30 కి.మీ మైలేజీ ఇచ్చే ఆ ఫేమస్‌ కారు గుర్తుపట్టలేనంతగా మారబోతోంది.. ఈ కారు లవర్స్‌కి ఇక పూనకాలే!

మారుతి సుజుకి డిజైర్‌ న్యూ జనరేషన్‌ని నవంబర్ 4, 2024 న విడుదల చేయడానికి సన్నాహకాలు చేస్తోంది. ఈ కొత్త తరం డిజైర్‌ మార్కెట్‌లో పెను సంచలనాలు సష్టించనుంది. ఈ కాంపాక్ట్ సెడాన్ తాజాగా అందుబాటులో ఉన్న స్విఫ్ట్ వెర్షన్‌తో కొన్ని ఫీచర్లను,డిజైన్‌ని పంచుకుంటుంది. ముఖ్యంగా క్యాబిన్‌లో అలాగే కారు ఇంటీరియర్‌లో మునుపటి మోడల్ కంటే ప్రీమియం ఎక్స్‌పీరియన్స్‌తో ఈ డిజైర్‌ విడుదల కానుంది. ఇందులో 9-ఇంచెస్‌ టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వైర్‌లెస్‌ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటివి జతచేసే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన రాబోయే ఫీచర్లు, ఇతర అంశాలకు సంబంధించిన వివరాలు ఈ కథనంలో..

ఈ సరికొత్త డిజైర్ స్విఫ్ట్ ఇంటీరీయర్‌లో వలె సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్, బిగ్‌ మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేతో రానుంది. అలాగే క్యాబిన్‌లో అప్‌డేటెడ్ డ్యూయల్ టోన్ డ్యాష్ బోర్డ్, ఇతర కంట్రోల్ ఫీచర్లతో కూడిన త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్ ఉండనుంది. దీంతో పాటు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, USB టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్‌ వంటి ఫీచర్లు డిజైర్‌కి అదనపు ఆకర్షణను అందించనుంది.

Maruti Dzire

కొత్త డిజైర్ 1.2 లీటర్ మూడు సిలిండర్ల Z12 E పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 82 bhp వద్ద 112nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారుని వినియోగదారులు 5-స్పీడ్ మాన్యువల్ లేదా AMT ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్‌లో ఎంచుకోవచ్చు. దీనిని సీఎన్‌జీ వెర్షన్‌లోనూ మార్కెట్‌లో అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. ఇది ఆ కారు సేల్స్‌ని పెంచడంతో పాటు మాస్‌ మార్కెట్‌కి మరింత దగ్గర చేయనుంది.

డిజైర్ పనితీరు కూడా అచ్చం స్విఫ్ట్‌ హ్యాచ్‌బ్యాక్ వెర్షన్‌ని పోలి ఉండనున్నాయి. ఈ డిజైర్‌ నేరుగా హోండా అమేజ్, టాటా టిగోర్, హ్యుందాయ్ ఆరా వంటి కార్లకు గట్టి పోటీని ఇస్తుంది. అలాగే మారుతి నుంచి ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో మార్కెట్లోకి వచ్చే తొలి కారు కూడా ఇదే కావడం గమనార్హం. ఇది కారుకు ప్రీమియం లుక్‌ని అందిస్తుంది.

New Gen Maruti Dzire

ఇక దీని ఎక్స్‌టీరియర్‌ డిజైన్‌ విషయానికి వస్తే దీని గ్రిల్, రీడిజైన్ బంపర్లు అప్‌గ్రేడ్స్‌తో రానుంది. పూర్తిగా రీ డిజైన్‌ చేసిన లైటింగ్ యూనిట్స్‌ దీనికి అదనపు లుక్‌ని అందించనుంది. ఈ సెడాన్‌లో కొత్త స్టైల్ 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉండనున్నాయి. ఇది కస్టమర్లను మరింతగా ఆకర్షించేందుకు కొత్త పెయింట్ ఆప్షన్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది.

పైన చెప్పిన విధంగా దీని రీడిజైన్ ప్రస్తుత మోడల్ లుక్‌తో పోల్చితే ఆకర్షణీయంగా ఉండనుంది. ఇది కాంపాక్ట్ సెడాన్ మార్కెట్‌లో ఇప్పుడు వాటికి గట్టి పోటీని ఇస్తున్నట్లే కొత్త అప్‌డేటెడ్‌ వెర్షన్‌తో దీని డిమాండ్‌ తారాస్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ కారు పూర్తి స్థాయిలో అమ్మకానికి వచ్చినప్పుడు ఇదే విషయం స్పష్టం అవుతుందని కంపెనీ బలంగా విశ్వసిస్తోంది.

మార్కెట్‌లో ప్రస్తుతం ఈ కారు చాలా కాలంగా మంచి అమ్మకాలను కలిగి ఉంది. ఈ అప్‌డేటెడ్‌ కారు కచ్చితంగా మార్కెట్‌లో మంచి అమ్మకాలను తెస్తుందని కంపెనీ ఆశలు పెట్టుకుంది. ఈ సరికొత్త లుక్‌తో వస్తున్న మారుతి సుజుకి సెడాన్ ఆ కంపెనీ సేల్స్‌లోనే ఓవరాల్‌గా మంచి లాభాలను తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. ఇందుకోసం ఈ సెడాన్‌ని అనేక మార్పులతో మార్కెట్‌లో విడుదల చేయడానికి మారుతి సుజుకి సిద్ధంగా ఉంది.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, October 22, 2024, 7:20 [IST]
English summary
New gen maruti dzire sedan expected major changes details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+