34 కి.మీ గ్యారంటీ మైలేజీతో కొత్త మారుతి డిజైర్‌ విడుదల.. సేఫ్టీలో 5-స్టార్, బంభాట్‌ ఫీచర్లు, ఇంకేం కావాలి?

కొత్త మారుతి సుజుకి డిజైర్‌ (New Maruti Suzuki Dzire) నేడు మార్కెట్‌లో అధికారికంగా విడుదల అయ్యింది. దీని రాక కోసం ఆటోమోబైల్‌ ఔత్సాహికులతో పాటు కారు ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు దీని విడుదలతో నిరీక్షణకు తెర పడింది. ఈ న్యూ జనరేషన్‌ సెడాన్‌ సరికొత్త అవతారంలో మార్కెట్‌లో అడుగుపెట్టింది. దీని డిజైన్, ఇంజిన్, మైలేజీ, ఫీచర్లు, పోటీదారులు, సేఫ్టీ, ధర పరంగా ఇలా అన్ని విభాగాల్లో ఓ ఆల్‌రౌండర్‌గా ఉంది. గత కొన్ని రోజుల క్రితం వరకు ఈ కారుకి సంబంధించిన అన్ని వివరాలను కంపెనీ వెల్లడించింది. ధరను మాత్రం ప్రకటించలేదు.

డిజైన్: కొత్త మారుతి సుజుకి డిజైర్‌ అప్‌డేటెడ్ ఫ్రంట్ గ్రిల్, ప్రొజెక్టర్ హెడ్ లైట్స్, LED DRLs తో వస్తుంది. అలాగే సైడ్‌ ఫ్రొఫైల్‌లో ఆకర్షణీయంగా కనిపించేలా 15-ఇంచెస్‌ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్‌ని అందించారు. మునుపటి వెర్షన్‌ కంటే స్లీక్‌ డిజైన్‌తో ఇది ఆకట్టుకుంటుంది. ఇక వెనుక భాగంలో షార్క్ ఫిన్ యాంటెనా, న్యూ టెయిల్‌లైట్స్‌ ఉన్నాయి. మొత్తానికి రోడ్డుపై వెళ్లే వారు ఈ కారుపై ఓ లుక్‌ వేసేలా రూపొందించారు.

New Gen Maruti Dzire Launch

ఇంజిన్: న్యూ జనరేషన్‌ డిజైర్ పెట్రోల్, సీఎన్‌జీ ఇంజిన్ ఆప్షన్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఈ రెండింటిలో న్యూ Z సిరీస్ 1.2-లీటర్ మూడు సిలిండర్ల ఇంజిన్ కలదు. పవర్‌ అవుట్‌ఫుట్‌ మాత్రం వేరుగా ఉంటుంది. పెట్రోల్ ఇంజిన్ 82 ps పవర్‌, 112 nm టార్క్‌ని ప్రొడ్యూస్‌ చేస్తుంది. ఇక సీఎన్‌జీ ఇంజిన్ 70 ps పవర్‌ని 102 nm టార్క్‌ని మాత్రమే విడుదల చేస్తుంది.

ఈ ఇంజిన్స్‌ 5-స్పీడ్ మ్యాన్యువల్, పెట్రోల్ ఇంజిన్‌లో అదనంగా AMT గేర్ బాక్స్ ఆప్షన్ ఉంది. కొత్త డిజైర్ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్లు లీటర్‌కి 24.79 కిలోమీటర్లు, AMT వేరియంట్లు 25.71 కిలోమీటర్ల మైలేజీని అందిస్తాయి. ఇక సీఎన్‌జీ మాన్యువల్ వేరియంట్‌ కిలోకు 33.73 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. టాక్సీ ప్లేయర్స్‌కి ఈ సీఎన్‌జీ ఆప్షన్‌ బెస్ట్‌ అని చెప్పవచ్చు.

New Gen Maruti Dzire Mileage

ఫీచర్లు: సరికొత్త మారుతి సుజుకి డిజైర్‌లో అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఇందులో వైర్‌లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 9-ఇంచెస్‌ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ మోబైల్‌ ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 360 డిగ్రీల కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతే కాకుండా రియర్ ఏసీ వెంట్స్, కీలెస్ ఎంట్రీ, పుష్ బటన్ స్టార్ట్ / స్టాప్, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్‌ వంటివి ఉన్నాయి.

సేఫ్టీ పరంగా ఇటీవలె డిజైర్‌ 5 స్టార్‌ రేటింగ్‌తో అదరగొట్టింది. ఇందులోని ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఎబిఎస్ విత్ ఇబిడి, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌ అన్ని వేరియంట్లలో స్టాండర్డ్‌గా అందిచారు. ఈ ఘనత సాధించిన మొట్టమొదటి మారుతి సుజుకి కారుగా అవతరించింది. ఈ క్రాష్‌ టెస్ట్‌తో మారుతిపై జనాలకు ఉన్న అపోహలు తొలగిపోనున్నాయి.

New Gen Maruti Dzire Price

ఈ సరికొత్త కారు మార్కెట్‌లోని హ్యుందాయ్ ఆరా, టాటా టిగోర్, హోండా అమేజ్ వంటి కార్లకు గట్టి పోటీని ఇస్తుంది. డిసెంబర్ 4 న విడుదలయ్యే ఇక హోండా అమేజ్ నెక్ట్స్ జనరేషన్ నేరుగా పోటీని ఇవ్వనుంది. దీనిని LXi, VXi, ZXi, ZXi + అనే 4 వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు. రెడ్, బ్లూ, బ్రౌన్, బ్లాక్, వైట్, గ్రే, సిల్వర్ లలో ఇష్టమైన కలర్‌ని కస్టమర్లు ఎంచుకోవచ్చు.

ధర: ఈ న్యూ జనరేషన్‌ ఎంట్రీ లెవల్ వేరియంట్ ధర రూ.6.79 లక్షలుగా నిర్ణయించారు. టాప్ వేరియంట్ ధర రూ.10.14 లక్షలుగా ఉంది. ఇవి ఎక్స్-షోరూమ్ ధరలు మాత్రమే. అయితే ఇవి కేవలం ప్రారంభ ఆఫర్ ధర మాత్రమేనని కంపెనీ పేర్కొంది. డిసెంబర్‌లో ధరలు పెరిగే అవకాశం ఉంది. ఆసక్తిగల వారు రూ .11,000 చెల్లించి ఈ కొత్త కారుని బుక్ చేసుకోవచ్చు.

More from DriveSpark

Article Published On: Monday, November 11, 2024, 13:48 [IST]
English summary
New gen maruti suzuki dzire launched at rs 6 79 lakhs check mileage and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+