30 కి.మీ కంటే ఎక్కువ మైలేజీ ఇచ్చే ఈ సీఎన్‌జీ కార్లు చాలా సేఫ్‌.. మీ డబ్బు చాలా ఆదా అవుతుంది!!

దేశంలో ప్రస్తుతం పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. పెట్రోల్, డీజిల్‌ కార్లకు బదులుగా భాగంగా జనాలు ఎలక్ట్రిక్, సీఎన్‌జీ, హైబ్రిడ్ వాహనాల వైపు చూస్తున్నారు. ఎక్కువ మైలేజీ అందించే సీఎన్‌జీలను ఎక్కువగా కొంటున్నారు. తద్వారా ఇంధన ఖర్చులను ఆదా చేసుకోవచ్చని వారు భావిస్తున్నారు. ఇంధన ఖర్చులను తగ్గించడానికి సీఎన్‌జీ ఉపయోగపడనున్నాయి. ఎక్కువ మైలేజీ అందించే కార్లను వాహనదారులు కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో మంచి మైలేజీ, అధిక ఫీచర్లు, మంచి సేఫ్టీని అందించే కార్లు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ మనం అత్యధిక మైలేజీ అందించే టాప్ 5 సీఎన్‌జీ కార్ల వివరాలను చూడబోతున్నాము.

భారతదేశంలో పెట్రోల్ వాహనాల కంటే సీఎన్‌జీ వాహనాలు ఇప్పుడు ఎక్కువ ప్రాచుర్యం పొందాయి. ప్రపంచంలోనే అత్యంత ఇంధన సామర్థ్యం కలిగిన వాహనాలు సీఎన్‌జీ వాహనాలుగా ఉన్నాయి. దీనివల్ల ప్రజలకు మరింత డబ్బు ఆదా కానుంది. అంతే కాదు, సీఎన్‌జీ వాహనాలు పర్యావరణానికి తక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తాయి. ప్రస్తుతం భారతదేశంలో రూ .10 లక్షల లోపు టాప్ 5 సీఎన్‌జీ కార్లపై ఓ లుక్కేద్దాం..

Best-CNG-Cars-Under-10-Lakhs

మారుతి సుజుకి వ్యాగన్ఆర్: మారుతి సుజుకి వ్యాగన్ఆర్ సీఎన్‌జీ వేరియంట్‌లో కూడా అందుబాటులో ఉంది. ఈ కారులో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలదు. ఇది 76bhp పవర్ మరియు 98nm టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారులో ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే మరియు ముందు భాగంలో రెండు ఎయిర్ బ్యాగులు వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.

ఈ కారు మైలేజీ కిలోకు 34.04 కిలోమీటర్లు అందిస్తుంది. దీని ధర రూ.6.44 లక్షలుగా ఉంది. ఇది భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న సీఎన్‌జీ కారుగా గుర్తింపు పొందింది. ఈ కారుని చాలా మంది ఇష్టపడతారు. పనితీరు మరియు మంచి మైలేజీ కారణంగా ఈ కారు ఎక్కువగా అమ్ముడవుతుంది. ప్రస్తుతం సేల్స్‌లోను ఈ కారు దుమ్మురేపుతుంది.

Maruti-Wagnor-CNG-Car

మారుతి ఆల్టో K10: ఆ తర్వాత అందుబాటులో ఉన్న సరసమైన సీఎన్‌జీ కారు మారుతి ఆల్టో K10. ఈ కారు సీఎన్‌జీ వేరియంట్‌లో లభిస్తుంది. ఈ కారు ఒక చిన్న కారుగా కనిపిస్తుంది. దాని డిజైన్‌కి తగినట్లుగానే ఈ కారు ధర తక్కువగా ఉంటుంది. అదే సమయంలో ఈ కారును హ్యాండిల్ చేయడం సులభం. ఇది అధిక మైలేజీ ఉన్న కారు కాబట్టి మార్కెట్‌లో మంచి డిమాండ్‌ని కలిగి ఉంది. ఈ సి

ఈ సీఎన్‌జీ వేరియంట్‌ కిలోకు 33 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వగలదు. ఇది 998 సీసీ ఇంజిన్ తో పనిచేస్తుంది. ఈ కారు ధర రూ.5.96 లక్షలుగా ఉంది. ప్రస్తుతం మారుతి కార్లలో అధికంగా అమ్ముడవుతున్న బడ్జెట్‌ కార్లలో ఈ కారు కూడా ఉంది. ఈ కారు కొనుగోలుపై డిస్కౌంట్‌ని సైతం కంపెనీ అదిస్తోంది.

Tata-Tigore-CNG-Car

టాటా టిగోర్‌: ఈ కారులో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలదు. ఇది సీఎన్‌జీ ఇంధనంపై 84 bhp శక్తిని 113nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు లోపల స్పేస్‌ ఎక్కువగా ఉంటుంది. ఈ కారులో మంచి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి. దీని ధర రూ .8.29 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా ఉంది. ఇది కిలోకు 26.47 కి.మీ మైలేజీ ఇస్తుంది.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్: ఈ కారు సీఎన్‌జీ వేరియంట్‌లో అమ్మకానికి ఉంది. దీని ఇంజిన్ 68bhp పవర్ మరియు 95nm టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. హ్యుందాయ్ విక్రయించే చౌకైన సీఎన్‌జీ కారు ఇదే. మార్కెట్‌లో ఈ కారు ధర రూ.7.72 లక్షలుగా ఉంది. ఇది కిలో సీఎన్‌జీకి 25.61 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో: మారుతి సుజుకి ప్రస్తుతం భారతదేశంలో ఎస్-ప్రెస్సో సీఎన్‌జీ వేరియంట్‌ని విక్రయిస్తోంది. సీఎన్‌జీ ఇంధనంపై 67 bhp శక్తిని మరియు 90 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు కాస్త డిఫరెంట్ డిజైన్‌ని కలిగి ఉంటుంది. ఇది కిలో సీఎన్‌జీకి 32.12 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. దీని ధర రూ. 6.11 ఎక్స్‌-షోరూమ్ ధరగా ఉంది.

More from DriveSpark

Article Published On: Monday, July 15, 2024, 13:35 [IST]
English summary
Most affordable cng cars under 10 lakhs full price and mileage details are here
Read more on: #auto news #cng #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+