రేసింగ్ రోడ్‌స్టర్ ఎడిషన్‌లో న్యూ జెన్ స్విఫ్ట్.. ఇక రేసింగ్ ప్రియులకు పండగే..
స్విఫ్ట్ అభిమానులు గత కొంతకాలంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న న్యూ జెన్ మారుతి సుజుకి స్విఫ్ట్ కారు మోడల్‌ను గురువారం(May 09th) ఊహించని ధరతో సంస్థ లాంచ్ చేసింది. కాగా ఈ కార్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా, కంపెనీ ఓ స్పెషల్ ఎడిషన్ స్విఫ్ట్ కార్ మోడల్‌ను కూడా విడుదల చేసింది. ఇది స్విఫ్ట్ రేసింగ్ రోడ్‌స్టర్ ఎడిషన్..
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను సంస్థ ఐదు వేరియంట్లలో ప్రవేశపెట్టగా వీటి ధరలు రూ. 6.49 లక్షల నుంచి రూ. 9.65 లక్షల(ఎక్స్-షోరూరమ్) వరకు ఉన్నాయి. కాగా కస్టమర్ల కోసం మారుతి సుజుకి ఓ సర్‌ప్రైజ్‌ను కూడా అందించడం స్విఫ్ట్ అభిమానులను ఆకట్టుకుంటోంది. స్విఫ్ట్ రేసింగ్ రోడ్‌స్టర్ ఎడిషన్ (Swift Racing Roadster Edition) ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.

మారుతి సుజుకి ఈ వెర్షన్(2024 Maruti Suzuki Swift Launch)కు స్పోర్ట్స్ కార్ల మాదిరిగానే డిజైన్, హంగులు అద్దింది. ఎక్స్‌టీరియర్, బాడీ పార్ట్స్‌ను ప్రత్యేకమైన రంగులతో హుందాగా డిజైన్ చేసింది. అంతేకాకుండా, బానెట్‌పై నలుపు, తెలుపు చారలు మరియు ఎరుపు రంగు ఇన్సర్ట్‌లు కారుకు అదనపు స్పోర్టీ రూపాన్ని జోడిస్తున్నాయి.
కారు ముందు బంపర్, చక్రాలు మరియు డోర్లపై ఎరుపు రంగు ఇన్సర్ట్‌లు ఆకర్షణీయంగా ఉన్నాయి. దీనితో పాటు, పైకప్పు, వెనుక భాగంలో మరియు కారు దిగువ భాగంలో ఎరుపు రంగు ఇన్సర్ట్ అద్భుతంగా ఉంది. ఇటువంటి ప్రత్యేకమైన(New Gen Maruti Swift Launch) అలంకరణతో స్విఫ్ట్ రేసింగ్ రోడ్‌స్టర్ ఎడిషన్ మరింత అందంగా కనిపిస్తోంది.

మారుతి సుజుకీ ఈ రకమైన డెకరేషన్ వర్క్‌లను కారు వెలుపలి భాగంలోనే కాకుండా ఇంటీరియర్‌ల చూడవచ్చు. డాష్‌బోర్డ్, ఎంట్రన్స్, సీట్లు మరియు ఇతర భాగాల్లో ఎరుపు రంగు ఇన్సర్ట్‌లను జోడించింది. ఇది కాకుండా, ఈ కారులో కూడా స్పోర్ట్స్ కార్లలో అందించబడే సీట్లు ఉండటం విశేషం.
అంతేకాకుండా ఈ కారు డిజైన్ స్పోర్ట్స్ కారును తలపించడమే కాకుండా రైడ్ అనుభవం కూడా స్పోర్ట్స్ కార్లతో సమానంగా రూపొందించినట్లుగా తెెలుస్తోంది. ఈ మార్పుల ద్వారా సాధారణ స్విఫ్ట్ కార్ మోడల్‌కు, స్విఫ్ట్ రేసింగ్ రోడ్‌స్టర్ ఎడిషన్‌కు తేడాలను తెలియజేస్తుంది. అయితే ఈ రకమైన ట్రిమ్ స్విఫ్ట్ రేసింగ్ రోడ్‌స్టర్ ఎడిషన్ సాధారణ వెర్షన్ కంటే కొంచెం ఖరీదైనదిగా తెలుస్తోంది.

సాధారణ స్విఫ్ట్‌తో పోలిస్తే స్విఫ్ట్ Roadster Edition ధర రూ.30,900 నుంచి రూ.40,500 అధిక ధరకు విక్రయానికి అందుబాటులో ఉంటుందని ప్రస్తుతం అందుబాటులో ఉన్న నివేదికల ద్వారా తెలుస్తోంది. దీనితో పాటు, కస్టమర్లు ఈ డిజైన్ ఉపకరణాలను విడిగా కొనుగోలు చేయవచ్చని కంపెనీ పేర్కొంది.
ఇక రేసింగ్ రోడ్‌స్టర్ వెర్షన్‌లో ఈ కాస్మెటిక్ వర్క్ మినహా ఎలాంటి మార్పులు ఉండవని గమనించాలి. సాధారణ స్విఫ్ట్ మోడల్‌లో కూడా ఇదే ఇంజిన్‌ను ఉపయోగించారు. ఈ కారులో కొత్త Z సిరీస్ ఇంజిన్ ఉపయోగించడం ప్రత్యేకత. ఇది గరిష్ఠంగా 25.75 కి.మీ మైలేజీని అందిస్తుందని సంస్థ చెబుతోంది.

మారుతి స్విఫ్ట్‌లో 1.2 లీటర్ 3 సిలిండర్ ఇంజిన్‌తో పాటు ఈ ఫీచర్‌ను అందించడం గమనార్హం. కొత్త స్విఫ్ట్ మైలేజీ పరంగానే కాకుండా భద్రత పరంగా కూడా చాలా పటిష్ఠంగా ఉంది. తక్కువ ధరలోనే 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, EBDతో కూడిన ABS బ్రేకింగ్ సిస్టమ్ స్టాండర్డ్ ఫీచర్‌లను అందిస్తోంది.
భారతదేశంలో రేసింగ్ కార్ ప్రియులను ఆకర్షించే లక్ష్యంతో, మారుతి సుజుకి ఇప్పుడు స్విఫ్ట్ కార్ మోడల్‌లో కొత్త రేసింగ్ రోడ్‌స్టర్ ఎడిషన్‌ను తీసుకువచ్చింది. ఇప్పటికే మారుతి కార్లు సేల్స్ పరంగా టాప్ 1లో దూసుకుపోతున్నాయి. అంతేకాకుండా కొత్త స్విఫ్ట్ లాంచ్ అయిన 24 గంటల్లోనే 10,000 బుకింగ్‌లను అందుకుంది. ఈ కొత్త ఎడిషన్ కూడా అంతే స్థాయిలో ప్రజాదరణ పొందుతుందని సంస్థ భావిస్తోంది.


Click it and Unblock the Notifications








