వావ్‌ కేవలం రూ. 6.49 లక్షలకే కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ లాంచ్.. బుకింగ్‌లు ప్రారంభం

మారుతి సుజుకి నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త నాల్గవ తరం స్విఫ్ట్ ఎట్టకేలకు లాంచ్ అయింది. అధునాతన ఫీచర్లు, అత్యంత సరసమైన ధరలో సంస్థ ఈ కొత్త హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేసింది. భారత మార్కెట్లో అత్యంత ఎక్కువగా అమ్ముడవతున్నమోడళ్లలో ఒకటైన స్విఫ్ట్ ఇప్పుడు.. సరికొత్త అప్‌డేట్లతో విడుదల కాగా.. ధర, ఫీచర్లు, డిజైన్ పూర్తి సమాచారం ఈ కథనంలో..

భారతీయుల ఫేవరెట్ కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్‌ను సంస్థ రూ. రూ. 6.49 లక్షల ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఇది ఎక్స్-షోరూమ్ ధర. ఈ లెజెండరీ హ్యచ్‌బ్యాక్ ఇప్పుడు 4th Gen వెర్షన్లో చాలా మార్పులను కలిగి ఉంటూ.. ట్రెండ్‌ను సెట్ చేయడానికి సిద్ధంగా ఉంది. 2024 స్విఫ్ట్‌ను సంస్థ ఐదు వేరియంట్లు.. LXi, VXi, VXi (O), ZXi మరియు ZXi+ లలో లాంచ్ చేసింది.

2024-Maruti-Suzuki-Swift-Launch

2024 స్విఫ్ట్‌లో ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్, డిజైన్, ఫీచర్ల పరంగా చాలా మార్పులను కలిగి ఉంది. కొత్త ఇంజిన్‌తో సహా విస్తృతమైన మార్పులను కలిగి ఉంటూ అద్భుతంగా కనిపిస్తుంది. కొత్తగా రీడిజైన్ చేసిన రియర్ బంపర్, కొత్త అల్లాయ్ వీల్స్, అప్‌డేట్ చేయబడిన హెడ్‌ల్యాంప్‌లు, సవరించిన ఫాగ్ ల్యాంప్‌లు మరియు కొత్త C-ఆకారపు టెయిల్‌ల్యాంప్‌లు వంటి వాటితో కొత్త స్విఫ్ట్ ఆకర్షణీయంగా ఉంది.

2024-Maruti-Suzuki-Swift-Launch

క్లాసిక్ ప్రొఫైల్‌ను కలిగి ఉంటూ వినూత్న ఫీచర్లను కలిగి ఉంది. కొత్త స్విఫ్ట్ ఇంటీరియర్ పరంగా ఫ్రాంక్స్, బ్రెజ్జా మరియు బాలెనోలను పోలి ఉంటుంది. ఈ ప్రముఖ హ్యాచ్‌బ్యాక్‌లో వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, ఆర్కామిస్ సౌండ్ సిస్టమ్, టైప్-సి ఛార్జింగ్ పోర్ట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, అప్‌డేటెడ్ స్విచ్ గేర్, అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి.

వైర్‌లెస్ ఛార్జర్‌తో కూడిన కొత్త 9 అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో మరియు అదే కొలతలో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి అధునాతన ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇంకా కొత్త స్విఫ్ట్‌లో రియర్ AC వెంట్లు ఉన్నాయి. కాగా అన్ని స్విఫ్ట్ వేరియంట్‌లలో స్టాండర్డ్‌గా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను ప్రవేశపెట్టడం విశేషం.

2024-Maruti-Suzuki-Swift-Launch

2024 Maruti Suzuki Swift ఇంజిన్ పరంగా సరికొత్త 1.2-లీటర్ మూడు-సిలిండర్ Z12E ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఇది 81 bhp మరియు 112 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కాగా ఇది అవుట్‌గోయింగ్ K-సిరీస్ ఇంజిన్ కంటే 8 bhp మరియు 1Nm తక్కువ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ మరియు AMT గేర్‌బాక్స్‌లతో జతచేయబడి ఉంటుంది.

2024-Maruti-Suzuki-Swift-Launch

మైలేజ్ పరంగా ఇవి వరుసగా లీటరుకు 24.8 కి.మీ మరియు 24.75 కి.మీ మైలేజ్ ఇస్తుందని సంస్థ చెబుతోంది. కొలతల విషయానికి వస్తే, కొత్త స్విఫ్ట్ 3,860mm పొడవు, 1,735mm వెడల్పు మరియు 1,495mm ఎత్తును కలిగి ఉంది. వీల్‌బేస్ 2,450 mm. కొత్త తరం స్విఫ్ట్ ఎక్స్‌టీరియర్ పరంగా ఇప్పటికే ఉన్న మోడల్‌ మాదిరిగా ఉన్నప్పటికీ.. ఇది విలక్షణంగా ఉంటుందని చెప్పవచ్చు.

కొత్త స్విఫ్ట్ దాని మునుపటి మోడల్ కంటే కొన్ని కాస్మెటిక్ మార్పులను కలిగి ఉంది. ముందు మరియు వెనుక బంపర్‌లు కొంతవరకు మార్చబడ్డాయి. స్విఫ్ట్ టాప్ వేరియంట్లు 15-అంగుళాల డ్యూయల్-టోన్ మెషిన్-కట్ అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉండగా.. లోయర్ ట్రిమ్‌లు మాత్రం 14-అంగుళాల స్టీల్ రిమ్‌లతో వస్తాయి. హెడ్‌ల్యాంప్ క్లస్టర్ LED డేటైమ్ రన్నింగ్ లైట్లతో ఆకట్టుకునేలా కనిపిస్తుంది. టెయిల్‌లైట్ క్లస్టర్‌లు కొత్త C-ఆకారపు ఇంటర్నల్‌లను కలిగి ఉంది.

2024-Maruti-Suzuki-Swift-Launch

కొత్త 2024 స్విఫ్ట్‌ బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. కస్టమర్లు రూ. 11,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. వేరియంట్లను బట్టి ధరలు మారుతుంటాయి. లోయర్ ట్రిమ్ ధర రూ. 6.49 లక్షలు ఉండగా.. టాప్ వేరియంట్ ధర రూ. 9.65 లక్షల(ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. 2024 మారుతి సుజుకి స్విఫ్ట్.. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ మరియు టాటా టియాగో వంటి మోడళ్లకు గట్టిపోటీనిస్తుంది.

More from DriveSpark

Article Published On: Thursday, May 9, 2024, 14:13 [IST]
English summary
New 2024 maruti suzuki swift launched in india price specs features engine details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+