సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్ ఆటోమేటిక్ వేరియంట్ లాంచ్.. ఇకపై యాప్ ద్వారానే ఫ్యూయెల్‌ను కొనేయొచ్చు.!!
ప్రముఖ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్.. తన సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్ ఆటోమేటిక్ (AT) వేరియంట్‌ను విడుదల చేసింది. భారత మార్కెట్లో బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలో అందుబాటులోకి వస్తున్న ఆటోమేటిక్ మిడ్- సైజ్ ఎస్‌యూవీగా సంస్థ తెలిపింది. మూడు వేరియంట్లలో వస్తున్న ఈ కారు ధర, డిజైన్ ఫీచర్లు పూర్తి సమాచారం ఈ కథనంలో..
సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్ ఆటోమేటిక్ వేరియంట్‌ను రూ.12,84,800 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో సంస్థ విడుదల చేసింది. డిజైన్ పరంగా ఈ మిడ్ సైజ్ SUV 4.3 మీటర్ల పొడవుతో వస్తుంది. భారతీయ కుటుంబాలకు తగినట్లుగా ఈ కారును తయారుచేసినట్లు సంస్థ తెలిపింది.

సౌకర్యవంతంగా, విశాలవంతంగా ఇంకా ఆకట్టుకునే ఫీచర్ల ప్యాక్‌గా Citroen C3 Aircross AT ని అందుబాటులోకి వస్తోంది. సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ ఆటోమేటిక్ వేరియంట్ మిడ్-లెవెల్ SUV డిజైన్ దాని బోల్డ్ సిల్హౌట్, మస్కులర్ ఫ్రంట్-ఎండ్ మరియు 200mm హై గ్రౌండ్ క్లియరెన్స్‌తో ప్రత్యేకనతను సంతరరించుకుంటుంది.

సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్ ఆటోమేటిక్ వేరియంట్ స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకునే 10-అంగుళాల టచ్‌స్క్రీన్, కొత్త 7-అంగుళాల TFT క్లస్టర్ మరియు USB ఛార్జింగ్ ఫీచర్లతో వస్తుంది. బూట్ స్పేస్ విషయానికొస్తే 511 లీటర్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది. లాంగ్ జర్నీస్‌కు అనువుగా ఉండేలా అతి పెద్ద బూట్‌స్పేస్‌ను అందించారు.
Citroen C3 Aircross SUV ఆటోమేటిక్ వేరియంట్.. మాన్యువల్ గేర్ సెలెక్టర్ మోడ్‌తో అధిక-పనితీరు కలిగిన టార్క్ కన్వర్టర్ 6-స్పీడ్ AT గా వస్తోంది. 1.2-లీటర్, టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. 108.4 bhp వద్ద 205 NM టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. మాన్యువల్ వేరియంట్‌తో పోలిస్తే ఇది 15 NM టార్క్‌ను అదనంగా ఉత్పత్తి చేస్తుంది.

మైలేజ్ పరంగా చూసుకుంటే ARAI ధ్రువీకరించిన వివరాల ప్రకారం సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్ SUV AT మోడల్ 17.6 kmpl మైలేజ్‌ని అందిస్తుంది. కాగా ఆటోమేటిక్ వెర్షన్ రిమోట్ ఇంజిన్ స్టార్ట్ మరియు రిమోట్ AC ప్రీకాండిషనింగ్ వంటి అనుకూలమైన ఫీచర్లతో వస్తుందని సంస్థ వెల్లడించింది.
కాగా ఈ సారి కంపెనీ ఇన్-యాప్ మార్కెట్‌ప్లేస్ ఫ్యూలింగ్ ఫీచర్‌ను పరిచయం చేసింది. ఈ కాన్సెప్ట్ C3 Aircross SUV యజమానులు నేరుగా యాప్ ద్వారా ఇంధనాన్ని కొనుగోలు చేయవచ్చు. OTA అప్‌డేట్‌ల ద్వారా ఇప్పటికే ఉన్న కస్టమర్‌లకు సేవను విస్తరించే యోచనలో సంస్థ ఉంది. యాప్ ద్వారా ఇంధన కొనుగోళ్లను సులభతరం చేయడమే కాకుండా లాయల్టీ ప్రోగ్రామ్‌లు మరియు రివార్డ్ రిడెంప్షన్‌లను అందిస్తుంది.

అంతేకాకుండా Citroen కస్టమర్‌లు 100 శాతం ప్రత్యక్ష ఆన్‌లైన్ కొనుగోలు అనుభవాన్ని అందించడం ద్వారా కార్లను కొనుగోలు చేసే విధానాన్ని విప్లవాత్మకంగా సంస్థ మార్చనుంది. భారత్‌లోని ప్రధాన నగరాల్లో నివసించే వారు ఇప్పుడు ఫ్యాక్టరీ నుంచి నేరుగా తమ C3 ఎయిర్‌క్రాస్ SUVని ఆర్డర్ చేసుకోవచ్చు. తద్వారా సంస్థ మీకు ఇంటి వద్దకే డెలివరీ చేయడం ద్వారా లగ్జరీ అనుభవాన్ని పొందవచ్చు.

Citroen C3 Aircross AT వివిధ కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంది. బేస్ 'Plus AT 5 సీటర్' ధర రూ.12,84,800 గా ఉంది. 'Max AT 5 సీటర్' ధర రూ.13,49,800.. కాగా 'Max AT 5+2 సీటర్' ధర రూ.13,84,800 (ఎక్స్-షోరూమ్) ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications








