కొత్త మారుతి డిజైర్ Vs హోండా అమేజ్ రెండింట్లో మొనగాడి కారు ఏదో తెలుసా?.. ఇది చూసి మీరే డిసైడ్ అవ్వండి!
మారుతి సుజుకి డిజైర్ (New Gen Maruti Dzire) నవంబర్ 11న మార్కెట్‌లో విడుదల అయ్యింది. సరికొత్త అప్‌గ్రేడ్స్‌తో మార్కెట్‌లో మారుతి డిజైర్ అడుగుపెట్టింది. మునుపటి జనరేషన్‌తో పోల్చితే ఇది అధునాతన ఫీచర్లు, సరికొత్త టెక్నాలజీతో మార్కెట్‌లో అడుగుపెట్టింది. తాజాగా మారుతి విడుదల చేసిన డిజైర్‌లో సన్‌రూఫ్ వంటి ఫీచర్లను సైతం జోడించారు. అంతే కాకుండా సేఫ్టీలో ఈ కారు 5 స్టార్ రేటింగ్‌ని సాధించింది. తద్వారా ఈ కారులోని ప్రయాణికులకు మెరుగైన సేఫ్టీ లభించనుంది. ఈ కారు మార్కెట్‌లో నేరుగా హోండా అమేజ్ (Honda Amaze)కి గట్టి పోటీని ఇస్తుంది. కొత్త డిజైర్, హోండా అమేజ్ మధ్య కీలక తేడాలపై ఓ లుక్కేయండి.
ఇన్ఫోటైన్‌మెంట్: డిజైర్ ఇన్ఫోటైన్మెంట్ 9 అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్ప్లేతో వస్తుంది. హోండా అమేజ్‌లో కేవలం 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్‌తో మాత్రమే వస్తుంది. అదనంగా డిజైర్ వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లేకు సపోర్ట్ చేస్తుంది. కానీ హోండా అమేజ్ ఇందుకోసం కేబుల్ అవసరం పడుతుంది. అయితే నెక్స్ట్ జనరేషన్ అమేజ్‌లో ఫీచర్లను అప్‌గ్రేడ్ చేసే అవకాశం ఉంది.

డిజైర్‌లో సింగిల్-పేన్ సన్‌రూఫ్ కలదు. ఇప్పటి వరకు ఉన్న జనరేషన్స్‌లో ఈ ఆప్షన్ అందుబాటులో లేదు. దీనికి సన్‌రూఫ్ జోడించడం వల్ల డిజైర్‌కి అదనపు లుక్ వచ్చింది. బేసికల్‌గా సన్‌రూఫ్ ఫీచర్ మార్కెట్‌లో చాలా ప్రాచుర్యం పొందింది. ఇది క్యాబిన్ లోపల ఎక్కువ బ్రైట్‌నెస్‌ని, మరింత గాలిని అనుమతించడానికి సహాయపడుతుంది. త్వరలో రాబోయే హోండా అమేజ్‌లో హోండా ఈ ఫీచర్‌ని జోడించవచ్చు.
డిజైర్ ప్రయాణీకుల సౌకర్యం కోసం వెనుక ఏసీ ఎయిర్ ఫిల్టర్‌ని కలిగి ఉంది, ఇది ప్రస్తుత అమేజ్‌లో లేదు. ఇక డిజైర్ ఫ్రంట్ సెంటర్ కన్సోల్‌లో వైర్‌లెస్ మోబైల్ ఛార్జర్ ఆప్షన్ ఉంది. ఇది కూడా అమేజ్‌లో అందుబాటులో లేదు. ఇక మ్యూజిక్ ప్రియుల కోసం, అమేజ్ కారులో నాలుగు స్పీకర్ల ఉండగా.. డిజైర్‌లో ఆరు స్పీకర్లు కలవు. ఇది మీ రైడింగ్‌లో మెరుగైన సౌండ్ అనుభూతిని అందిస్తుంది.

ఇక సేఫ్టీ పరంగా డిజైర్ పార్కింగ్ సౌకర్యం మంచి రైడింగ్ అనుభవం కోసం 360 డిగ్రీల సరౌండ్ కెమెరాను కలిగి ఉంది. ఇక అమేజ్‌లో మాత్రం కేవలం వెనుక కెమెరాను మాత్రమే అందిస్తుంది. డిజైర్‌లో టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) కలదు. ఇది డ్రైవర్లకు మెరుగైన డ్రైవింగ్ సౌకర్యాన్ని అలాగే అలర్ట్‌ని అందిస్తుంది. డిజైర్‌లో కొత్తగా ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC)ని జోడించారు.
ఈ ESC ఆప్షన్ జారిపోయే పరిస్థితుల్లో అకస్మాత్తుగా స్టీరింగ్ స్కిడ్ అవ్వకుండా సహాయపడుతుంది. అయితే ఈ ఫీచర్ అమేజ్‌లో అందుబాటులో లేకపోవడం గమనార్హం. డిజైర్‌లో అదనంగా కనెక్టెడ్ కార్ టెక్నాలజీ కలదు. ఇది ఓనర్స్‌కి నేరుగా స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ద్వారా రిమోట్‌గా యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది. ఇది కూడా హోండా అమేజ్‌లో లేదు. తద్వారా మీరు అమేజ్‌లో స్మార్ట్ కనెక్టివిటీని పొందలేరు.

ఇక న్యూ జనరేషన్ డిజైర్‌ని LXi, VXi, ZXi, ZXi + అనే 4 వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు. ఈ కారు ధర రూ. 6.79 లక్షల నుంచి రూ. 10.14 లక్షల మధ్య ఉంటుంది. ఇది హోండా అమేజ్, టాటా టిగోర్, హ్యుందాయ్ ఆరా వంటి కార్లతో పాటు మారుతి సుజుకి బాలెనో, టయోటా గ్లాంజా, హ్యుందాయ్ i20 వంటి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లకు గట్టి పోటీని ఇస్తుంది.
హోండా అమేజ్ ధరలు రూ. 7.29 లక్షల నుంచి ప్రారంభం అవుతాయి. అయితే డిజైర్ అన్ని ఎడిషన్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌ని స్టాండర్డ్‌గా అందించింది. అయితే హోండా అమేజ్ టాప్ వేరియంట్‌లో మాత్రమే 6 ఎయిర్‌బ్యాగ్స్ ఉన్నాయి. ఇక సేఫ్టీలో మారుతి సుజుకి డిజైర్ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ని కలిగి ఉంది. మార్కెట్‌లో ఇది కొత్తది కావడంతో జనాలు ఈ డిజైర్‌కే ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








