భారత్‌లోకి మరో జపాన్ కార్ల కంపెనీ.. మార్కెట్‌ని శాసించే అవకాశం
భారత్‌లో మార్కెట్‌ని శాసించేందుకు మరో కార్ల కంపెనీ ముందుకొచ్చింది. జపాన్‌కి చెందిన మిత్సుబిషి(Mitsubishi) TVS మొబిలిటీ సహకారంతో ఇండియాలో డీలర్‌షిప్‌లను తెరువనుంది. ఒప్పందంలో భాగంగా టీవీఎస్ మొబిలిటీ మిత్సుబిషి 30 శాతం వాటాను కలిగి ఉండనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే భారత్‌లో కార్ల విక్రయాలను మిత్సుబిషి ప్రారంభించనుంది.
నిక్కీ ఆసియా నివేదిక ప్రకారం దాదాపు రూ. 300 కోట్ల పెట్టుబడిని మిత్సుబిషి పెట్టనుంది. ప్రస్తుతం ఉద్యోగుల సర్దుబాటు, ఇతర డీలర్‌షిప్ ఏర్పాట్ల ప్రక్రియ ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఆటోమొబైల్ మార్కెట్‌లలో భారత్ టాప్ ర్యాంక్‌లో కొనసాగుతోంది. జపాన్‌కి చెందిన మిత్సుబిషి రాకతో ఆటోమోటివ్ రంగంలో తిరుగులేని శక్తిగా భారత్ నిలువనుంది.

భారతీయ మార్కెట్‌లో టీవీఎస్ మొబిలిటీ ఆటోమోటివ్ విభాగంలో బలమైన స్థానాన్ని కలిగి ఉంది. దేశం అంతటా 150కి పైగా కార్ డీలర్‌షిప్‌లను ఈ సంస్థ నిర్వహిస్తోంది. హోండా, టయోటా మరియు మెర్సిడెస్-బెంజ్ వంటి ప్రధాన బ్రాండ్‌ల భాగస్వామ్యంతో, TVS మొబిలిటీ మార్కెట్లో బలమైన ఉనికిని సంపాదించింది. ఇప్పుడు తాజాగా మిత్సుబిషి కార్పొరేషన్‌తో జతకట్టి తిరుగులేని శక్తిగా ఎదగనుంది.
ఈ రెండు సంస్థలు భారతదేశంలో వాహన యాజమాన్య అనుభవాన్ని మరింత చేరువ చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నాయి. ఈ రెండు సంస్థల జాయింట్ వెంచర్ కింద, TVS మొబిలిటీ డీలర్‌షిప్ బిజినెస్ కాస్తా TVS వెహికల్ మొబిలిటీ సొల్యూషన్‌గా మారనుంది. TVS మొబిలిటీలో మిత్సుబిషి కార్పొరేషన్ సుమారు 30% వాటాను కొనుగోలు చేస్తుంది. దీంతో ప్రధాన స్టేక్ హోల్డర్‌గా నిలువనుంది.
ప్రయాణీకుల వాహనాలు, వాణిజ్య వాహనాలు మరియు మెటీరియల్ హ్యాండ్లింగ్ పరికరాలను కూడా అందించడానికి ఈ సంస్థలు ప్రణాళికలు చేస్తున్నాయి. TVS మొబిలిటీ మరియు మిత్సుబిషి కార్పొరేషన్ మధ్య సహకారం రాబోయే మూడు నుంచి ఐదు సంవత్సరాలలో USD 2 బిలియన్ల ఆదాయాన్ని పొందనుంది. దేశంలోని మొత్తం వాహన మొబిలిటీ ఎకోసిస్టమ్‌కు అనేక రకాల పరిష్కారాలను అందించడానికి ఈ భాగస్వామ్యం తోడ్పడుతుందని TVS మొబిలిటీ డైరెక్టర్ R. దినేష్ తెలిపారు.
భారత్‌లో మిత్సుబిషి కార్పొరేషన్ ఆగమనం ఆటో రంగానికి మరింత ఊతమిస్తుందని ఆ మొబిలిటీ గ్రూప్ సీఈవో Mr షిగేరు వాకబయాషి తెలిపారు. భారతదేశ మార్కెట్ సామర్థ్యాన్ని ఆయన కొనియాడారు. భవిష్యత్తులో భారత్ మరింత అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. క్షేత్ర స్థాయిలో వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా పలు రకాల పరిష్కారాలకు ఈ పెట్టుబడి దారి చూపిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ పెట్టుబడి మరియు ఒప్పందాలకు సంబంధించి భారత ప్రభుత్వంలోని సంబంధిత అధికారుల ఆమోదం పెండింగ్‌లో ఉంది. ఆలోపు TVS వెహికల్ మొబిలిటీ సొల్యూషన్ భారతదేశంలో వాహన యాజమాన్యాన్ని విస్తరించే క్రమంలో నిమగ్నమైంది. ఆటోమోటివ్ పరిశ్రమలో కస్టమర్‌లు మరియు వాటాదారుల అవసరాలను తీర్చడానికి సమగ్ర సమస్యలను నిశితంగా పరిశీలించేందుకు డిజిటల్ అవేర్‌నెస్ కార్యక్రమాలను సంస్థ నిర్వహిస్తోంది.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








