భారత్‌లో పవర్‌ఫుల్ సెడాన్స్: ధర రూ.25 లక్షల కంటే తక్కువే..

మార్కెట్లో SUV, MPVలు మంచి సంఖ్యలో అమ్ముడవుతున్నాయి. అయితే ఆధునిక కాలంలో సెడాన్లను కొనుగోలు చేసేవారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. ఈ తరుణంలో భారతీయ విఫణిలో రూ.25 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే సెడాన్ల గురించి తెలుసుకుందాం.

హ్యుందాయ్ వెర్నా (1.5-లీ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్)

గత కొంత కాలం నుంచి ఉత్తమ అమ్మకాలు పొందుతున్న హ్యుందాయ్ కంపెనీ యొక్క వెర్నా అత్యుత్తమ కార్ల జాబితాలో ఒకటి. ఇది 1.5 లీటర్ ఫంపూర్ సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ కలిగి 115 హార్స్ పవర్ మరియు 144 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ లేదా ఆప్షనల్ ఆటోమేటిక్‌ పొందుతుంది. దీని ప్రారంభ ధర రూ. 11 లక్షలు.

Skoda Slavia

స్కోడా స్లావియా & ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ (1.0-లీ టర్బో పెట్రోల్)

స్కోడా కంపెనీకి చెందిన స్లావియా (రూ.11.53 లక్షల నుంచి రూ.16.93 లక్షలు) మరియు ఫోక్స్‌వ్యాగన్ కంపెనీకి చెందిన వర్టస్ (రూ.11.56 లక్షల నుంచి రూ.17.05 లక్షలు) రెండూ.. చిన్న 1.0 లీటర్ త్రీ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతాయి. ఇది 115 హార్స్ పవర్ మరియు 178 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ పొందుతుంది.

హోండా సిటీ (1.5-లీ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్)

హోండా సిటీ అనేది కంపెనీ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన కారు. ఇది 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 121 హార్స్ పవర్ మరియు 145 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ లేదా ఆప్షనల్ సీవీటీ అప్షన్స్ పొందుతుంది. దీని ధరలు రూ. 11.82 లక్షల నుంచి రూ. 16.30 లక్షల మధ్య ఉన్నాయి.

Honda City e HEV

హోండా సిటీ హైబ్రిడ్ (1.5-లీ పెట్రోల్ హైబ్రిడ్)

హోండా సిటీ మాత్రమే కాకుండా సిటీ హైబ్రిడ్ కూడా ఉత్తమ అమ్మకాలు పొందిన మోడల్. ఈ కారు e:HEV ఎలక్ట్రిక్ జనరేటర్ మోటారును అనుసంధానించబడిన 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి 126 హార్స్ పవర్ మరియు 253 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది ఈ-సీవీటీ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది ఉత్తమ పనితీరును అందిస్తుంది. దీని ధర రూ. 20.55 లక్షలు.

ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ & స్కోడా స్లావియా (1.5 లీ టర్బో పెట్రోల్)

వర్టస్ మరియు స్లావియా యొక్క టాప్ వేరియంట్లు రెండూ.. 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతాయి. ఇవి 150 హార్స్ పవర్ మరియు 250 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తాయి. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ లేదా ఆప్షనల్ 7 స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమేటిక్‌ పొందుతుంది. వీటి ధరలు వరుసగా రూ. 15.23 లక్షల నుంచి రూ. 16.62 లక్షల మధ్య ఉంటాయి.

Hyundai Verna

హ్యుందాయ్ వెర్నా (1.5-లీ టర్బో పెట్రోల్)

హ్యుండై వెర్నా 1.5 లీ టర్బో పెట్రోల్ కూడా అద్భుతమైన పనితీరును అందిస్తుంది. ఈ ఇంజిన్ 160 హార్స్ పవర్ మరియు 253 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో పాటు ఆప్షనల్ 7 స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమాటిక్ ఆప్షన్ పొందుతుంది. దీని ధర రూ. 14.87 లక్షల నుంచి రూ. 17.42 లక్షల మధ్య ఉంటుంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Monday, April 29, 2024, 11:00 [IST]
English summary
Most powerful petrol sedans in india under rs 25 lakh details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+