2024 రెనాల్ట్ డస్టర్ SUV ఫొటోలు రివీల్.. ప్రీమియం ఫీచర్లు సహా ఆకట్టుకునే డిజైన్.!!
ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్‌కు చెందిన ఎస్‌యూవీ డస్టర్ మూడవ తరం ప్రీమియర్‌ను ఇటీవల పోర్చుగల్‌లో సంస్థ ఆవిష్కరించింది. 2025 ప్రారంభంలో ఈ SUV యూరోపియన్ మార్కెట్లోకి రానుంది. ఆ తర్వాత భారత మార్కెట్లోకి ప్రవేశించనుంది. ఈ క్రమంలో Renault Duster SUV ప్రీమియర్ ఫొటోలు కొన్ని విడుదలయ్యాయి.
రెనాల్ట్ డస్టర్ భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన SUVలలో ఒకటి. డస్టర్ ఐరోపా మరియు ఇతర ప్రపంచ మార్కెట్లలో రెనాల్ట్ గ్రూప్ (రెనాల్ట్ + డాసియా) యొక్క అత్యంత విజయవంతమైన మోడల్‌గా నిలిచింది. డాసియా లేదా డస్టర్ మోడల్ 2010 నుండి ఇప్పటివరకు 22 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేసి మోస్ట్ డిమాండెడ్ కారుగా నిలిచింది.

కాగా ఇప్పుడు కొత్తగా రాబోతున్న మూడవ తరం ప్రీమియం మోడల్(Renault Duster 2024).. 2024 రెనాల్ట్ డస్టర్ అన్ని కొత్త మెకానిక్‌లతో పాటు కొత్త స్టైలింగ్ మరియు మరింత అప్‌డేట్ చేయబడిన ఇంటీరియర్‌లతో మార్కెట్లోకి రానుంది. కొత్త తరం డాసియా డస్టర్‌ను రెనాల్ట్-నిస్సాన్ అలయన్స్ యొక్క CMF-B మాడ్యులర్ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించారు.
ఈ కొత్త రెనాల్ట్ డస్టర్ SUV ప్రొఫైల్‌లో, స్టైలింగ్ పరంగా(Renault Duster 3rd Gen) చాలా అధునాతన మార్పులు చేశారు. అంతే కాకుండా దీని సైజ్ కూడా పెరిగింది. ఈ కొత్త తరం మోడల్ మునుపటి మోడల్ కంటే కొంచెం పొడవుగా ఉంటుంది. దీని ద్వారా ఇది పెద్దదిగా మరియు స్పోర్టియర్ లుక్‌తో కనిపిస్తుంది.

ఈ క్రమంలో ఇప్పుడు ఈ కొత్త డస్టర్ SUV కి సంబంధించిన ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. రివీల్ అయిన ఫొటోలను పరిశీలిస్తే.. డస్టర్ SUV పెద్ద వీల్స్ మరియు స్లిమ్ హెడ్‌ల్యాంప్‌లతో కూడిన డబుల్-స్టాక్ గ్రిల్‌ను కలిగి ఉన్నట్లుగా తెలుస్తోంది. కాగా అదే సిల్హౌట్ ఐకానిక్ డస్టర్ ఆకారాన్ని కలిగి ఉంది.
కొత్త తరం రెనాల్ట్ డస్టర్ SUV వెనుక భాగంలో త్రిభుజాకార టెయిల్ ల్యాంప్స్ మరియు చంకీ బూట్ డోర్‌ను కలిగి ఉంది. ఇంటీరియర్ విషయానికొస్తే ఈ కొత్త డస్టర్‌లో పూర్తిగా రీడిజైన్ చేయబడిన డ్యాష్‌బోర్డ్ మరియు సెంట్రల్ కన్సోల్‌తో కూడిన సరికొత్త ఇంటీరియర్‌తో రానుంది. ఇంకా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ను కలిగి ఉంటుంది.

కాగా రెనాల్ట్ డస్టర్ బేస్ మోడల్ సెమీ-డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది కనెక్టివిటీ ఎంపికలతో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్‌తో వస్తుంది. ఇక కొత్త 2024 డస్టర్ అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) టెక్నాలజీతో రానుంది. అంతేకాకుండా రీడిజైన్ చేయబడిన ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ సెలెక్టర్ లివర్‌ను కలిగి ఉంటుంది.
కొత్త 2024 రెనాల్ట్ డస్టర్‌లో క్రూయిజ్ మరియు ఇన్ఫోటైన్‌మెంట్ కోసం కంట్రోలింగ్ ఆప్షన్‌తో కూడిన ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్‌ను కలిగి ఉంటుంది. కాగా ఇంటీరియర్ పరంగా క్యాబిన్ అంతటా కంపెనీ గట్టి ప్లాస్టిక్‌ను ఉపయోగించిందనే చెప్పవచ్చు. ఇక మునుపటి మోడల్‌తో పోలిస్తే, ఇది నాణ్యతలో మెరుగ్గా కనిపిస్తుందని తెలుస్తోంది. కొత్త రెనాల్ట్ డస్టర్ 4 లేదా 6 యూక్లిడియన్ హోల్డర్‌లను కలిగి ఉంటుంది.

టాబ్లెట్ హోల్డర్, బ్యాగ్, ఇండక్షన్ ఛార్జర్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్ హోల్డర్.. వాహనదారులకు అవసరమైన ఫీచర్లను ఇందులో చూడవచ్చు. ఇంజిన్ విషయానికొస్తే.. అధిక మైలేజ్‌ను అందించేందుకు 48V మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌తో ఇది పనిచేస్తుంది. డస్టర్ హైబ్రిడ్ రెండు ఎలక్ట్రిక్ మోటార్లతో 140bhp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. 1.6-లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది.


Click it and Unblock the Notifications








