దేశంలో లభించే పవర్‌ఫుల్‌ హైబ్రిడ్‌ కార్లు.. వీటిలో వెళ్తే ఆ మజాయే వేరు! ధర కూడా అంతే ఉంటుంది మరీ!!

ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆటోమోబైల్‌ దేశాల్లో భారత్‌ అతిపెద్ద మార్కెట్‌ని కలిగి ఉంది. ప్రస్తుతం అత్యధికంగా కార్లను కలిగి ఉన్న దేశాల్లో భారత్ ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదు. మన దగ్గర కొత్త విదేశీ కార్ల కంపెనీలు నిరంతరం పరిచయం అవుతున్నాయి. తాజాగా పలు కంపెనీలు సిట్రోయెన్, బీవైడీ వంటి కార్లు కూడా భారతీయ మార్కెట్‌పై దృష్టి సారిస్తున్నాయి. ప్రస్తుతం విదేశీ కార్లు సైతం మంచి డిమాండ్‌ని కలిగి ఉన్నాయి. వీటికోసం నెలల తరబడి వెయిట్‌ చేయాల్సిన అవసరం వస్తుంది. ప్రస్తుతం మన దగ్గర చౌక కార్ల నుంచి ఖరీదైన రోల్స్ రాయిస్ కార్ల వరకు మన దేశంలో అమ్మకానికి ఉన్నాయి. ఎందుకంటే మన దేశంలో ఎన్నో రకాల ప్రజలు నివసిస్తున్నారు. వారి అభిరుచికి తగినట్లుగా కార్లు వస్తున్నాయి.

కానీ, ఈ కథనంలో మనం చూడబోయేది కేవలం ఖరీదైన, శక్తివంతమైన హైబ్రిడ్ కార్ల గురించి మాత్రమే. ప్రస్తుతం దేశంలో ఖరీదైన కార్లను లంబోర్ఘిని, ఫెరారీ, మెర్సిడెస్ తదితర కార్ల కంపెనీలు విక్రయిస్తున్నాయి. ఈ కథనంలో అత్యంత శక్తివంతమైన 5 హైబ్రిడ్ కార్ల గురించి తెలుసుకుందాం. వాటి ఫీచర్లు ధర ఆధారంగా వాటిని కొనుగోలు చేయాలని ఉంటే ఈ కింది ఉన్న ప్రీమియం కార్లపై ఓ లుక్కేయండి.

Lamorghibni-Revuelto-Price-In-India

లంబోర్ఘిని: ఈ జాబితాలోని ముందు వరుసలో ఉన్న కారు లంబోర్ఘిని హైబ్రిడ్‌ కారు. ఇది మునుపటి మోడల్ స్థానంలో లంబోర్ఘిని అవెంటాడోర్‌ కంటే భారీ ఫీచర్లతో విడుదల చేశారు. అదే లంబోర్ఘిని రెవాల్టో. ప్రస్తుతం దీని ధర రూ .8.89 కోట్లు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. లంబోర్ఘిని మూడు ఎలక్ట్రిక్ మోటార్లతో 6.5-లీటర్, నేచ్‌రల్‌-ఆస్పిరేటెడ్ V12 ఇంజిన్‌తో పనిచేస్తుంది.

ఫెరారీ 296GTS: ఈ జాబితాలో తరువాతి స్థానంలోని కారు ఫెరారీ 296 GTS. ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఫెరారీ 296 GTB తర్వాత వచ్చిన కన్వర్టిబుల్ వెర్షన్‌గా ఉంది. ఈ సూపర్ కారులో 3.0-లీటర్ ట్విన్-టర్బో V6 ఇంజిన్ కలదు. ఈ కారు ధర రూ.6.24 కోట్లుగా(Ex-Showroom) ఉంది. ఈ కారు 0-100 కి.మీ వేగాన్ని కేవలం 2.9 సెకన్లలో అందుకుంటుంది.

Mclaren-Artura-Price-In-India

మెక్ లారెన్ ఆర్టురా: ప్రస్తుతం దీని ధర రూ.5.2 కోట్లుగా ఉంది. మెక్ లారెన్ P1 మరియు స్పీడ్‌టైల్‌ తర్వాత మెక్ లారెన్ నుంచి వచ్చిన మూడవ హైబ్రిడ్ కారుగా ఆర్టురా ఉంది. ఇది 3.0-లీటర్ ట్విన్-టర్బో వి 6 ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ కారు 7.4 కిలోవాట్ల బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది కేవలం ఎలక్ట్రిక్ శక్తితో 31 కిలోమీటర్ల పరిధిని అందించగలదు.

మెర్సిడెస్-AMG GT 63 SE: మీరు పెర్ఫార్మెన్స్ కార్లను చూస్తున్నట్లయితే, వాటిలో మెర్సిడెస్-AMG కార్లు కచ్చితంగా ఉంటాయి. ఈ ఏఎంజీ జీటీ63 ఎస్ఈ ఎక్స్ షోరూమ్ ధర రూ.3.3 కోట్లు (ఎక్స్‌-షోరూమ్‌)గా ఉంది. ఈ నాలుగు డోర్ల కూపేలో 4.0-లీటర్ వి8 పెట్రోల్ ఇంజిన్ కలదు. ఇది కేవలం 0-100 కి.మీ వేగాన్ని 2.9 సెకన్లలో అందుకుంటుంది.

Mercedes-AMG-GT-63-SE
పోర్షే కేయెన్ ఇ-హైబ్రిడ్: ఈ లైనప్‌లో మనం చూడబోయే మరో హైబ్రిడ్ కారు ఇది. ఇందులో 3 లీటర్ల వీ6 ఇంజిన్ ను అమర్చారు. ఎలక్ట్రిక్ మోటారుతో నడిచే ఈ ఇంజన్ గరిష్టంగా 470 హెచ్పీ శక్తిని అందించగలదు. ఈ హైబ్రిడ్ కారు 25.9 కిలోవాట్ల బ్యాటరీతో పనిచేస్తుంది. ఇది కేవలం ఎలక్ట్రిక్ శక్తిపై 90 కిలోమీటర్ల పరిధిని అందించగలదు.

డ్రైవ్స్‌పార్క్ వ్యాఖ్య: ఈ సేకరణలో శక్తివంతమైన హైబ్రిడ్ కార్లను మాత్రమే మేము చూశాము. నాన్ హైబ్రిడ్ కార్ల విషయానికొస్తే ఈ జాబితా ఎక్కువగానే ఉంటుంది. అదేవిధంగా, హైబ్రిడ్ కార్లు ప్రపంచంలోని ఇతర దేశాలలో కూడా అమ్మకానికి ఉన్నాయి. కామెంట్ బాక్స్‌లో ఈ 5 కార్లలో ఏది మీకు ఇష్టమైనదో మాకు చెప్పండి.

More from DriveSpark

Article Published On: Monday, July 8, 2024, 16:39 [IST]
English summary
Most powerful hybrid cars available in india engine performance and price details in telugu
Read more on: #auto news #cars #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+