జూన్ నెలలో విడుదల కాబోయే కార్లు, బైక్ చరిత్రలో నిలిచిపోతాయ్.. ఆ బైక్ కోసం ప్రపంచం మొత్తం మన వైపే చూడనుంది
జూన్ నెలలో రెండు కార్లు, ఒక బైక్ విడుదల కానున్నాయి. దాదాపు సంవత్సరం అర్ధభాగంలోకి చేరుకున్న తరుణంలో కార్లు, టూ-వీలర్ కంపెనీలు కాస్త నెమ్మదించాయని చెప్పవచ్చు. ఈ నెలలో కేవలం రెండు కార్లు ఒక బైక్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇందులో ఒక కారు ఒక బైక్ మధ్యతరగతి కుటుంబీకులను విపరీతంగా ఆకట్టుకోనున్నాయి. ఈ నెలలో విడుదల కాబోయే బైక్‌కి చాలా ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఇదే తొలిబైక్ కావడం వల్ల అంచనాలు అమాంత పెరిగిపోయాయి. ఈ నెలలో విడుదల కాబోయే ఆ కారు, బైక్ వివరాలు మీకోసం..
టాటా ఆల్ట్రోజ్ రేసర్: టాటా ఆల్ట్రోజ్ ఈ నెలలో ఆల్ట్రోజ్ రేసర్‌ని ఆ సంస్థ ఈ నెల 13న లాంచ్ చేయనుంది. ఈ కారు 1.2-లీటర్ మూడు సిలిండర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇదే ఇంజిన్ టాటా నెక్సాన్‌కి ఉపయోగించారు. ఈ ఇంజిన్ 120 PS శక్తిని మరియు 170 NM టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

తాజాగా విడుదల అయ్యే ఈ కారులోని ఎక్స్‌టీరీయర్‌తో పాటు ఇంటీరియర్‌లోనూ మార్పులు చేశారు. ఫ్రంట్ ప్యాసింజర్ వెంటిలేటెడ్ సీట్లు, వైర్లెస్ ఛార్జింగ్ సదుపాయం, ప్రొజెక్టర్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్, LED డీఆర్ఎల్ రియర్ ఏసీ వెంట్స్, వైర్‌లెస్‌తో కూడిన 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఇక సేఫ్టీ పరంగా చూస్తే ఆరు ఎయిర్ బ్యాగులు, హెడ్ బోర్డ్ డిస్ ప్లే, 360 డిగ్రీల కెమెరా, ఎలక్ట్రానిక్ సన్ రూఫ్ వంటి ప్రత్యేకతలున్నాయి. ఈ కారులో మరిన్నీ సేఫ్టీ ఫీచర్లను సంస్థ త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది. హ్యుందాయ్ ఐ10 N లైన్‌కి ఈ కారు గట్టి పోటీని ఇవ్వనుంది. దీని ధర రూ.10 లక్షలతో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

ఆడి క్యూ8 ఫేస్‌లిఫ్ట్: ఈ నెలలో విడుదల అయ్యే మరొక కారు ఆడి తన క్యూ8. ఈ కారును 2023 చివరిలో అంతర్జాతీయ మార్కెట్‌లో పూర్తి అప్‌డేట్‌లతో ఆ సంస్థ విడుదల చేసింది. ఇప్పుడు ఇండియాలో ఈ కారు విడుదలకు రంగం సిద్ధం చేశారు. పూర్తిగా మార్పులు చేసిన ఆడి Q8 ప్రత్యేకమైన ఫ్రంట్ గ్రిల్ డిజైన్, బంపర్‌లు, కొత్త డిజైన్ అల్లాయ్ వీల్స్, రీడిజైన్ చేయబడిన ఇంటీరియర్‌తో వస్తుంది.
ఈ కారు ఇంజన్ విషయానికి వస్తే, 3.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేయనుంది. ఇది 48 ఓల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌కు కనెక్ట్ చేయబడింది. ఈ కారు 340 PS పవర్ మరియు 500 Nm టార్క్ ఉత్పత్తి చేయనుంది. ఈ కారును జూన్‌లో విడుదల చేయనున్నట్లు ఇది వరకే సంస్థ ప్రకటించింది. అయితే విడుదల ఎప్పుడు అనే స్పష్టమైన తేదీని వెల్లడించలేదు.

బజాజ్ బ్రూజర్ లేదా బిటర్: బజాజ్ సంస్థ ఆటోమొబైల్ పరిశ్రమలోనే తొలిసారిగా CNG ఇంజిన్‌తో బైక్‌ని విడుదల చేయనుంది. బజాజ్ తన సీఎన్‌జీ బైక్‌ను 18వ తేదీన అధికారికంగా విడుదల చేయనుంది. దీనికి ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని సంస్థ వెల్లడించింది. ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ బైక్‌తో మంచి సేల్స్ వస్తాయని సంస్థ భావిస్తోంది. ఈ బైక్‌ను తక్కువ ధరలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
ఈ బైక్‌ను రూ.85,000 ఎక్స్-షోరూమ్ ధరతో విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ బైక్ పెట్రోల్ మరియు సీఎన్‌జీతో ఏకకాలంలో పనిచేసేలా రూపొందించినట్లు తెలుస్తుంది. బజాజ్ ఈ బైక్‌ను 125సీసీ ఇంజిన్‌తో తీసుకురానుంది. ప్రధానంగా ఈ బైక్‌ను అధిక మైలేజీ కోసం మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ బైక్‌ని కొందరు బ్రూజర్ అని, మరికొందరు బిటర్ అని అంటున్నారు.


Click it and Unblock the Notifications








