Swift 2024 మారుతి సుజుకి స్విఫ్ట్‌ పూర్తి ఫీచర్లు, స్పెసిఫికేషన్స్‌, ఇంజిన్‌ ఫర్ఫామెన్స్‌ రివ్యూ వీడియో..

2024 మారుతి సుజుకి కారు తాజాగా విడుదలైంది. ఈ కారుని మా డ్రైవ్స్‌పార్క్‌ టీమ్‌ టెస్ట్‌రైడ్‌ చేసింది. రూ. 6.49 లక్షల ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్)తో నాల్గవ తరం స్విఫ్ట్‌ని సంస్థ తీసుకువచ్చింది. 19 సంవత్సరాల చరిత్ర కలిగిన స్విఫ్ట్‌ కారుకి మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. ఈ కారు వివిధ రూపాల్లో విడుదల చేసిన ప్రతీసారి ప్రజలు ఆదరిస్తూనే ఉన్నారు.

కొత్త ఇంజిన్ మరియు పూర్తిగా లోడ్ చేయబడిన భద్రతా ఫీచర్లను ఈ సరికొత్త మారుతి కార్‌లో మోఢిఫికేషన్లు చేసి తీసుకువచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంజిన్‌ ఫర్ఫామెన్స్‌, ఫీచర్లు, ఇంటీరీయర్‌ డిజైన్‌ తదితర అంశాలు ఈ కింది వీడియోలో గమనించవచ్చు.

ఈ సరికొత్త 2024 మారుతి సుజుకి స్విఫ్ట్‌ డిజైన్‌లో కొన్ని మార్పులను సంస్థ చేసింది. దీనిలో బానెట్‌ మార్పు ఒకటి చూడవచ్చు. ఇక స్విఫ్ట్ మరింత పొదుపుగా ఉండే Z సిరీస్ పవర్‌ప్లాంట్ కోసం సుజుకి యొక్క K-సిరీస్ ఇంజిన్‌ని తీసి వేసింది. దీంతో ఈ స్విఫ్ట్‌ ఇంజిన్‌లో ఒక సిలిండర్‌ తగ్గింది. కొత్త Z12E ఇంజన్ 80.46bhp వద్ద 5,700rpm మరియు 111.7Nm 4,300rpm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.

5-స్పీడ్ మాన్యువల్ మరియు AMT గేర్‌బాక్స్ ఆప్షన్స్‌తో అందుబాటులో ఉంటుంది. స్విఫ్ట్ మాన్యువల్ 24.8km/l మైలేజీని అందిస్తుంది. ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ కోసం స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, క్రూయిజ్ కంట్రోల్ మరియు LED ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఇక భద్రతా విషయానికి వస్తే ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ISOFIX యాంకర్స్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, EBDతో కూడిన ABS, హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటివి ఉన్నాయి.

Maruti-Susuki-Swift-Video-Review

More from DriveSpark

Article Published On: Thursday, May 16, 2024, 12:03 [IST]
English summary
New 2024 maruti suzuki swift video review specs features driving impressions
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+