కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
భారత మార్కెట్లో ఆస్టన్ మార్టిన్ సరికొత్త అప్‌డేట్లతో వాంటేజ్(Aston Martin Vantage)ను ప్రారంభించింది. ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ పరంగా Vantage ను సంస్థ ఆకట్టుకునేలా అప్‌డేట్ చేసింది. కాగా గ్లోబల్ మార్కెట్లో ఈ కారును సంస్థ రెండు నెలల క్రితం ఆవిష్కరించింది. ఈ లగ్జరీ కారు ధర, ఫీచర్లు, ఇంజిన్ స్పెసిఫికేషన్లు పూర్తి సమాచారం ఈ కథనంలో.
సరికొత్త వాన్టేజ్‌ను ఆస్టన్ మార్టిన్ రూ. 3.99 కోట్ల (ఎక్స్-షోరూమ్, ఇండియా) ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఆస్టన్ యొక్క ఈ స్పోర్ట్స్ కూపే వాంటేజ్ ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ పరంగా చాలా అప్‌డేట్లను కలిగి ఉంది. కొత్త డాష్‌బోర్డ్ మరియు సరికొత్త సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫారమ్‌ను చూడవచ్చు. Vantage మెర్సిడెస్-AMG-ఆధారితం.. 4.0-లీటర్, ట్విన్-టర్బో V8 ఇంజిన్‌ను కలిగి ఉంది.

కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ ఫ్రంట్ బంపర్ భారీ గ్రిల్‌తో ఆకర్షణీయంగా ఉంది. అంచుల్లో ఇన్‌టేక్‌లు, హెడ్‌ల్యాంప్‌లు పెద్దగా, గుండ్రంగా ఉన్నాయి. LED DRL సిగ్నేచర్‌తో చూడగానే ఆకట్టుకునేలా ఉంటుంది. ఇక వెనుక భాగంలో బోల్డ్ బంపర్, డిఫ్యూజర్ సెటప్‌ను చూడవచ్చు. కాగా కొత్త వాంటేజ్ మునుపటి దాని కంటే కూడా 30 మి.మీ వెడల్పుగా ఉంది. కొత్త ఫ్రేమ్‌లెస్ మిర్రర్లు, ఫ్లష్ ఎలక్ట్రానిక్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి.
ఇక ఇంటీరియర్ పరంగా కొత్త వాంటేజ్ కాక్‌పిట్ అమరికతో DB12ని పోలి ఉంటుంది. కనెక్టివిటీ, ఎంగేజ్‌మెంట్ మరియు రిఫైన్‌మెంట్‌కు ప్రాధాన్యత ఇస్తుంది. ఈ కొత్త సాఫ్ట్‌వేర్ ఇంటర్‌ఫేస్‌ను మొదటగా DB12లో ప్రారంభించారు. తాజాగా ప్రపంచవ్యాప్తంగా DBX SUV కి కూడా అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే.

ఫీచర్ల పరంగా స్మార్ట్‌ఫోన్ యాప్‌కి కనెక్ట్ అయ్యే బెస్పోక్ సాఫ్ట్‌వేర్‌తో కొత్త 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. 3D లైవ్ మ్యాపింగ్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ మిర్రరింగ్ మరియు లాస్ట్-మైల్ ఆన్-ఫుట్ నావిగేషన్ వంటి ఫీచర్లను చూడవచ్చు. క్లైమేట్ కంట్రోల్ స్టాక్, గేర్ సెలెక్టర్ ఉన్నాయి.,
వీటితో పాటు డ్రైవ్ కంట్రోల్ స్విచ్ అలాగే ESP, ఎగ్జాస్ట్, లేన్ అసిస్ట్ మరియు పార్కింగ్ సెన్సార్‌ల కోసం ఓవర్‌రైడ్ బటన్‌లు ఉన్నాయి. వీటన్నిటితో పాటు సరికొత్త స్టీరింగ్ వీల్ మరియు కొత్త డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇక ఇంటీరియర్ క్వాలిటీ మరియు ఫిట్ అండ్ ఫినిషింగ్‌లో చెప్పుకోదగ్గ స్టెప్-అప్‌ను చూడవచ్చు.

పవర్‌ట్రెయిన్ విషయానికొస్తే 4.0-లీటర్ V8 ట్విన్ టర్బో ఇంజిన్‌తో పనిచేస్తుంది. అవుట్‌పుట్ 665 hp మరియు 800 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. వెనుక చక్రానికి శక్తిని సరఫరా చేస్తుంది. ఇది కేవలం 3.4 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. గరిష్ఠంగా గంటకు 325 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. 8-స్పీడ్ ZF ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.
ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ అడాప్టివ్ డంపర్‌లు, ఎలక్ట్రానిక్ రియర్ డిఫరెన్షియల్ మరియు మిచెలిన్ పైలట్ S 5 టైర్‌లపై చుట్టబడిన 21-అంగుళాల చక్రాలపై నడుస్తుంది. కొత్త వాంటేజ్‌లో "పంచీయర్" ఇన్-గేర్ యాక్సిలరేషన్ మరియు స్నాపియర్ షిఫ్ట్‌లు, అలాగే ప్రతి డ్రైవ్ మోడ్‌లలో మరిన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయని సంస్థ చెబుతోంది. వెట్, స్పోర్ట్, స్పోర్ట్ ప్లస్, ట్రాక్, ఇండివిడ్యువల్ అనే ఐదు డ్రైవింగ్ మోడ్‌లను అందిస్తోంది.

కొత్త వాంటేజ్‌లో పనితీరు, డ్రైవింగ్ అనుభవాన్ని మెరుగుపరిచేందుకు.. అనేక ట్రాక్షన్-మేనేజ్‌మెంట్ మోడ్‌లు, లాంచ్ కంట్రోల్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్‌ను మార్చింది. కాగా ఈ టెక్నాలజీ అంతా బ్రేకింగ్ సిస్టమ్‌తో నియంత్రించేలా రూపొందించింది. ఇందులో సిక్స్-పిస్టన్ కాలిపర్‌లతో ముందు 400 మి.మీ స్టీల్ రోటర్లు, వెనుక భాగంలో నాలుగు పిస్టన్ కాలిపర్‌లతో 360 ఎంఎం రోటర్లను కలిగి ఉంది. ఇది కాకుండా, కార్బన్ సిరామిక్ సెట్ కూడా ఆప్షన్‌గా అందించింది.


Click it and Unblock the Notifications








