కొత్త కారు కొనేవారికి శుభవార్త! వచ్చే నెలలో లాంచ్ అయ్యే కార్లు ఇవే.. చూసారా!
2024 ప్రారంభమై 2 నెలలు పూర్తి కావొస్తోంది. ఇప్పటికే అనేక కొత్త ఉత్పత్తులు మార్కెట్లో లాంచ్ అయ్యాయి, అవుతున్నాయి. ఈ కథనంలో వచ్చే నెలలో (మార్చి2024) భారతీయ విఫణిలో అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉన్న కొత్త కార్ల గురించి వివరంగా తెలుసుకుందాం..
హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ (Hyundai Creta N Line)
దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన హ్యుందాయ్ కంపెనీకి చెందిన క్రెటా.. ఎన్ లైన్ అనే కొత్త వెర్షన్ రూపంలో లాంచ్ అవ్వడానికి సిద్ధమవుతోంది. ఈ SUV మార్చి 11న అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ కారు దాని మునుపటి మోడల్స్ కంటే కూడా మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి అత్యత్తమ పనితీరుని అందించేలా రూపొందించబడి ఉంటుంది.

హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది 158 bhp పవర్ మరియు 253 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజిన్ 7 స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ పొందుతుంది. అంతే కాకుండా ఇందులో 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ కూడా ఉండనున్నట్లు సమాచారం.
టాటా నెక్సాన్ డార్క్ ఎడిషన్ (Tata Nexon Dark Edition)
దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్ యొక్క నెక్సాన్ ప్రారంభం నుంచి దేశీయ మార్కెట్లో గొప్ప అమ్మకాలను పొందుతూ దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే పలు ఎడిషన్లలో అందుబాటులో ఉన్న ఈ కారు త్వరలో డార్క్ ఎడిషన్ రూపంలో లాంచ్ అవ్వడానికి సిద్ధమవుతోంది. ఇది మార్చి మొదటి వారంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

అద్భుతమైన డిజైన్ మరియు అధునాతన ఫీచర్స్ కలిగిన కొత్త టాటా నెక్సాన్ ఇప్పటికే పెట్రోల్, డీజిల్ మరియు ఎలక్ట్రిక్ వెర్షన్లలో కూడా అందుబాటులో ఉంది. కాగా కంపెనీ ఈ కారును CNG రూపంలో కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది. నెక్సాన్ ప్రారంభ ధరలు రూ.8.14 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే త్వరలో లాంచ్ కానున్న డార్క్ ఎడిషన్ ధర దీని కంటే కూడా రూ.30000 ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
మహీంద్రా ఎక్స్‌యువి300 ఫేస్‌లిఫ్ట్ (Mahindra XUV300 Facelift)
ఒకప్పటి నుంచి భారతీయ మార్కెట్లో మంది అమ్మకాలు పొందిన మహీంద్రా కంపెనీ యొక్క ఎక్స్‌యువి300 త్వరలోనే ఫేస్‌లిఫ్ట్ రూపంలో లాంచ్ కావడానికి సిద్ధమవుతోంది. కంపెనీ ఈ SUV లాంచ్ గురించి అధికారికంగా ప్రకటించలేదు, కానీ ఇది మార్చి చివరి నాటికి లాంచ్ అవుతుందని భావిస్తున్నాము. ధరలు కూడా అధికారికంగా లాంచ్ సమయంలోనే వెల్లడవుతాయి. ఈ కారు దాని మునుపటి మోడల్ కంటే చాలా అప్డేటెడ్ డిజైన్, ఫీచర్స్ పొందనున్నట్లు సమాచారం.

బీవైడీ సీల్ ఈవీ (BYD Seal EV)
ఇండియన్ మార్కెట్లో అతి తక్కువ కాలంలోనే అధిక ప్రజాదరణ పొందిన బీవైడీ (బిల్డ్ యువర్ డ్రీమ్) కంపెనీ మార్చ్ 5న ముచ్చటగా తన మూడవ కారు 'సీల్' ఈవీను లాంచ్ చేయనున్నట్లు సమాచారం. సింగిల్ చార్జితో 570 కిమీ రేంజ్ అందించేలా రూపొందించిన ఈ ఎలక్ట్రిక్ కారు మార్కెట్లో కియా ఈవీ6, హ్యుందాయ్ ఐయోనిక్ 5 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.
బీవైడీ కంపెనీ లాంచ్ చేయనున్న కొత్త సీల్ ఎలక్ట్రిక్ కారు ఆధునిక డిజైన్ మరియు అంతకు మించిన ఫీచర్స్ పొందనుంది. ఇందులో లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. బీవైడీ సీల్ యొక్క ప్రారంభ ధర రూ. 55 లక్షలు ఉండవచ్చని అంచనా. అయితే కంపెనీ ఈ కారు ధరలను లాంఛ్ సమయంలో అధికారికంగా వెల్లడిస్తుంది. త్వరలో బుకింగ్స్ కూడా ప్రారంభమవుతాయని భావిస్తున్నాము.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








