కొత్త మారుతి డిజైర్ Vs పాత డిజైర్.. ఇలాంటి మార్పులను ఎవ్వరూ ఊహించి ఉండరు!
మారుతి సుజుకి 4th జనరేషన్ డిజైర్‌ని నవంబర్ 11న మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ కొత్త మారుతి డిజైర్ ఫీచర్లు, సేఫ్టీ, డిజైర్ పరంగా పలు మార్పులతో మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చింది. సరికొత్త అవతారంలో వచ్చిన ఈ మారుతి సుజుకి కారు.. మార్కెట్‌లోని ఇతర కంపెనీ కార్లను గట్టి పోటీని ఇవ్వనుంది. అంతే కాకుండా ఇది ఇప్పటి వరకు అమ్మకానికి అందుబాటులో ఉన్న డిజైర్ కంటే కూడా ప్రత్యేకంగా ఉంది. అందుకే కొత్త డిజైర్ భారతీయుల దృష్టిని పెద్దగా ఆకర్షిస్తోంది. ఈ కథనంలో కొత్త డిజైర్, పాత డిజైర్ మధ్య తేడాలను తెలుసుకోండి. కొత్తగా ఎలాంటి ఫీచర్లు అప్‌గ్రేడ్స్ చేశారో ఆ వివరాలపై ఓ లుక్కేయండి.
డిజైన్: కొత్త డిజైర్ స్విఫ్ట్‌ని పోలి ఉంటుంది. ఇది సబ్ 4 మీటర్ సెడాన్ కావడంతో భారీ ఆకృతితో వస్తుంది. ఇలాంటి డిజైన్ మార్కెట్‌లో ఎప్పుడు ఫేవరేట్‌గానే ఉంటుంది. పాత డిజైర్ కంటే పూర్తి డిఫరెంట్ లుక్‌తో ఇది వస్తుంది. ప్రత్యేకమైన యాక్సెసరీస్, ఫీచర్లు.. గ్రిల్, హెడ్‌లైట్స్, LED DRLs, క్రోమ్ యాక్సెసరీస్, కొత్త అల్లాయ్ వీల్స్, బ్లాక్ ORVMs, P-పిల్లర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

మరీ ముఖ్యంగా, ఈ కారులోని ఫ్రంట్ హెడ్‌లైట్ పాత ఆడి కార్ల లైటింగ్ సిస్టమ్ వలె కనిపిస్తుంది. మారుతి సుజుకి పాత లేఅవుట్‌ని కూడా మార్చింది. వెనుక 'వై' ఆకారంలో స్టాప్ లైట్, క్రోమ్ కోటెడ్ స్ట్రిప్‌ని అందించారు. అయితే పాత డిజైర్ మోడల్‌లో ఈ ఫీచర్లు లేవు. కేవలం గ్రిల్, బానెట్, హెడ్‌లైట్ సెటప్ అన్నీ ఒకేలా ఉన్నాయి. బంపర్‌లో పెద్ద ఫాగ్ ల్యాంప్ ప్రత్యేకంగా ఉంటుంది.
స్పెసిఫికేషన్లు: కొత్త డిజైర్‌లో ఫీచర్లు ఎక్కువగా ఉన్నాయి. పాత డిజైర్‌లో 7 ఇంచెస్ స్క్రీన్ ఉండగా, కొత్త డిజైర్‌లో 9 అంగుళాల స్క్రీన్ ఉంది. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, 360 డిగ్రీల కెమెరా, వైర్‌లెస్ మోబైల్ ఛార్జింగ్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. కానీ, ఈ ఫీచర్లు పాత డిజైర్ కారు మోడల్లో ఇవి లేవు.

కొత్త డిజైర్‌లో ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, పుష్-బటన్ స్టార్ట్ అండ్ స్టాప్, క్రూయిజ్ కంట్రోల్, మిడ్-డిజిటల్ కనెక్టివిటీ, మల్టీపుల్ USB ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయి. సేఫ్టీ పరంగా ఆరు ఎయిర్‌బ్యాగ్స్, ఎబిఎస్ విత్ ఇబిడి, లేన్ కీప్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫీచర్లు గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ రేటింగ్‌ని పొందింది. ఇక పాత డిజైర్ కాస్త వెనుకబడి ఉంది.
ఇంజిన్: న్యూ జనరేషన్ డిజైర్ 1.2-లీటర్ త్రీ సిలిండర్ల Z 12 E ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది పెట్రోల్, సీఎన్‌జీ ఆప్షన్లలో లభిస్తుంది. పెట్రోల్ వెర్షన్ 82 ps, 112 nm టార్క్‌ని, సీఎన్‌జీ ఆప్షన్ 69.75 ps, 101.8 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. డిజైర్ మునుపటి వెర్షన్ కూడా సీఎన్‌జీ, పెట్రోల్ ఆప్షన్‌లో అందించబడింది. కానీ ఇందులో Kసిరీస్ ఇంజిన్‌ని ఉపయోగించారు.

ఇది 1.2-లీటర్ నాలుగు సిలిండర్ల మోటారుతో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా 90 bhp పవర్, 113 nm టార్క్‌ని విడుదల చేస్తుంది. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో 5-స్పీడ్ మాన్యువల్ లేదా AMT ఆప్షన్ ఉన్నాయి. ఇంజిన్ ఫర్ఫామెన్స్ పరంగా ఇది అప్‌గ్రేడ్స్‌తో వచ్చింది. కొత్త కారు ఫర్ఫామెన్స్ పరంగా అదరగొడుతుంది.
మైలేజీ: పాత డిజైర్ లీటర్ పెట్రోల్‌కి 22.5 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. సీఎన్‌జీ కిలోకు 31.12 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. కొత్త డిజైర్ పెట్రోల్ వేరియంట్ లీటరుకు 24 కిలోమీటర్ల నుంచి 25 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఇక సీఎన్‌జీ వేరియంట్ కిలోకు 34 కిలోమీటర్ల భారీ మైలేజీని అందిస్తుంది. ఇవన్నీ ARAI సర్టిఫై చేసిన మైలేజీ వివరాలు కావడం విశేషం.
ధర: ఫీచర్లు, మైలేజీ పెరగడం వల్ల ధరను కూడా స్వల్పంగా పెంచారు. పాత డిజైర్ రూ. రూ.6.57 లక్షల ప్రారంభ ధరతొ కొనుగోలు చేయవచ్చు. న్యూ జనరేషన్ ధర రూ. 6.79 లక్షలకు పెరిగింది. అదేవిధంగా దీని గరిష్ట ధర కూడా రూ. 10.14 లక్షలకు పెరిగింది. పాత వెర్షన్ ధర 9.34 లక్షలుగా మాత్రమే ఉండేది. ఇవన్నీ ఎక్స్ షోరూమ్ ధరలే.


Click it and Unblock the Notifications








