ ల్యాంప్స్ కారు సిగ్నేచర్ స్టైల్‌లో త్రిభుజాకారంలో ఉంటాయి. మినీ కూపర్ ఎస్ డిఫరెంట్ యూనియన్ జాక్-ప్రేరేపిత టెయిల్ లైట్లను కలిగి ఉంది. ఇది బ్రిటీష్ మోడళ్లకు తగిన లుక్‌ని అందిస్తుంది.
ఈ కూపర్ ఎస్ ఓషన్ వేవ్ గ్రీన్, సన్నీ సైడ్ ఎల్లో, బ్రిటిష్ రేసింగ్ గ్రీన్, చిల్ రెడ్ 2, బ్లేజింగ్ బ్లూ అనే ఐదు కలర్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంది. కస్టమర్లు ఇష్టం వచ్చిన కలర్‌ని బుక్ చేసుకోవచ్చు. మినీ కూపర్ SEలో 9.4 అంగుళాల OLED టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. డ్రైవర్ డిస్‌ప్లే ఈ స్క్రీన్‌కి ప్రత్యేకంగా ఇంటిగ్రేట్ చేయబడి ఉంటుంది.

ఇక ఫిష్ ఐ కెమెరా, కస్టమైజబుల్ డ్రైవింగ్ మోడ్స్, కనెక్టెడ్ కార్ సర్వీసెస్, కీలెస్ ఎంట్రీ, పవర్ అడ్జస్టబుల్ సీట్లు, 12 కెమెరాలను ఉపయోగించే డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఈ మినీ కూపర్ ఎస్ 7-స్పీడ్ డీసీటీ గేర్ బాక్స్‌తో జతచేయబడింది. ఇది 2-లీటర్ నాలుగు సిలిండర్ల టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది.
దీనిలోని ఇంజన్ గరిష్టంగా 201 bhp పవర్ మరియు 300 Nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇందులోని పవర్ కేవలం ముందు చక్రాలకు మాత్రమే పంపబడుతుంది. ఇది చూడటానికి ఆకట్టుకునే డిజైన్‌లో సరికొత్తగా విడుదల చేసింది. కంపెనీ నుంచి భారత్‌లో విడుదల కానున్న 5th జనరేషన్ కారుగా మినీ కూపర్ ఉంది. దేశవ్యాప్తంగా ఈ మినీ కూపర్‌కి ప్రత్యేకంగా కస్టమర్లు ఉండటం గమనార్హం.

మినీ కంట్రీమ్యాన్ ఇ: ఆల్ ఎలక్ట్రిక్ మినీ కంట్రీమ్యాన్ BMW ఐఎక్స్ 1తో ప్లాట్‌ఫామ్‌ని పంచుకుంటుంది. దీని డిజైన్‌లో కొత్త గ్రిల్, అప్‌డేటెడ్ హెడ్ లైట్లు, టెయిల్ లైట్లు ఉన్నాయి. స్మోకీ గ్రీన్, స్లేట్ బ్లూ, చిల్లీ రెడ్ 2, బ్రిటిష్ రేసింగ్ గ్రీన్, బ్లేజింగ్ బ్లూ, మిడ్ నైట్ బ్లాక్ అనే ఆరు కలర్ ఆప్షన్లతో మినీ ఎలక్ట్రిక్ కంట్రీమ్యాన్ కారుని అందిస్తోంది.
మినీ కంట్రీమ్యాన్ ఎలక్ట్రిక్ డ్రైవర్ మసాజ్ ఫంక్షన్‌తో పవర్-అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, యాంబియంట్ లైటింగ్, ఆటో-డిమ్మింగ్ రియర్ వ్యూ మిర్రర్, క్లైమేట్ కంట్రోల్ మరియు కనెక్టెడ్ కార్ టెక్నాలజీతో సహా అనేక సౌకర్యాలు మరియు ఫ్రెండ్లీ ఫీచర్లను అందిస్తుంది. ఇందులోని పనోరమిక్ సన్ రూఫ్ ద్వారా క్యాబిన్‌లోకి గాలి నేరుగా వస్తుంది. దీనిలోని ఇంటీరియర్ మినీ కూపర్ డిజైన్ ఫిలాసఫీని ప్రతిబింబించే మినిమలిస్ట్ విధానాన్ని పోలి ఉంటుంది.

ఇందులో గల 9.5 అంగుళాల రౌండ్ OLED డిస్ప్లే సెంట్రల్ ఇన్ఫోటైన్‌మెంట్ హబ్‌గా పనిచేస్తుంది. సాంప్రదాయ ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్ స్థానంలో హెడ్-అప్ డిస్ప్లే వస్తుంది. ఇది మంచి డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని అందించనుంది. ఇక సేఫ్టీ పరంగా అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, స్టీరింగ్ అసిస్ట్, లెవల్ -2 డ్రైవర్ అసిస్టెన్స్ సూట్, ట్రాక్షన్ మరియు స్టెబిలిటీ కంట్రోల్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా రెండు పవర్ట్రెయిన్లలో లభించే సింగిల్-మోటార్ మినీ కంట్రీమ్యాన్ ఇ 201 bhp మరియు 250 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. డ్యూయల్ మోటార్ గల మినీ కంట్రీమ్యాన్ ALL4 309 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇవి రెండూ 66.45 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో వస్తాయి. ఇండియా స్పెక్ మినీ కంట్రీమ్యాన్ ఇ 462 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది. 0-100 కిలోమీటర్ల వేగాన్ని 8.6 సెకన్లలో అందుకుంటుంది.
మినీ కూపర్ S, కంట్రీమ్యాన్ ఇ కార్ల ధరలు వరుసగా రూ .44.90 లక్షలు మరియు రూ .54.90 లక్షలు (ఎక్స్-షోరూమ్) వద్ద మార్కెట్‌లోకి ప్రవేశ పెట్టింది. కంట్రీమ్యాన్ ఇ భారత్‌లో కియా ఈవీ6, బీఎండబ్ల్యూ ఐఎక్స్ 1, వోల్వో XC40 రీఛార్జ్, హ్యుందాయ్ ఐయోనిక్ 5 మోడళ్లకు పోటీ ఇవ్వనుంది.


Click it and Unblock the Notifications








